Video: ఐపీఎల్ హిస్టరీలోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు.. వీడియో చూస్తే నవ్వాల్సిందే..
ఐపీఎల్ 2025లో 9వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌కు గెలవడానికి గుజరాత్ టైటాన్స్ 197 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీనికి సమాధానంగా, ముంబై 8 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. వరుసగా రెండు ఫోర్లు కొట్టిన తర్వాత రోహిత్ శర్మ ఔటయ్యాడు. మహమ్మద్ సిరాజ్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు.

Slowest Ball In IPL: నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో, ఆతిథ్య జట్టు బోర్డులో భారీ స్కోరు దిశగా దూసుకుపోతోంది. శుభ్‌మాన్ గిల్, జోస్ బట్లర్, సాయి సుదర్శన్ ముంబై బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నారు.
శుభ్‌మాన్ గిల్ అర్ధ సెంచరీని కోల్పోగా, బట్లర్, సాయి మాత్రం ముంబై బౌలర్లపై విరుచుకపడ్డారు. ఈ క్రమంలో ముంబై జట్టు వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. సత్యనారాయణ రాజుపై నమ్మకంతో బౌలింగ్‌కు ఆహ్వానించింది. ఆంధ్రకు చెందిన ఈ క్రికెటర్ ఓ డెలివరీతో మైదానంలో నవ్వులు పూయించాడు.
క్రికెట్‌లో అత్యంత విచిత్రమైన బంతి..
Waited, waited… & muscled! 💪#JosButtler had enough time to put that one away to the boundary! 😁
Watch the LIVE action ➡ https://t.co/VU1zRx9cWp #IPLonJioStar 👉 #GTvMI | LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi, & JioHotstar pic.twitter.com/FEghx6ALa4
— Star Sports (@StarSportsIndia) March 29, 2025
మ్యాచ్‌లో తన మొదటి ఓవర్‌లో సత్యనారయణ రాజు బట్లర్‌కు బౌలింగ్ చేయాల్సి వచ్చింది. షార్ట్ బాల్ వేసే క్రమంలో అంచనా మిస్సయ్యాడు. దీంతో బంతి బట్లర్‌ను చేరుకోవడానికి చాలా సమయం తీసుకుంది. బంతి చాలా స్లోగా రావడంతో బట్లర్ నిరాశకు గురి కాకుండా.. ఎంతో ఓపికతో ఎదురుచూసి, ఆపై దానిని బౌండరీకి తరిలించాడు.
ఆ డెలివరీ చూసి బట్లర్‌తో సహా అభిమానులు ఆశ్చర్యపోయారు. ఈ క్రమంలో బట్లర్ తన నవ్వును అదుపు చేసుకోలేకపోయాడు. అయితే, బట్లర్ తన ప్రారంభాన్ని భారీ స్కోరుగా మార్చడంలో విఫలమయ్యాడు. తరువాతి ఓవర్లో ముజీబ్ ఉర్ రెహమాన్ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు. 39 (24) పరుగులు చేసి ఔట్ అయ్యాడు.
కాగా, ఐపీఎల్ 2025లో 9వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌కు 197 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ నిర్దేశించింది. దీనికి సమాధానంగా, ముంబై 8 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. వరుసగా రెండు ఫోర్లు కొట్టిన తర్వాత రోహిత్ శర్మ ఔటయ్యాడు. మహమ్మద్ సిరాజ్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. ఒక ఓవర్ ముగిసేసరికి ముంబై జట్టు ఒక వికెట్ కోల్పోయి 9 పరుగులు చేసింది. తిలక్ వర్మ, రియాన్ రికెల్టన్ క్రీజులో ఉన్నారు.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముంబై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 196 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ 41 బంతుల్లో 63 పరుగులు చేశాడు. అతను 4 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టాడు. సాయి కాకుండా జోస్ బట్లర్ 39 పరుగులు, శుభ్‌మాన్ గిల్ 38 పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా 2 వికెట్లు పడగొట్టాడు. ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, ముజీబుర్ రెహమాన్, ఎస్ రాజు తలా ఒక వికెట్ పడగొట్టారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








