GT vs MI, IPL 2025: వీడు మగాడ్రా బుజ్జీ.. ముంబైకి ఇచ్చిపడేసిన సుదర్శన్.. టార్గెట్ ఎంతంటే?
GT vs MI, IPL 2025: ఐపీఎల్ 2025 9వ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతోంది. ముంబై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 196 పరుగులు సాధించింది. దీంతో ముంబై ఇండియన్స్ జట్టుకు 197 పరుగుల టార్గెట్ లభించింది. గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లలో సాయి సుదర్శన్ ఒక్కడే హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.

దీపక్ చాహర్ బౌలింగ్‌లో షర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (18 పరుగులు) అవుట్ చేశాడు. అలాగే సాయి సుదర్శన్ (63 పరుగులు) ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యుగా అవుట్ అయ్యాడు.
హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో షారుఖ్ ఖాన్ (9 పరుగులు)తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ (38 పరుగులు) ను కూడా హార్దిక్ అవుట్ చేశాడు. జోస్ బట్లర్ (39 పరుగులు) ను ముజీబ్ ఉర్ రెహమాన్ వెనక్కి పంపాడు.
రెండు జట్ల ప్లేయింగ్-11..
గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, ఆర్ సాయి కిషోర్, రషీద్ ఖాన్, కగిసో రబాడ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గ్లెన్ ఫిలిప్స్.
ముంబై ఇండియన్స్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ముజీబ్ ఉర్ రెహమాన్, ట్రెంట్ బౌల్ట్, సత్యనారాయణ రాజు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..