Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. వైరల్‌గా మారిన మియా సెలబ్రేషన్స్.. ఆ గొడవకు ఫుల్‌స్టాప్ పడేనా?

Mohammed Siraj Bowled Rohit Sharma Video: రోహిత్ శర్మ నాయకత్వంలో 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న భారత జట్టులో మహమ్మద్ సిరాజ్ లేడనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సిరాజ్ బాహాటంగానే కెప్టెన్ రోహిత్ శర్మపై విమర్శలు గుప్పించినట్లు వార్తలు కూడా వినిపించాయి. పాత బంతితో అంత ఎఫెక్ట్‌గా కనిపంచడంటూ రోహిత్ చెప్పడంతో ఇద్దరి మధ్య వివాదం మొదలైంది.

Video: రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. వైరల్‌గా మారిన మియా సెలబ్రేషన్స్.. ఆ గొడవకు ఫుల్‌స్టాప్ పడేనా?
Gt Vs Mi 9th Match, Siraj Bowled Rohit Sharma Video
Follow us
Venkata Chari

|

Updated on: Mar 30, 2025 | 12:20 AM

Mohammed Siraj Bowled Rohit Sharma Video: రోహిత్ శర్మ నాయకత్వంలో 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న భారత జట్టులో మహమ్మద్ సిరాజ్ లేడు. ఈ క్రమంలో సిరాజ్ బాహాటంగానే కెప్టెన్ రోహిత్ శర్మపై విమర్శలు గుప్పించినట్లు వార్తలు కూడా వినిపించాయి. పాత బంతితో అంత ఎఫెక్ట్‌గా కనిపంచడంటూ రోహిత్ శర్మ కామెంట్ చేయడంతో.. ఈ ఇద్దరి మధ్య వాతావరణం చెడిందని తెలుస్తోంది. అయితే, ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2025లో అందరి ఫోకస్ గుజరాత్ వర్సెస్ ముంబై మ్యాచ్‌పై నెలకొన్నాయి. ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో రోహిత్‌ వర్సెస్ సిరాజ్ అన్నట్లుగా సోషల్ మీడియాలో వార్ నడిచింది. ఇక ఐపీఎల్ 2025లో భాగంగా శనివారం నాడు జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మపై భారత పేసర్ సిరాజ్ పగ తీర్చుకుని, తనపై వచ్చిన విమర్శలకు గట్టిగా ఆన్సర్ చేశాడని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

ముఖ్యంగా, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఇరుజట్లు తలపడ్డాయి. ఇరుజట్లు తమ పాయింట్ల ఖాతాను ఓపెన్ చేయాలని చూస్తున్నాయి. టాస్ ఓడిన గుజరాత్ టైటాన్స్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో మొత్తం 196 పరుగులు చేసింది.

ఇవి కూడా చదవండి

రోహిత్ శర్మను బోల్తా కొట్టించిన మహ్మద్ సిరాజ్..

భారీ స్కోరును ఛేదించేందుకు ముంబై జట్టు ఓపెనర్లు రోహిత్ శర్మ, రియాన్ రికెల్టన్‌లు బరిలోకి దిగారు. వీరి నుంచి అద్భుతమైన ఆరంభం వస్తుందని అంతా ఆశించారు. ఇదే క్రమంలో రోహిత్ గుజరాత్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో వరుసగా 2 బౌండరీలు బాది, మాంచి ఊపులో కనిపించాడు.

అయితే, సిరాజ్ అద్భుతంగా పునరాగమనం చేశాడు. భారత పేసర్ ఆఫ్ స్టంప్ లైన్ వద్ద మంచి లెంగ్త్ డెలివరీని బౌలింగ్ చేశాడు. ఇది అంచనా వేయలేకపోయన రోహిత్ బౌల్డ్ అయ్యాడు. రోహిత్ శర్మ బంతిని డిఫెండ్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ, డిఫెన్స్ మిస్సవ్వడంతో బంతి బెయిల్స్‌ను పడగొట్టింది. దీంతో మాజీ ఎంఐ కెప్టెన్ నిరాశగా పెవిలియన్ చేరాడు.

రోహిత్ ఔటైన వెంటనే, సిరాజ్ క్రిస్టియానో ​​రొనాల్డో వింటేజ్ ‘కాల్మా’ స్టైల్‌తో సంబరాలు చేసుకున్నాడు. శుభ్‌మాన్ గిల్ కూడా సిరాజ్‌ను అనుకరిస్తూ వేడుకలో పాల్గొన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..