Nirjala Ekadashi 2023: నేడు నిర్జల ఏకాదశి.. ఈ రోజున చేసే అన్నదానం, నీటి దానానికి ఎంత విశిష్ఠతో తెలుసా..

ఈ రోజున శ్రీ హరిని పూజిస్తారు. విష్ణువును ఆరాధించడం వల్ల మహాలక్ష్మిప్రసన్నం అవుతుందని విశ్వాసం. నిర్జల ఏకాదశి రోజున పూర్తి క్రతువులతో పూజించి, వ్రతాన్ని ఆచరించిన వారి సర్వపాపాలనుండి విముక్తి లభించి మోక్షం లభిస్తుందని విశ్వాసం. ఈ రోజు చేయాల్సిన దానాలు, పాటించాల్సిన నియమాల గురించి తెల్సుకుందాం.. 

Nirjala Ekadashi 2023: నేడు నిర్జల ఏకాదశి.. ఈ రోజున చేసే అన్నదానం, నీటి దానానికి ఎంత విశిష్ఠతో తెలుసా..
Follow us

|

Updated on: May 31, 2023 | 8:18 AM

విష్ణు భక్తులు నిర్జల ఏకాదశి ఉపవాసం జ్యేష్ఠ శుక్ల ఏకాదశి రోజున ఆచరిస్తారు. హిందూమతంలో ఏకాదశిని చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. ప్రతి నెలలో రెండు ఏకాదశులు, ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. అయితే ఈ ఏడాది అధిక మాసం కావడంతో 26 ఏకాదశులు జరుపుకోనున్నారు. హిందూ సనాతన ధర్మంలో ఒక్కో ఏకాదశికి ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది. ఈ నేపథ్యంలో నిర్జల ఏకాదశికి విశిష్ట ప్రాముఖ్యత ఉంది. నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల ఏడాది పొడవునా అన్ని ఏకాదశుల చేసిన ఫలాలు వ్రతాన్ని చేయకుండానే పొందుతారు. నిర్జల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారు కనీసం నీరుని కూడా తీసుకోరు. ఈ రోజున శ్రీ హరిని పూజిస్తారు. విష్ణువును ఆరాధించడం వల్ల మహాలక్ష్మిప్రసన్నం అవుతుందని విశ్వాసం. నిర్జల ఏకాదశి రోజున పూర్తి క్రతువులతో పూజించి, వ్రతాన్ని ఆచరించిన వారి సర్వపాపాలనుండి విముక్తి లభించి మోక్షం లభిస్తుందని విశ్వాసం. ఈ రోజు చేయాల్సిన దానాలు, పాటించాల్సిన నియమాల గురించి తెల్సుకుందాం..

పూజకు శుభ సమయం: నిర్జల ఏకాదశి ఈ రోజు అంటే మే 30 మధ్యాహ్నం 1:00 నుండి ప్రారంభమైంది. ఈ రోజు మధ్యాహ్నం 1:45 వరకు కొనసాగుతుంది.  ఈ రోజు శ్రీమహావిష్ణువు, మహాలక్ష్మిలను పూజిస్తే ప్రసన్నులవుతారు.

నిర్జల ఏకాదశి నాడు ఉపవాసం, పూజ ఎలా చేయాలంటే నిర్జల ఏకాదశి ఉపవాసం చాలా కష్టం. ఈ వ్రత నియమం దశమి నుండే ప్రారంభమవుతుంది. దశమి నాడు అన్నంతో చేసినవి తినకూడదు.. మరోవైపు ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారు నీళ్లు కూడా తాగరాదు.  సూర్యోదయానికి ముందే ఉదయాన్నే లేచి తలస్నానం చేయాలి. పసుపు రంగు బట్టలు ధరించి విష్ణువును పూజించడం ప్రారంభించండి. ముందుగా, పసుపు వస్త్రాన్ని పరచి ఒక పీఠాన్ని ఏర్పాటు చేసి శ్రీమహావిష్ణువు చిత్రాన్ని ఉంచి.. ఆపై పసుపుతో తిలకం దిద్దండి. శ్రీ హరికి పసుపు పువ్వులు , పసుపు పండ్లు, స్వీట్లను సమర్పించాలి. పూజ సమయంలో ఏకాదశి వృత్తాంతాన్ని పఠించి, హారతి చేసి పూజను పూర్తి చేయండి.

ఇవి కూడా చదవండి

రోజంతా నిర్మలమైన భక్తితో శ్రీమహావిష్ణువుని ధ్యానిస్తూ ఉపవాసం చేయండి. ఎవరిని తిట్టవద్దు. ఏకాదశి రోజు నుంచి మర్నాడు వరకూ ఎటువంటి ఆహారాన్ని తీసుకోరాదు. మర్నాడు స్నానం చేసి సూర్యునికి నైవేద్యం  సమర్పించి ఉపవాస దీక్ష విరమించండి. తర్వాత ఆహారం, పండ్లు మొదలైనవి దానం చేయండి. నిర్మలమనస్సుతో ఉపవాసం చేస్తే శ్రీ విష్ణువు అనుగ్రహిస్తాడు. పుణ్యం లభిస్తుంది.

ఈ రోజు ఏ పని చేయరాదంటే..  నిర్జల ఏకాదశి నాడు నల్లని వస్త్రాలు ధరించవద్దు. పసుపు రంగు దుస్తులను మాత్రమే వాడండి.

నిర్జల ఏకాదశి రోజున తామసిక ఆహారం తినకూడదు. మద్యం, మాంసాహారం, వెల్లుల్లి, ఉల్లిపాయలను ఆహారంగా తీసుకోవద్దు

నిర్జల ఏకాదశి రోజున పొరపాటున కూడా అన్నం, పప్పు తినకూడదు.. ఈ రోజు అన్నం తినడం వల్ల వచ్చే జన్మలో పురుగు జన్మ లభిస్తుందని విశ్వాసం.

నిర్జల ఏకాదశి రోజున జుట్టు మరియు గోర్లు కత్తిరించవద్దు లేదా షేవ్ చేయవద్దు.

చేయాల్సిన దానాలు 

ఏకాదశి రోజున మీ శక్తి కొలది ఏ దానం చేసినా మంచిదని జ్యోతిష్యులు చెబుతున్నారు. యధాశక్తి విష్ణువు పూజించి ఆకలి అన్నవారికి అన్న దానం చేస్తే ఆర్ధిక లాభం కలుగుతుంది. నీటిని దానం చేయడం వలన పితృ దోషం నుంచి బయటపడతారు. గొడుగు, చెప్పులు దానం చేసే జీవితంలో సుఖ శాంతులు కలుగుతాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).

Latest Articles
కాలికి నల్ల దారం ఎందుకు కట్టుకుంటారో తెలుసా.?
కాలికి నల్ల దారం ఎందుకు కట్టుకుంటారో తెలుసా.?
నానబెట్టిన ఎండు ద్రాక్ష నీటిని ఇలా తాగితే సగం రోగాలు పరార్!
నానబెట్టిన ఎండు ద్రాక్ష నీటిని ఇలా తాగితే సగం రోగాలు పరార్!
'అందరినీ ఒకేసారి అరెస్ట్ చేయండి'.. జైల్ భరోకి కేజ్రీవాల్ పిలుపు..
'అందరినీ ఒకేసారి అరెస్ట్ చేయండి'.. జైల్ భరోకి కేజ్రీవాల్ పిలుపు..
తొలి 7 మ్యాచ్‌ల్లో ఒకే విజయం.. 15 రోజుల్లో మారిన ఆర్‌సీబీ
తొలి 7 మ్యాచ్‌ల్లో ఒకే విజయం.. 15 రోజుల్లో మారిన ఆర్‌సీబీ
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
అక్కడ వర్షాలకు వజ్రాలు దొరుకుతాయి.. రత్నాల వేటలో స్థానికులు..
అక్కడ వర్షాలకు వజ్రాలు దొరుకుతాయి.. రత్నాల వేటలో స్థానికులు..
ముగ్గురు చెప్పుల వ్యాపారుల ఇళ్లలో ఐటీ సోదాలు.. ఓ గది తెరవగా!
ముగ్గురు చెప్పుల వ్యాపారుల ఇళ్లలో ఐటీ సోదాలు.. ఓ గది తెరవగా!
పాపం అమ్మాయిలు.! స్నాక్స్ తింటుండగా ఏంటి ఇలా జరిగింది..
పాపం అమ్మాయిలు.! స్నాక్స్ తింటుండగా ఏంటి ఇలా జరిగింది..
ఈ 5 లక్షణాలు.. కడుపు క్యాన్సర్‌కు ముందస్తు సంకేతాలు కావొచ్చు..
ఈ 5 లక్షణాలు.. కడుపు క్యాన్సర్‌కు ముందస్తు సంకేతాలు కావొచ్చు..
ఒక నెల పాటు పప్పులు తినడం మానేస్తే మీ శరీరంపై ఎలాంటి ప్రభావం..
ఒక నెల పాటు పప్పులు తినడం మానేస్తే మీ శరీరంపై ఎలాంటి ప్రభావం..