AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ganesh Puja Tips: బుధవారం గణేశుడిని ఇలా పూజించండి .. చేపట్టిన ప్రతి పనిలో విజయం మీ సొంతం..

ఏదైనా శుభ కార్యం చేసే ముందు, పని మొదలు పెట్టె ముందు గణేశుని నామస్మరణ చేయడం వల్ల ఆ కార్యం ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతమవుతుంది. బుధవారం నాడు ఏ  పద్ధతిలో పూజిస్తే గణపతి అనుగ్రహం కలుగుతుంది.. ఆయన్ని ఎలా ప్రసన్నం చేసుకోవాలో తెలుసుకుందాం.. 

Ganesh Puja Tips: బుధవారం గణేశుడిని ఇలా పూజించండి .. చేపట్టిన ప్రతి పనిలో విజయం మీ సొంతం..
Lord Ganesha Puja
Surya Kala
|

Updated on: May 31, 2023 | 7:40 AM

Share

హిందూ మతంలో గణేశుడు మొదట పూజలను అందుకుంటాడు. శుభకార్యాలు, ఫంక్షన్ల పూజలకు ముందు మాత్రమే కాదు ఏదైనా దేవతను పూజించే ముందు గణపతిని పూజిస్తారు. గణపతి పూజ తర్వాతే ఏదైనా కార్యక్రమం చేపడితే.. ఆ పని ఎటువంటి విఘ్నలు లేకుండా జరుగుతాయని హిందువుల విశ్వాసం.  ఆది పూజ్యుడు గణపతికి బుధవారం అంకితం చేయబడింది. ఏ భక్తుడైనా ఈ రోజున కార్యసిద్ధి కలిగించే వినాయకుడిని భక్తి శ్రద్దలతో ఆరాధిస్తే, అతని అన్ని దుఃఖాలు తొలగిపోయి జీవితంలో సుఖ సంపదలు వస్తాయని విశ్వాసం. ఏదైనా శుభ కార్యం చేసే ముందు, పని మొదలు పెట్టె ముందు గణేశుని నామస్మరణ చేయడం వల్ల ఆ కార్యం ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతమవుతుంది. బుధవారం నాడు ఏ  పద్ధతిలో పూజిస్తే గణపతి అనుగ్రహం కలుగుతుంది.. ఆయన్ని ఎలా ప్రసన్నం చేసుకోవాలో తెలుసుకుందాం..

గణపతిని ఎలా ప్రసన్నం చేసుకోవాలంటే  బుధవారం రోజున గణేశుడిని పూజించే ముందు పంచామృతంతో అభిషేకం చేసి జలాభిషేకం చేసి నూతన వస్త్రాలు ధరించాలి. పూజ సమయంలో గజాననునికి దర్భలను సమర్పించాలు. గణపతికి మోదకం చాలా ప్రీతికరమైనది. అందుకే నైవేద్యంలో మోదకం సమర్పించాలి. అయితే గణపతి పూజలో పొరపాటున కూడా తులసిని ఉపయోగించకూడదని గుర్తుంచుకోండి.

గణపతి అనుగ్రహం   బుధవారం గణేష్ పూజ సమయంలో గణేష్ స్త్రోత్రం, గణేష్ చాలీసా పఠించడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. రాత్రిపూట చెడు కలలు వస్తూ ఉంటె .. అటువంటి వారు బుధవారం గణేష్ చాలీసాను పఠించడం అత్యంత ఫలవంతం. గణపతిని పూజించిన తర్వాత దేవుడికి హారతి చేసి 108 గణపతి నామాలను జపించి దర్భలను నైవేద్యంగా పెట్టండి. గణేశ స్తోత్రం పఠించిన వ్యక్తికి అన్ని సమస్యలు దూరమవుతాయని విశ్వాసం.

ఇవి కూడా చదవండి

ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి మంచి రోజు  ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి బుధవారం మంచి రోజుగా పరిగణించబడుతుంది. ఏదైనా కొత్త పని ప్రారంభానికి బుధవారం శుభదినం. చాలా శుభప్రదం. ఈ రోజు వ్యాపారంతో పాటు ఇతర శుభ కార్యాలు కూడా చేయడం ఎంతో శ్రేయస్కరం.

వినాయకుడి అనుగ్రహానికి ఏవి సమర్పించాలంటే.. 

జీవితంలో కష్టాలు, బాధలతో ఇబ్బంది పడుతుంటే బుధవారం వినాయకుడు పూజ అత్యంత శ్రేష్టం. అంతే కాదు గణేశుడికి సింధూరం సమర్పించడం వలన సుఖ సంతోషాలు కలుగుతాయని విశ్వాసం. అంతేకాదు  గజాననుడి పూజలో తమలపాకుకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. పూజలో గణపతికి తమలపాకులు తప్పనిసరిగా సమర్పించాలి. అంతేగాదు పూజలో దేవుడికి నైవేద్యంగా అరటి పళ్లు తప్పనిసరిగా ఉండాలి.    అరటిపండు గజాననునికి చాలా ప్రీతికరమైనది. అందుకే పూజ సమయంలో అరటిపండు తప్పనిసరిగా సమర్పించాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).