AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astro Tips for Gangajal: ఇంట్లో గంగాజలాన్ని పెట్టడానికి, పూజకు కొన్ని నియమాలున్నాయి.. లేదంటే కష్టాలు తప్పవట

చాలా మంది హిందువుల ఇళ్లల్లో గంగాజలం లేదా ఇతర పవిత్ర నదీ జలాలు ఖచ్చితంగా ఉంటాయి. పురాణ గ్రంధాలలో గంగా జలం లేదా ఏదైనా పవిత్ర నది నీటిని ఇంట్లో ఉంచాలన్నా కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ నియమాలను పాటించాలి. పాటించకపోతే అశుభ ఫలితాలు వస్తాయి.

Astro Tips for Gangajal: ఇంట్లో గంగాజలాన్ని పెట్టడానికి, పూజకు కొన్ని నియమాలున్నాయి.. లేదంటే కష్టాలు తప్పవట
Astro Tips For Gangajal
Surya Kala
|

Updated on: May 30, 2023 | 9:27 AM

Share

సనాతన ధర్మంలో గంగా నది చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది . గంగా నదిని తల్లిగా భావించి పూజిస్తారు. గంగాజలాన్ని తాకడం వల్ల పాపాలు నశిస్తాయి. ప్రత్యేక సందర్భాలలో గంగా నదిలో ఖచ్చితంగా స్నానం చేస్తారు. పూజలో గంగాజలం ఉపయోగిస్తారు. చాలా మంది హిందువుల ఇళ్లల్లో గంగాజలం లేదా ఇతర పవిత్ర నదీ జలాలు ఖచ్చితంగా ఉంటాయి. పురాణ గ్రంధాలలో గంగా జలం లేదా ఏదైనా పవిత్ర నది నీటిని ఇంట్లో ఉంచాలన్నా కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ నియమాలను పాటించాలి. పాటించకపోతే అశుభ ఫలితాలు వస్తాయి.

ప్లాస్టిక్ సీసాలో పవిత్ర జలాన్ని నిల్వ చేయవద్దు

సాధారణంగా ప్రజలు గంగాజలాన్ని ప్లాస్టిక్ బాటిల్‌లో ఉంచుతారు. ప్లాస్టిక్ సీసాలో ఉంచిన గంగా జలం  అశుద్ధంగా మారుతుంది. కాబట్టి ఇలా చేయకూడదు. అలాంటి నీటిని ఉపయోగించడం మంచిది కాదు. గంగాజలం ఎల్లప్పుడూ రాగి , ఇత్తడి, వెండి లేదా మట్టి పాత్రలో ఉంచాలి. వీలుకాకపోతే గాజు సీసాలో కూడా గంగాజలం నిల్వచేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

మురికి చేతులతో తాకవద్దు

గంగాజలాన్ని లేదా ఏదైనా పవిత్ర జలాన్ని మురికి చేతులతో తాకకూడదు. అలా చేయడం నిందలకు దారి తీస్తుంది. స్నానం చేసిన తర్వాత శుభ్రమైన బట్టలు ధరించి, శుభ్రమైన చేతులతో పవిత్రంగా తాకాలి .

ఇంట్లో పూజలు 

గంగాజలాన్ని ఎప్పుడూ పడకగదిలో, వంటగదిలో లేదా భోజనాల గదిలో ఉంచకూడదు . అలాగే బాత్రూమ్ దగ్గర కూడా ఉంచకూడదు. గంగాజలాన్ని ఎప్పుడూ పవిత్ర స్థలంలో అంటే పూజగదిలో ఉంచాలి. మరోవైపు నాన్‌వెజ్‌ చేసే ఇళ్లలో గంగాజలాన్ని కూడా ఉంచకూడదు. ఇలా చేయడం పాపంగా పరిగణించబడుతుంది.

బహిష్టు సమయంలో తాకవద్దు

బహిష్టు సమయంలో స్త్రీలు లేదా బాలికలు గంగాజలాన్ని తాకకూడదు .

గ్రహణం సమయంలో

సూర్యగ్రహణం, చంద్రగ్రహణం సమయంలో గంగాజలాన్ని తాకకూడదు. అదే సమయంలో బిడ్డ పుట్టే సమయంలో సూతకం, మైల సమయంలో కూడా గంగా జలాన్ని తాకకూడదు.

శుభ్రమైన ప్రదేశంలో ఉంచండి

గంగాజలం ఉంచే ప్రదేశం శుభ్రంగా ఉండాలి. అంతేకాదు గంగాజలం చుట్టూ చెత్త, చీపురు లేదా చెత్తబుట్టను ఉంచకూడదు. గంగాజలాన్ని శుభ్రమైన , పవిత్రమైన ప్రదేశంలో మాత్రమే ఉంచండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).