- Telugu News Photo Gallery Spiritual photos Chanakya niti these people acts as hindrance in life always keep distance with them in telugu
Chanakya Niti: మీ జీవితంలో సమస్యలు రాకూడదా.. అయితే ఇలాంటి వ్యక్తులకు దూరంగా ఉండమంటున్న చాణక్య
ఆచార్య చాణక్యుడి విధానాల ప్రకారం.. జీవితంలో కొంతమంది వ్యక్తులు మీ సమస్యలను తగ్గించడానికి బదులుగా వాటిని పెంచేలా చేస్తారు. కనుక అటువంటి వ్యక్తుల నుంచి వీలైనంత దూరం ఉండాలని చాణక్యుడు చెప్పాడు. ఆ వ్యక్తులు ఎవరో తెలుసుకుందాం.
Updated on: May 29, 2023 | 1:24 PM

అసూయ: ఆచార్య చాణక్యుడు ప్రకారం.. మీ పట్ల అసూయపడే వ్యక్తి నుండి ఎల్లప్పుడూ దూరం ఉండాలి. మీ విజయాలకు లేదా సంపద చూసి అసూయపడే .. లేదా కుళ్లుకునే వ్యక్తుల నుండి దూరంగా ఉండండి. వీరి స్నేహం ప్రతికూల భావోద్వేగాలను కలిగించవచ్చు. లేదా హానికలిగించవచ్చు. లేదా అల్లకల్లోలానికి దారి తీయవచ్చు. అంతేకాదు జీవితంలో కొన్ని మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉన్నా అసూయ పరులు ఆ అవకాశాలను మీ దగ్గరకు చేరనివ్వకుండా చేస్తారు.

అస్థిర ఆలోచనలు: స్నేహితులు లేదా కొన్ని గుంపుల మధ్య అసమ్మతిని కలిగించే, లేదా వారిని విడదీసే ప్రవర్తన కలిగిన వ్యక్తుల పట్ల జాగ్రత్త వహించండి. బంధాలను విడదీసేందుకు అసమ్మతి బీజాలు నాటి.. అనవసర వివాదాలు సృష్టించే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని చాణక్యుడు సూచిస్తున్నాడు.

మూర్ఖులు: జ్ఞానం లేని వారి నుండి లేదా తమ జీవితానికి సంబంధించి చెడు నిర్ణయాలు తీసుకునే వారి నుండి దూరం ఉండాలని చాణక్యుడు చెప్పాడు. ఇటువంటి వారు తీసుకునే పనుల వలన మీ స్వంత నిర్ణయాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ఒకొక్కసారి జరగాల్సిన పని కూడా ఆగిపోతుంది.

మద్దతు, ప్రోత్సాహం: ఆచార్య చాణక్య ప్రకారం వైవాహిక జీవితంలో భార్యాభర్తలు ఒకరికొకరు మద్దతుగా నిలవాలి. వీరి మధ్య సంబంధం బలపడుతుంది. వ్యక్తిగత లక్ష్యాలు, ఆకాంక్షలను కొనసాగించడంలో జీవిత భాగస్వామి మద్దతు ప్రేరణ, ప్రోత్సాహం ఇస్తుంది. ఒకరు విజయం సాధిస్తే.. ఇద్దరూ కలిసి ఆ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోండి.

అహంకారి: చాణక్యుడి ప్రకారం అహంకారం వ్యక్తి పతనానికి కారణం. మితిమీరిన అహంకారాన్ని లేదా అహంకారాన్ని ప్రదర్శించే వ్యక్తుల నుండి ఎల్లప్పుడూ దూరం ఉంచాలి. వారి ప్రవర్తన అనవసర వివాదాలకు లేదా సంబంధాలలో ఉద్రిక్తతకు దారి తీస్తుంది. వీటి వల్ల మీ గౌర, మర్యాదలకు కూడా భంగం వాటిల్లుంటుంది. చాణక్యుడు స్నేహం చేసే వ్యక్తుల గురించి అంచనా వేయడం, విచక్షణను ఉపయోగించాలని విశ్వసించాడు.





























