- Telugu News Photo Gallery Spiritual photos The Kashmir Yatra with Shivpuri Sacred Ashram is filled with peace and spirituality. See Photos
కశ్మీర్ యాత్ర ప్రశాంతతను, ఆనందాన్ని కలిగిస్తుంది: అనంత్ విభూషిత్ స్వామి నారాయణన్ గిరిజీ మహారాజ్
కాశ్మీర్ యాత్ర, ఉత్తరాఖండ్, హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ మరియు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల గుండా తమ ప్రయాణం సాగిందన్నారు.
Updated on: May 28, 2023 | 9:58 PM

శాంతి మరియు ఆధ్యాత్మికతకు స్వర్గధామం అయిన శివపురిలోని పవిత్ర ఆశ్రమంలో కాశ్మీర్ యాత్ర ఆనందానికి కారణం అవుతుందని మహామండలేశ్వర్ శ్రీ శ్రీ 1008 అనంత్ విభూషిత్ స్వామి నారాయణన్ గిరిజీ మహారాజ్ పేర్కొన్నారు.

కశ్మీర్ యాత్రలో బాగంగా మా ప్రయాణం ఉత్తరాఖండ్, హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల గుండా సాగుతుందని నారాయణ్ నానద్ గిరిజీ మహారాజ్ తెలిపారు.

ఇవాళ జరిపిన పూజ తమ ప్రయాణానికి శుభారంభాన్ని ఇస్తుందన్నారు.

మంత్రి ప్రేమ్ చంద్ అగర్వాల్, మేయర్ అనితా మామ్‌గైన్ తమ ప్రయాణ మార్గంలో 1,00,008 చెట్లను నాటాలని నిర్ణయించడం జరిగిందన్నారు.

మన దేశం కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసిన వీర జవాన్లను మనస్ఫూర్తిగా స్మరించుకుంటున్నామని తెలిపారాయన.

తమ తీర్థయాత్ర ముగింపులో.. పవిత్రమైన గంగానది నుండి 1,008 కలశాల్లో నీటిని ఉపయోగించి పరమేశ్వరుడికి అభిషేకం చేయడం జరుగుతుందని వివరించారు.

ఈ కార్యక్రమం కశ్మీర్ యాత్రకు ప్రశాంతతను కలిగిస్తుందన్నారు మహారాజ్. ప్రకృతితో సంబంధాన్ని బలోపేతం చేస్తుందన్నారు.

ఈ యాత్ర ప్రారంభంలో భాగంగా ఆశ్రమంలో పూజలు నిర్వహించారు.

మహామండలేశ్వర అవధూత్ ఆనంద్ అరుణ్ గిరి మహరాజ్, మహామండలేశ్వర్ శ్రీ శ్రీ 1008 అనంత్ విభూషిత్ స్వామి శ్రీ నారాయణ్ నానద్ గిరిజీ మహారాజ్ ఈ పూజలో కీలక పాత్ర పోషించారు.





























