Hyderabad: ఆదాయపు పన్ను శాఖలో ఇంటి దొంగలు.. పన్ను చెల్లింపుదారులను బెదిరించి డబ్బు వసూళ్లు
ఐటీలో ఇంటి దొంగలు. ఆదాయపు పన్ను విభాగానికే ఐటీ ఉద్యోగులు షాకిచ్చిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇది. ఒక అధికారం చేతిలో ఉందని సామాన్యుల జేబుల్లో చేతులు దూర్చి లక్షలు కొల్లగొట్టారు! ఈఎపిసోడ్‌లో బెదిరింపులు, అవినీతి, డబ్బు వసూళ్లు—అన్నీ ఉన్నాయి! ఏం జరిగిందో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం...

హైదరాబాద్ ఆదాయపు పన్ను శాఖలో పనిచేస్తున్న ఐదుగురు అధికారులపై సీబీఐ కేసు నమోదైంది. వీళ్లతో పాటు ఓ చార్టెడ్ అకౌంట్ పేరూ సీబీఐ కేసుడైరీలోకి చేరింది. ఎక్కువ మొత్తంలో ఐటీ రీఫండ్‌లు క్లెయిమ్ చేసిన వ్యక్తుల డేటాను దుర్వినియోగం చేసి, వారిని బెదిరించి డబ్బు వసూలు చేసినట్లు ఆరోపణల నేపధ్యంలో కేసు ఫైల్ అయింది. ఆరోపణలు ఎదుర్కొంటువారిలో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, ముగ్గురు సీనియర్ టాక్స్ అసిస్టెంట్లు ఉన్నారు. వీరంతా హైదరాబాద్ ఐటీ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నవారే.
2023 జూన్ 23న ఆదాయపు పన్ను విభాగం ఒక ఎక్సెల్ జాబితాను పంపింది, ఇందులో ఎక్కువ రీఫండ్‌లు క్లెయిమ్ చేసిన వ్యక్తుల వివరాలు ఉన్నాయి. ఈ జాబితాను తొలగించాలని సీనియర్ అధికారి ఆదేశించినా…క్వామర్ ఔలం ఖాన్ , మనీష్ సిక్రావాల్ ఆలిస్ట్‌ను తొలగించకుండా తమవద్దే దాచుకుని…బ్లాక్‌మెయిల్ దందాకు తెరలేపారు. వీళ్లిద్దరూ ఈ డేటాను ఉపయోగించి…ఐటీ రిటర్న్స్‌లో సమస్యలున్నాయని…జరిమానా కట్టకుంటే జైలే గతని తమ లిస్ట్‌లో ఉన్న పన్ను చెల్లింపుదారులను బెదిరించేవారు. అధికారిక ఈమెయిల్ చిరునామాల నుంచి మెస్సేజ్‌లు పంపి, అదనపు డాక్యుమెంట్లు సమర్పించాలంటూ భయపెట్టేవాళ్లు. తరువాత జరిమానా పేరుతో డబ్బు డిమాండ్ చేసేవారు. ఈ లావాదేవీలలో చార్టర్డ్ అకౌంటెంట్ భగత్ కీలక పాత్ర పోషించారు. ఎవర్నైతే ఐటీ అధికారులు బెదిరిస్తారో..ఆలిస్ట్ చార్టర్డ్ అకౌంటెంట్ భగత్‌కు చేరుతుంది. ఆ లిస్ట్ ప్రకారం డబ్బులు వసూలు చేసి ఆ ఐదుగురు అధికారులకు చేరవేసేవాడు.
సీబీఐ దర్యాప్తులో లావాదేవీలన్నీ యూపీఐ ద్వారా జరిగినట్లు తేలింది. రూ. 20,000 నుంచి రూ. 1,00,000 వరకు ఉన్న లావాదేవీలు భగత్ ఖాతాకు, అలాగే అధికారులు. వారి కుటుంబ సభ్యుల ఖాతాలకు బదిలీ అయినట్లు గుర్తించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో క్వామర్ ఔలం ఖాన్, మనీష్ సిక్రావాల్, గుల్నాజ్ రవూఫ్, కుతాడి శ్రీనివాస్ రావు, మొహమ్మద్ జావీద్ ఉన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.