Hyderabad: హైదరాబాద్ ఫేమస్ మెహందీ ఆర్టిస్ట్ పింకీ ఆత్మహత్య
రాజేంద్రనగర్, అత్తాపూర్ లో విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌లో టాప్ మెహందీ ఆర్టిస్ట్ పింకీ చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలియవచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. డీటేల్స్ ఇలా...

హైదరాబాద్ నగరంలో మెహందీ ఆర్టిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకున్న పింకీ ఆత్మహత్యకు పాల్పడింది. రాజేంద్రనగర్ అత్తాపూర్‌లో చున్నీతో ఉరివేసుకొని తను చనిపోయింది. స్పాట్‌కు చేరుకున్న పోలీసులు.. క్లూస్ టీం సాయంతో ఆధారాలు సేకరించి.. డెడ్‌బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా సంవత్సరం క్రితం అమిష్ లోయా అనే వ్యక్తితో కోర్టు వివాహం చేసుకుంది పింకీ. భర్తతో విబేధాలతోనే పింకీ ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు కోణాల్లో విచారణ చేస్తున్నారు.
అందుతోన్న సమాచారం మేరకు.. అమిష్ లోయా అనే వ్యక్తితో సంవత్సరం క్రితం పింకీకి పెళ్లయింది. కొన్నాళ్లకు వారి కాపురంలో విబేధాలు మొదలయ్యాయి. భర్త పింకీ శర్మను అప్పుడప్పుడు ఇంట్లో పెట్టి లాక్ చేసేవాడని చెబుతున్నారు. శుక్రవారం రాత్రి కూడా దంపతుల మధ్య వాగ్వాదం జరిగిందని సమాచారం. దీంతో పింకీ శర్మను ఇంట్లో పెట్టి బయటకు వెళ్లిపోయాడట ఆమె భర్త. కొంతసేపటి తర్వాత తిరిగొచ్చేసరికి పింకీ శర్మ చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించింది. దీంతో కంగారుపడిపోయిన అమిష్ వెంటనే పక్కింటి వాళ్లను పిలిచాడు. వారి సాయంతో పింకీని కిందకు దించి హాస్పిటల్‌కు తరలించాడు. కానీ ఫలితం లేకపోయింది. అప్పటికే పింకీ శర్మ మరణించిందని వైద్యులు నిర్ధారించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
