Srivari Temple: కరీంనగర్‌లో తిరుమల తరహాలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన .. సాయంత్రం శోభాయాత్ర, శ్రీనివాస కళ్యాణం..

కరీంనగర్ పట్టణం గోవింద నామస్మరణలతో మార్మోగుతోంది. ఉదయం ఏడు గంటల 20 నిమిషాలకు శ్రీవారి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమాన్ని విశేష పూజల్ని టిటిడి వేద పండితులు నిర్వహించారు. 

Srivari Temple: కరీంనగర్‌లో తిరుమల తరహాలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన .. సాయంత్రం శోభాయాత్ర, శ్రీనివాస కళ్యాణం..
Knr
Follow us
Shaik Madar Saheb

| Edited By: Surya Kala

Updated on: May 31, 2023 | 9:34 AM

తెలంగాణలోని ప్రముఖ పట్టణం కరీంనగర్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువు దీరనున్నాడు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి దేవస్థానముల శ్రీ వేంకటేశ్వరుని ఆలయ నిర్మాణానికి అంగరంగ వైభవంగా శంకుస్థాపన కార్యక్రమం జరుగుతోంది. రాష్ట్ర మంత్రివర్యులు గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో విశేషమైన పూజా కార్యక్రమాలు ఈ ఉదయం నుండే ప్రారంభమయ్యాయి. కరీంనగర్ పట్టణం గోవింద నామస్మరణలతో మార్మోగుతోంది. ఉదయం ఏడు గంటల 20 నిమిషాలకు శ్రీవారి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమాన్ని విశేష పూజల్ని టిటిడి వేద పండితులు నిర్వహించారు.

అంతకుముందు ఉదయం టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డిని మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, టిటిడి లోకల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ భాస్కరరావు, ఎంపీ దీవకొండ దామోదర్ రావు సాదర స్వాగతం పలికి దేవాలయ నిర్మాణ ప్రాంగణానికి ఆహ్వానించారు. ప్రత్యేక అతిథులుగా విచ్చేసిన గజరాజులు కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తులను అలరిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సాయంత్రం 4 గంటలకు మంకమ్మ తోట వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుండి పద్మానగర్ వరకు శోభాయాత్ర నిర్వహించనున్నారు. సాయంత్రం ఆలయ నిర్మాణ స్థలంలో శ్రీనివాస్ కళ్యాణం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు టీటీడీ అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..