Sunday Puja Tips: జీవితంలో డబ్బు కొరత లేకుండా ఉండాలంటే.. ఆదివారం సాయంత్రం సూర్యుడికి ఈ పరిహారాలు చేసి చేసిచూడండి..

ఎవరి జీవితంలో ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటుంటే.. ఆదివారం సాయంత్రం కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకుంటే జీవితంలో సంపదకు ఎప్పుడూ కొరత ఉండదని విశ్వాసం. అంతేకాదు ఆదివారం సూర్యుడిని పూజించడం ద్వారా మానవునికి ఉన్న అన్ని రోగాలు కూడా దూరమవుతాయి.

Sunday Puja Tips: జీవితంలో డబ్బు కొరత లేకుండా ఉండాలంటే.. ఆదివారం సాయంత్రం సూర్యుడికి ఈ పరిహారాలు చేసి చేసిచూడండి..
Sun Day Puja Tips
Follow us
Surya Kala

|

Updated on: Jun 04, 2023 | 8:10 AM

హిందూ మత గ్రంధాల ప్రకారం ఆదివారం ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడికి అంకితం చేయబడింది. ఆదివారం సూర్యదేవునికి అర్ఘ్యం సమర్పించడం ద్వారా జీవితంలోని ఏర్పడిన సమస్యలనుంచి బయటపడతారని.. ఆరోగ్యంగా ఉంటారని విశ్వాసం. ప్రత్యక్ష దైవంగా భావించే సూర్యభగవానుడుని రోజూ పూజించి అర్ఘ్యం సమర్పించినా.. ఆయనకు అంకితం చేసిన ఆదివారం రోజు పూజించడం మరింత ఫలవంతమని విశ్వాసం. ఎవరి జీవితంలో ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటుంటే.. ఆదివారం సాయంత్రం కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకుంటే జీవితంలో సంపదకు ఎప్పుడూ కొరత ఉండదని విశ్వాసం. అంతేకాదు ఆదివారం సూర్యుడిని పూజించడం ద్వారా మానవునికి ఉన్న అన్ని రోగాలు కూడా దూరమవుతాయి. త్రేతాయుగం, సత్యయుగం, ద్వాపర, కలియుగంలో సూర్యుడు ప్రత్యక్ష దైవంగా పూజలను అందుకున్నాడని  పురాణాల కథనం.

ఎవరైనా జీవితంలో ఆరోగ్యకరమైన శరీరం, సంపద, ఆనందం, శాంతిని కోరుకుంటే ఆదివారం కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఆదివారం తీసుకోవలసిన కొన్ని సాధారణ చర్యల గురించి ఈ రోజు తెలుసుకుందాం..

ఆదివారం సాయంత్రం చేయాల్సిన పరిహారాలు 

ఇవి కూడా చదవండి
  1. ఆదివారం సాయంత్రం రావి చెట్టు కింద దీపం వెలిగించడం వల్ల ఇంట్లో సుఖశాంతులు, శాంతి, ఐశ్వర్యం లభిస్తాయని విశ్వాసం. ఇలా చేయడం వల్ల మనిషి ప్రాపంచిక సుఖాన్ని పొందుతాడని నమ్మకం.
  2. అయితే ఆదివారం రావి చెట్టు కింద దీపం వెలిగించే దీపానికి నాలుగు ముఖాలుగా ఉండాలనే నియమం ఉంది. ఇలా చేయడం వలన వ్యక్తికి సమాజంలో గౌరవం పెరిగి, పనిలో పురోభివృద్ధికి అవకాశాలు మెండుగా ఉంటాయని విశ్వాసం.
  3. వ్యాపారంలో అభివృద్ధి కోసం శనీశ్వరుడిని ఆదివారం పూజించడం విశేష ఫలితాలను ఇస్తుంది. ఆదివారం శని దేవుడిని ఆరాధించడం వల్ల వ్యాపారంలో లాభాలు చేకూరుతుందని విశ్వాసం.
  4. ఆదివారం సాయంత్రం దానం చేయడం శుభప్రదం. ముఖ్యంగా నల్ల నువ్వులు, నల్ల గుడ్డ, నల్ల ఉసిరి లేదా ఎండుమిర్చి ఆదివారం సాయంత్రం తప్పనిసరిగా దానం చేయాలి. ఇలా చేయడం జీవితంలో ఆనందం కలుగుతుందని విశ్వాసం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).