- Telugu News Photo Gallery Spiritual photos Trikona raja yoga on June 17th 2023, will bless three zodiac native with huge success
Trikona Raj Yoga: ఈ నెల 17 నుంచి త్రికోణ రాజ యోగం.. ఐదు నెలలు ఈ మూడు రాశులకు డబ్బే డబ్బు..
జ్యోతిష్య శాస్త్రంలో శనవగ్రహాల్లో శనీశ్వరుడికి ప్రముఖ స్థానం ఉంది. కర్మ ప్రదాత శని ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రయాణం చేయడానికి రెండున్నర ఏళ్ళు సమయం పడుతుంది. శని ప్రయాణం ఆయా రాశుల వ్యక్తుల జీవితంలో భారీ మార్పులు చోటు చేసుకుంటాయి.
Updated on: Jun 03, 2023 | 11:37 AM

న్యాయాధిపతి అయిన శనీశ్వరుడు వక్ర దృష్టి జాతకంపై ప్రభావం చూపిస్తుంది. ఆ సమయంలో వ్యక్తి జీవితంలో కష్టాలు ఏర్పడతాయని చెబుతారు. మరోవైపు శని అనుగ్రహం ఉంటే బిచ్చగాడైనా రాజు కాగలడు. కుంభరాశిలో శని తిరోగమనం జూన్ 17వ తేదీ 2023న జరుగుతుంది. రాత్రి 10:48 నిమిషాలకు శని తిరోగమనాన్ని ప్రారంభించి 5 నెలల పాటు తిరోగమనం లోనే ఉంటుంది. నవంబర్ 4వ తేదీ ఉదయం 8:26 నిమిషాల వరకు శని తిరోగమనంలోనే ప్రయాణం చేస్తుంది. కుంభరాశిలో శని తిరోగమన చలనం కేంద్ర త్రికోణ రాజయోగాన్ని సృష్టిస్తుంది. శని తిరోగమనం వల్ల ఏర్పడే త్రికోణ రాజయోగం మూడు రాశుల జీవితంలో మంచి ఫలితాలను ఇస్తుంది.

మేష రాశి : శని తిరోగమన సంచారం వల్ల ఏర్పడే కేంద్ర త్రికోణ రాజయోగం మేషరాశి వారికి చాలా ప్రయోజనాలను ఇస్తుంది. ఈ వ్యక్తులు ఆర్ధిక ప్రయోజనాలను పొందవచ్చు. ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. దీర్ఘకాలిక సమస్య ముగుస్తుంది. వ్యాపారంలో విజయం సాధిస్తారు.

వృషభ రాశి : శని తిరోగమన సంచారం వలన ఏర్పడిన కేంద్ర త్రికోణ రాజయోగం వృషభ రాశికి పట్టిందల్లా బంగారం అవుతుంది. కొత్త ఉద్యోగం కోసం వేడుకుతున్నవారి ఫలితాన్ని పొందుతారు. మంచి స్థితికి చేరుకుంటారు.

సింహ రాశి : శని త్రికోణ రాజయోగం సింహ రాశి వారికి చాలా లాభాలను ఇస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. లక్ష్మీదేవి ఆశీస్సులతో అనేక విధాలుగా ఆదాయం వస్తుంది. పనిలో విజయం ఉంటుంది. (గమనిక : ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు,సమాచారంపై ఆధారపడి ఇవ్వబడింది. టీవీ9 తెలుగు న్యూస్ దీనిని వీటిని నిర్ధారించలేదు.)





























