Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Deities Idols Vastu Rules: ఇంట్లో దేవుని విగ్రహాన్ని ఉంచడానికి వాస్తు నియమాలున్నాయి.. అవి ఏమిటంటే..

పూజ చేసే ప్రాంతంలో అందమైన దేవుళ్ల పటాలను, విగ్రహాలను ప్రతిష్టిస్తారు. పూజాదికార్యక్రమాలు నిర్వహిస్తారు.  అయితే కొన్ని సమయంలో చాలా తప్పులు జరుగుతాయి. దీనివల్ల పూజలు చేసిన శుభ ఫలితాలు అందవు. పూజ గదిలో దేవుడి విగ్రహం ఏర్పాటు చేయడానికి కూడా కొన్ని నియమాలున్నాయి. ఈ విషయం చాలా మందికి తెలియదు.

Deities Idols Vastu Rules: ఇంట్లో దేవుని విగ్రహాన్ని ఉంచడానికి వాస్తు నియమాలున్నాయి.. అవి ఏమిటంటే..
Deities Idols Vastu Rules
Follow us
Surya Kala

|

Updated on: Jun 04, 2023 | 7:03 AM

హిందూ మతంలో దేవాలయం, పూజల కు అత్యధిక ప్రాముఖ్యత ఉంది. భగవంతునిపై విశ్వాసం లేని మానవుడు బహు అరుదు అని చెప్పవచ్చు. కాలంతో పోటీ పడుతూ పరుగులు పెడుతున్న జీవితంలో, ప్రతిరోజూ గుడికి వెళ్లడం సాధ్యం కాదు. అందుకే ఇళ్ళలో పూజలు చేయడానికి వీలుగా దేవుడి కోసం పూజ గదిని ఏర్పాటు చేసుకుంటారు. తద్వారా దేవుడి అనుగ్రహం కుటుంబంపై ఉంటుంది. ఎల్లప్పుడూ సానుకూలత ఉంటుంది. ప్రస్తుత కాలంలో ప్రతి ఇంట్లో అందమైన పూజ గదిని నిర్మిస్తున్నారు.  ఆ పూజ చేసే ప్రాంతంలో అందమైన దేవుళ్ల పటాలను, విగ్రహాలను ప్రతిష్టిస్తారు. పూజాదికార్యక్రమాలు నిర్వహిస్తారు.  అయితే కొన్ని సమయంలో చాలా తప్పులు జరుగుతాయి. దీనివల్ల పూజలు చేసిన శుభ ఫలితాలు అందవు. పూజ గదిలో దేవుడి విగ్రహం ఏర్పాటు చేయడానికి కూడా కొన్ని నియమాలున్నాయి. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఈ నియమాలను విస్మరిస్తే పూజల వల్ల ప్రయోజనం ఉండదు. ఇంట్లోని పూజ రూమ్ లో దేవతామూర్తులను ఏర్పాటు చేసే ముందు వాస్తు శాస్త్రం చెప్పే ఈ నియమాన్ని తెలుసుకోండి.

  1. ఇంటి దక్షిణ దిశలో ఎప్పుడూ దేవతా విగ్రహాలను ఏర్పాటు చేసుకోకూడదు. ఇది చాలా అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది.
  2. ఉత్తర దిశలో దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్టిస్తే.. విగ్రహాల కింద ఎప్పుడూ ఎర్రటి వస్త్రాన్ని వేయకూడదు.  అది శ్రేయస్కరం కాదు.
  3. ఇంటి గుడిలో అనేక మంది దేవతల విగ్రహాలు కలిసి పెడతారు. ఇలా చేయడం వాస్తు ప్రకారం తప్పు. ఆలయంలో ఎప్పుడూ ఒకటి కంటే ఎక్కువ విగ్రహాలను ఉంచవద్దు.
  4. దేవతామూర్తుల విగ్రహాలను ఇంటికి పడమర దిక్కున ఉంచితే ఏర్పాటు చేసుకోవడం అశుభ ఫలితాలను ఇస్తుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. దేవుళ్ల విగ్రహాలను ప్రతిష్టించడానికి ఇంటి ఉత్తర, ఈశాన్య దిశలను ఎంచుకుంటే ఆకుపచ్చ లేదా  నీలం రంగుల వస్త్రం వేయండి.
  7. ఇంట్లోని పూజ గదిలో శాలిగ్రామ విగ్రహాన్ని పెట్టుకోవద్దు. ఈ శాలిగ్రామ విగ్రహాలను తులసి కోటలో ఏర్పాటు చేసుకోవాలి. ఇలా చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది.
  8. ఇంటి పూజా గదిలో గణపతి మూడు విగ్రహాలను ఎప్పుడూ కలిపి ఉంచకూడదు. ఇలా చేస్తే ఆ ఇంటి యజమాని చేసే పనుల్లో అనవసరమైన అడ్డంకులు వస్తూనే ఉంటాయి.
  9. ఇంటి ఈశాన్య దిక్కు ఆలయానికి చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. దక్షిణ, నైరుతి దిశలు పూజకు శ్రేయస్కరం కాదు, కాబట్టి ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).