Venus Astro Tips: శారీరక, ఆర్ధిక సమస్యలా జాతకంలో శుక్రుడు బలపడడానికి ఈ చర్యలు పాటించించి చూడండి..

తులారాశి, వృషభ రాశులకు అధిపతి శుక్రుడు. ఒక వ్యక్తి జాతకంలో శుక్రుడు శుభ స్థానంలో ఉంటే అటువంటి వ్యక్తి ఆత్మవిశ్వాసంతో, అందంగా ఉంటాడని,  భౌతిక సౌకర్యాలను పొందుతారని చెబుతారు. మరోవైపు జాతకంలో శుక్రుడు బలహీన స్థితిలో ఉంటే వ్యక్తి శారీరక, ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. శుక్ర గ్రహాన్ని బలోపేతం చేయడానికి జ్యోతిషశాస్త్రంలో కొన్ని చర్యలు పేర్కొన్నారు.

Venus Astro Tips: శారీరక, ఆర్ధిక సమస్యలా జాతకంలో శుక్రుడు బలపడడానికి ఈ చర్యలు పాటించించి చూడండి..
Venus Astro Tips
Follow us
Surya Kala

|

Updated on: Jun 02, 2023 | 7:47 AM

జాతకంలో గ్రహాల స్థానం వ్యక్తి జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. జ్యోతిషశాస్త్రంలో శుక్రుడు సంపద, ఐశ్వర్యం, శారీరక సుఖాలకు కారకంగా పరిగణించబడతాడు. తులారాశి, వృషభ రాశులకు అధిపతి శుక్రుడు. ఒక వ్యక్తి జాతకంలో శుక్రుడు శుభ స్థానంలో ఉంటే అటువంటి వ్యక్తి ఆత్మవిశ్వాసంతో, అందంగా ఉంటాడని,  భౌతిక సౌకర్యాలను పొందుతారని చెబుతారు.

మరోవైపు జాతకంలో శుక్రుడు బలహీన స్థితిలో ఉంటే వ్యక్తి శారీరక, ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. శుక్ర గ్రహాన్ని బలోపేతం చేయడానికి జ్యోతిషశాస్త్రంలో కొన్ని చర్యలు పేర్కొన్నారు. ఈ చర్యలు పద్దతిగా చేస్తే జీవితంలో సమస్యలను అధిగమించవచ్చు.

జాతకంలో బలహీన శుక్రుని లక్షణాలు

ఇవి కూడా చదవండి

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరి జాతకంలో శుక్రుడు బలహీన స్థానంలో ఉంటాడో అతనికి డబ్బుకి ఇబ్బంది కలుగుతుంది. సౌకర్యాలు ఉండవు. అంతేకాదు ఏ పని చేయడానికైనా భయపడుతూ ఉంటాడు. ఆ వ్యక్తిలో  విశ్వాసం ఉండదు. బలహీనంగా ఉంటాడు.

జాతకంలో శుక్ర గ్రహం బలహీనంగా ఉంటే ఆ వ్యక్తి ప్రేమలో మోసపోవచ్చు. ఒకవేళ వివాహం జరిగి ఉంటే..  అతనికి దాంపత్య సుఖం లభించదు.

జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే చర్మ, కళ్లు, పాదాలు, కడుపు సంబంధిత వ్యాధులు రావచ్చు.

శుక్రుడిని బలపరిచే మార్గాలు

ఎవరి జాతకంలో శుక్ర గ్రహం బలహీనంగా ఉంటే.. శుక్రుడు బలపడటానికి శుక్రవారం రోజున ఉపవాసం పాటించాలి. 11 లేదా 21 శుక్రవారం వరకు ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. అంతేకాదు డబ్బు కొరత ఉండదు.

ఒక వ్యక్తి జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే పూజ సమయంలో కనీసం 108 సార్లు శుక్ర మంత్రాన్ని జపించాలి. ఇలా చేయడం వలన మనిషి జీవితంలో ధైర్యం, ఆత్మవిశ్వాసం, ఐశ్వర్యం, శారీరక సుఖాలకు కొదవ ఉండదు.

ఎవరి జాతకంలో శుక్ర గ్రహం బలహీనంగా ఉంటే ఆ వ్యక్తి గాయత్రీ మంత్రాన్ని కూడా జపించవచ్చు. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల ఇంట్లో స్థిరత్వం, ఆనందం, శ్రేయస్సు మాత్రమే కాకుండా.. ఏదైనా ఆరోగ్య సంబంధిత ఇబ్బందులుంటే అది కూడా పోతుంది.

జాతకంలో శుక్ర గ్రహం బలపడాలంటే పాలు, పెరుగు, అన్నం, పంచదార మొదలైన తెల్లటి పదార్థాలను ఆహారంలో తీసుకోవాలి. దీనితో పాటు శుక్రవారం తెల్లటి వస్తువులను దానం చేయడం కూడా శుభప్రదం.  ఫల ప్రదం.

మరోవైపు జ్యోతిష్య శాస్త్రంలో, జాతకంలో శుక్రుడి స్థానాన్ని బలోపేతం చేయడానికి వజ్రం ధరించడం మంచిది. అయితే ఇలాంటి చర్యలు పాటించే ముందు.. జ్యోతిష్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే ధరించాల్సి ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?