Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Panchak Date: చేసే పనుల్లో అశుభాలను ఇచ్చే పంచక సమయం, తేదీ, నియమాలు తెలుసుకోండి..

జ్యోతిష్య శాస్త్రంలో పంచకం కాలం అశుభకాలం. అందుకు సంబంధించిన కొన్ని నియమాలు కూడా పేర్కొన్నారు. ఆ వ్యక్తి అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం  పంచక  సమయంలో కుటుంబంలో ఎవరైనా ఆకస్మిక మరణం సంభవిస్తే.. దానికి ఐదు రెట్లు ప్రభావాన్ని చూపిస్తుంది.

Panchak Date: చేసే పనుల్లో అశుభాలను ఇచ్చే పంచక సమయం, తేదీ, నియమాలు తెలుసుకోండి..
June Month Panchaka Time
Follow us
Surya Kala

|

Updated on: Jun 02, 2023 | 7:22 AM

హిందూ పంచాంగం ప్రకారం ప్రతి నెలలో కొన్ని రోజులు శుభ లేదా ప్రత్యేక పనికి చాలా అశుభమైనవిగా పరిగణించబడతాయి. వీటిని పంచకం అంటారు. ఈ సమయంలో పంచాంగంలోని అన్ని రకాల అననుకూల సమయాలు..కొన్ని రోజులు కొన్ని రకాల కార్యక్రమాలను చేయడం నిషేధించబడింది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ సమయంలో కుటుంబంలో ఎవరైనా మరణిస్తే.. అది అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఈ సమయంలో జరిగే పనుల ప్రభావం ఐదు రెట్లు ఎక్కువగా ఉంటుందని నమ్ముతారు. జూన్ నెలలో పంచకం ఎప్పుడు ప్రారంభమవుతుంది.. దీని ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం..

పంచకం ఎప్పుడు మొదలవుతుందంటే.. పంచాంగం ప్రకారం అశుభమైనదిగా పరిగణించబడే పంచకం శుక్రవారం, 09 జూన్ 2023 ఉదయం 06:02 నుండి ప్రారంభమవుతుంది. 13 జూన్ 2023 మంగళవారం మధ్యాహ్నం 01:32 వరకు ఉంటుంది.

జ్యోతిషశాస్త్రంలో పంచకం ప్రాముఖ్యత

ఇవి కూడా చదవండి

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి నెలలో ఐదు రోజులు కొన్ని పనులు చేస్తే అశుభ ఫలితాలు వస్తాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ధనిష్ఠ నుండి రేవతీ నక్షత్రం వరకు ఉండే కాలాన్ని పంచకం అంటారు. జ్యోతిష్య శాస్త్రంలో పంచకం కాలం అశుభకాలం. అందుకు సంబంధించిన కొన్ని నియమాలు కూడా పేర్కొన్నారు. ఆ వ్యక్తి అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం  పంచక  సమయంలో కుటుంబంలో ఎవరైనా ఆకస్మిక మరణం సంభవిస్తే.. దానికి ఐదు రెట్లు ప్రభావాన్ని చూపిస్తుంది. దీని కారణంగా ఆ ఇంటి సభ్యులపై ఈ మరణ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో పంచక దోషాన్ని నివారించడానికి పంచక శాంతి ప్రత్యేకంగా పేర్కొన్నారు.

జూలై నెలలో పంచకం ఎప్పుడఁటే

పంచకం ప్రారంభ తేదీ : 06 జూలై 2023

పంచకం ఎప్పుడు ముగుస్తుందంటే: 10 జూలై 2023

పంచకం సమయంలో చేయకూడని పనులు ఏమిటంటే?  

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఐదు రకాల పంచక్ యోగాలు ఉన్నాయి.

రోగ్ పంచకం.. ఇది వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, రోగ్ పంచక్ శారీరక మరియు మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది.

రాజ పంచకం..“రాజ్” అనే పదం పాలించడాన్ని సూచిస్తుంది. ఈ పంచకం అత్యంత అనుకూలమైన పంచకం. ఈ పంచక్ కాల సమయంలో భూమి, ఆస్తి సంబంధిత విషయాలలో విజయం, లాభాలను పొందవచ్చు.

అగ్ని పంచకం.. పంచంకం మంగళవారం ప్రారంభమైతే.. దానిని అగ్ని పంచకం అంటారు. ఈ పంచక  సమయంలో నిర్మాణం, యంత్రాలు, పనిముట్లకు సంబంధించిన పనులకు దూరంగా ఉండాలి. ఈ పంచక కాలంలో అగ్ని ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

చోర పంచకం..  పంచకం శుక్రవారం ప్రారంభమైతే దీనిని చోర పంచకం అంటారు. ఈ పంచకంలో డబ్బు  లావాదేవీలు, వ్యాపార ఒప్పందాలు, ఆర్థిక పెట్టుబడులకు దూరంగా ఉండాలి.  ప్రయాణానికి దూరంగా ఉండాలి.

మృత్యు పంచకం..పంచకం శనివారం నుండి ప్రారంభమతే ఈ పంచక కాలాన్ని మృత్యు పంచకం  అంటారు. ఈ కాలం సమస్యాత్మకమైన కాలం..  గాయాలు, ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది.  ఈ కాలంలో స్థానికులతో విభేదాలు లేదా అనవసరమైన వాదనలతో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు.

అంతేకాదు ఈ పంచక కాలంలో కొన్ని పనులు పొరపాటున కూడా చేయకూడదు. పంచకంలో ఇంట్లోకి  కలపను తీసుకురావడం చాలా అశుభం. అదేవిధంగా పంచకంలో మంచాలు నేయడం, ఇంటి పైకప్పు నేయడం, ఇంటికి రంగులు వేయడం, దక్షిణం వైపు వెళ్లడం చాలా అశుభం. అటువంటి పరిస్థితిలో ఎటువంటి అశుభాలు జరగకుండా పంచక నియమాలను పాటించాల్సి ఉంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).