Friday Laxmi Puja: ఇంట్లో ధనధాన్యాలకు లోటు లేకుండా ఉండాలంటే.. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం శుక్రవారం సాయంత్రం ఈ పరిహారాలు చేసి చూడండి..

శుక్రవారం రోజున లక్ష్మీదేవి సమేతంగా శుక్రదేవుని పూజించడం వల్ల సంతోషం, శ్రేయస్సు , సంపదలు లభిస్తాయి. దీనితో పాటు, వైవాహిక జీవితంలో ప్రత్యేక ఆనందం లభిస్తుంది. అటువంటి పరిస్థితిలో శుక్రవారం సాయంత్రం ఈ చర్యలు చేయడం ద్వారా వైవాహిక జీవితంలో ఆనందంతో పాటు సుఖ సంతోషాలు లభిస్తాయి. 

Friday Laxmi Puja: ఇంట్లో ధనధాన్యాలకు లోటు లేకుండా ఉండాలంటే.. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం శుక్రవారం సాయంత్రం ఈ పరిహారాలు చేసి చూడండి..
Lakshmi Puja
Follow us
Surya Kala

|

Updated on: Jun 02, 2023 | 6:38 AM

హిందూ సనాతన ధర్మంలో వారంలోని ప్రతి రోజు ఏదో ఒక దేవతకి అంకితం చేయబడింది. ఈరోజు శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. అంతేకాదు శుక్రవారం గ్రహాల్లో ఒకడైన శుక్రదేవుడికి అంకితం చేయబడింది. జ్యోతిషశాస్త్రంలో శుక్రుడు వైవాహిక ఆనందం, వ్యక్తుల గౌరవం, ప్రేమ, అందానికి చెందిన  దేవుడుగా పరిగణిస్తారు. శుక్రవారం రోజున లక్ష్మీదేవి సమేతంగా శుక్రదేవుని పూజించడం వల్ల సంతోషం, శ్రేయస్సు , సంపదలు లభిస్తాయి. దీనితో పాటు, వైవాహిక జీవితంలో ప్రత్యేక ఆనందం లభిస్తుంది. అటువంటి పరిస్థితిలో శుక్రవారం సాయంత్రం ఈ చర్యలు చేయడం ద్వారా వైవాహిక జీవితంలో ఆనందంతో పాటు సుఖ సంతోషాలు లభిస్తాయి.

శుక్రవారం రోజు చేయాల్సిన పరిహారాలు ఏమిటంటే:

  1. శుక్రవారం రాత్రి నిదురించే ముందు ఇంటికి ఈశాన్య దిశలో ఖచ్చితంగా నెయ్యి దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని.. ధన ధాన్యాలకు లోటు ఉండదని నమ్మకం.
  2. శుక్రవారం ఆవుకి ఆహారం తినిపించండి. అంతేకాదు శుక్రవారం మీరు ఆహారం తినే ముందు ఆవుకు నెయ్యి,  బెల్లం కలిపిన తాజా రొట్టె తినిపించండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీ దేవి అనుగ్రహం లభించడంతో పాటు ఇంట్లో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు.
  3. ఇవి కూడా చదవండి
  4. శుక్రవారం రాత్రి నిద్రపోయే ముందు, లక్ష్మీదేవి విగ్రహానికి మొగలి దూపం పరిమళం ఉన్న లేదా మొగలి పువ్వుల మాలను సమర్పించండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతసించి ఇంట్లో ఐశ్వర్యం వస్తుంది.
  5. శుక్రవారం సాయంత్రం పంచముఖి దీపంతో (5 దీపాలతో) లక్ష్మీదేవికి ఆరతి ఇవ్వండి. ఇది ఇంట్లో సానుకూలతను తెస్తుంది. జీవితంలో సంపద, శ్రేయస్సును పెంచుతుంది.
  6. శుక్రవారం రోజున కర్పూరంలో కొద్దిగా కుంకుమ వేసి లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి. ఇలా చేయడం వలన జీవితంలో ఆర్ధిక ఇబ్బందులు ఏర్పడవని నమ్మకం.
  7. శుక్రవారం నాడు తమలపాకు, రాగి నాణెం మీ చేతిలో తీసుకొని, లక్ష్మీ దేవిని ధ్యానించిన తర్వాత ఈ రెండు వస్తువులను మీ పర్సులో ఉంచుకోండి. ఎప్పుడూ ధన ధాన్యాలకు లోటు లేదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).

నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ