AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Satur Day Puja Tips: శనివారం వస్తువులను కొనుగోలు చేస్తే దురదృష్టాన్ని కొనుగోలు చేసుకున్నట్లే.. అవి ఏమిటో తెలుసుకోండి..

శని ఎవరి పట్ల ప్రసన్నుడైతే.. అతని పనులన్నీ సక్రమంగా జరుగుతాయి. అయితే శనీశ్వరుడికి అంకితం చేయబడిన శనివారం రోజున కొన్ని వస్తువులను కొనుగోలు చేయరాదు. ఇలా చేయడం వలన  నష్టాలు, కష్టాలు కోరి కొని తెచ్చుకున్నట్లే అని అంటారు. ఈ రోజు శనివారం పొరపాటున కూడా కొనుగోలు చేయని వస్తువుల గురించి తెలుసుకుందా,.. 

Satur Day Puja Tips: శనివారం వస్తువులను కొనుగోలు చేస్తే దురదృష్టాన్ని కొనుగోలు చేసుకున్నట్లే.. అవి ఏమిటో తెలుసుకోండి..
Shani Nakshatra Gochar
Follow us
Surya Kala

|

Updated on: Jun 03, 2023 | 7:11 AM

శనివారం శనీశ్వరుడికి అంకితం చేయబడిన రోజుగా భావించి పూజిస్తారు. పురాణాల ప్రకారం శనీశ్వరుడు సూర్యు దేవుడి తనయుడు. తండ్రి తనయుల మధ్య విరోధ సంబంధం కలిగి ఉన్నప్పటికీ శనీశ్వరుడు కర్మ ప్రదాత. మనిషి పై సూర్యుడి ప్రభావం కంటే శనీశ్వరుడు ప్రభావం చాలా ఎక్కువ. ప్రతి మనిషి జాతకంలో  సూర్యుడు 1 నెల, చంద్రుడు 2 నెలల 2 రోజులు, కుజుడు 1 నెల 15 రోజులు, బుధుడు 1 నెల, శుక్రుడు 1 నెల, బృహస్పతి 13 నెలలు ఉంటాడు. అయితే శనీశ్వరుడు మందగమనుడు.. ప్రతి వ్యక్తి జాతకంలో రెండున్నర సంవత్సరాల నుండి ఏడున్నర సంవత్సరాల వరకు ఉంటాడు. జోతిష్య శాస్త్రం ప్రకారం శనీశ్వరుడు ఎవరి రాశిలోనైనా అడుగు పెట్టె 3 నెలల ముందు నుండి తన ప్రభావాన్ని చూపడం ప్రారంభిస్తాడు. ప్రతి మనిషి జీవితం శనీశ్వరుడు ప్రభావం వారి గ్రహ స్థితిపై ఆధారపడి ఉంటుంది.  కనుక వీలైనంత వరకు, శని భగవానుడి తిరోగమనానికి దూరంగా ఉండాలి.

వాస్తవానికి శనీశ్వరుడు పురాణాల గ్రంథాల్లో న్యాయమూర్తి అని పిలుస్తారు. ఒక వ్యక్తి చేసే తప్పు, ఒప్పులను అనుసరిస్తూ శిక్షలను విధిస్తాడు. శని వ్యక్తి తన జీవితంలో భౌతిక సుఖాలను, విజయాన్ని అందిస్తాడు. శని ఎవరి పట్ల ప్రసన్నుడైతే.. అతని పనులన్నీ సక్రమంగా జరుగుతాయి. అయితే శనీశ్వరుడికి అంకితం చేయబడిన శనివారం రోజున కొన్ని వస్తువులను కొనుగోలు చేయరాదు. ఇలా చేయడం వలన  నష్టాలు, కష్టాలు కోరి కొని తెచ్చుకున్నట్లే అని అంటారు. ఈ రోజు శనివారం పొరపాటున కూడా కొనుగోలు చేయని వస్తువుల గురించి తెలుసుకుందా,..

ఇనుము – పురాణ గ్రంధాల ప్రకారం ఒకసారి రాజు విక్రమాదిత్యుడు శనీశ్వరుడికి ఇనుప సింహాసనాన్ని ఇచ్చాడు. ఆ సమయంలో శనీశ్వరుడికి చాలా కోపం వచ్చింది.  అప్పుడు శనీశ్వరుడి దృష్టిని విక్రమాదిత్యుడివైపు ప్రసరించాడు. దీంతో అప్పటి నుంచి శనివారం ఇనుము కొనుగోలు చేయడం అశుభం అని నమ్ముతారు. అయితే ఇనుము దానం చేయడం శనీశ్వరుడిని సంతోషపరుస్తుంది. శుభ ఫలితాలను ఇస్తుంది.

ఇవి కూడా చదవండి

తోలు – శనీశ్వరుడు తోలు లాంటి బెల్టులు, పర్సులు మొదలైన వాటిని కొనకూడదు. ఇలా చేయడం వల్ల విజయానికి ఆటంకం కలుగుతుంది.

నూనె – ఈ రోజు ఇంట్లోకి ఏ రకమైన నూనెను తీసుకురాకూడదు. శనివారం నాడు ఇంట్లో నూనె తీసుకురావడం వల్ల ఇంట్లో ఇబ్బందులు లేదా వ్యాధులు వస్తాయి, అయితే ఈ రోజున శనికి నూనె నైవేద్యంగా ఉంచడం వల్ల సంతోషం కలుగుతుంది.

బొగ్గు – శనివారం రోజున ఇంట్లోకి బొగ్గు తీసుకురావడం నిషేధించబడింది. బొగ్గు నలుపు రంగులో ఉంటుంది కాబట్టి ఇంట్లోకి తీసుకుని రావడం వలన ఇంటికి శని స్వరూపం వస్తుందని నమ్ముతారు. అదనంగా ఇది ఒక రకమైన ఇంధనం. ఇంట్లోకి ఇంధనాన్ని తీసుకురాకూడదు. ఉద్రిక్తతను సృష్టిస్తుంది.

చీపురు – శనివారం చీపురు కొనకూడదు. శనివారం తెచ్చిన చీపురు ఇంటి సంపదకు హాని కలిగిస్తుంది.

నల్ల నువ్వుల గింజలు – శనివారం నల్ల నువ్వులను కొనడం నిషిద్ధంగా పరిగణించబడుతుంది. శని దోష నివారణకు నల్ల నువ్వులను దానం చేయడం వలన మేలు జరుగుతుంది. అయితే శనివారం నల్ల నువ్వులు తీసుకురావడం శని రాకతో సమానంగా పరిగణించబడుతుంది.

ఉప్పు – ఈ రోజున ఉప్పు కొనడం కూడా మానుకోవాలి. శనివారం కొనుగోలు చేసిన ఉప్పు ఇంట్లోకి రోగాలను తెచ్చిపెడుతుంది.

సిరా – ఈ రోజున సిరా అస్సలు కొనకూడదు. ఇది ఒక వ్యక్తికి అపకీర్తిని లేదా కళంకాన్ని తీసుకురావచ్చు.

శని ప్రభావాన్ని తగ్గించే రెమెడీస్

శనివారం నాడు హనుమాన్ చాలీసాను నిష్టతో పఠిస్తే విశేష ప్రయోజనాలు కలుగుతాయి.

శనివారం నాడు చీమలకు నల్ల నువ్వులు పిండి, పంచదార కలిపి ఆహారంగా ఇవ్వాలి.

శనివారం నాడు తలస్నానం చేసిన తర్వాత శనిదేవుని ముందు నెయ్యి దీపం వెలిగించి, ఆ తర్వాత నీలం రంగు పుష్పాలను సమర్పించండి.

శనీశ్వరుడు పది పేర్లతో కూడిన మంత్రాన్ని రుద్రాక్ష జపమాలతో 5 సార్లు జపించాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).