AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

June Grah Gochar: ఈ నెలలోనే రాశిని మార్చబోతున్న 3 గ్రహాలు.. ఈ రాశులవారు కష్టాలో మునిగిపోయినట్లే..

సనాతన హిందూ ధర్మంలో జ్యోతిష్య శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇంకా జ్యోతిష్యం ప్రకారం గ్రహాల స్థితి గతులు మానవ జీవితంపై ఎంతగానో ప్రభావితం చేస్తాయి. అయితే ఈ ఫలితాలు కొందరికి శుభప్రదంగానూ, మరి కొందరికి అశుభంగానూ..

June Grah Gochar: ఈ నెలలోనే రాశిని మార్చబోతున్న 3 గ్రహాలు.. ఈ రాశులవారు కష్టాలో మునిగిపోయినట్లే..
Astrology
శివలీల గోపి తుల్వా
|

Updated on: Jun 04, 2023 | 4:07 PM

Share

సనాతన హిందూ ధర్మంలో జ్యోతిష్య శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇంకా జ్యోతిష్యం ప్రకారం గ్రహాల స్థితి గతులు మానవ జీవితంపై ఎంతగానో ప్రభావితం చేస్తాయి. అయితే ఈ ఫలితాలు కొందరికి శుభప్రదంగానూ, మరి కొందరికి అశుభంగానూ ఉండవచ్చు. ఈ క్రమంలోనే జూన్ నెలలో బుధ, సూర్య, శని గ్రహాల గమనంలో మార్పులు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 7న బుధ గ్రహంలో వృషభరాశిలోకి, జూన్ 15న సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశించనుండగా.. అలాగే జూన్ 17న శనిగ్రహం కుంభరాశిలో తిరోగమనం చేయనున్నాడు. ఇదిలా ఉండగానే జూన్ 19న బుధుడు వృషభరాశి నుంచి బయటకు వచ్చి, జూన్ 24న మిథునంలోకి ప్రవేశిస్తాడు. ఇలా ఒకే నెలలో ఆయా గ్రహాల స్థితిగతుల మార్పులు కొన్ని రాశులకు ప్రతికూలంగా మారనున్నాయి. మరి ఈ గ్రహాలు ఎవరెవరికీ కష్టాలను తీసుకువస్తాయో ఇప్పుడు చూద్దాం..

మిథునరాశి: గ్రహ స్థితిగతుల మార్పు కారణంగా మిథునరాశి వారికి ఎన్నో కష్టాలు కలగనున్నాయి. ఈ సమయంలో ప్రయాణాలు మానుకోవడం మంచిది. ముఖ్యంగా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మాట్లాడే మాటలు అదుపులో పెట్టుకుని మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నించడం మాత్రమే మిమ్మల్ని ఈ కష్టాల నుంచి బయట పడేయగలదు.

కర్కాటక రాశి: గ్రహాల సమూహంలో సంభవిస్తున్న పెనుమార్పులు కర్కాటక రాశి వారికి కూడా మంచిది కాదు. వ్యాపారాలలో నష్టం, నిందలు మోయవలసి ఉంటుంది. అలాగే ప్రశాంతత దూరమవుతుంది. మీ జీవిత భాగస్వామితో గొడవలు వచ్చే ప్రమాదం ఉంది.

ఇవి కూడా చదవండి

మేషరాశి: బుధ, సూర్య, శని గ్రహాల రాశి మార్పు కారణంగా మేషరాశివారు సైతం పలు రకాలుగా ఇబ్బందిపడతారు. ఈ సమయంలో కుటుంబ కలహాలు, స్నేహితులతో గొడవలు ఏర్పడే అవకాశం ఉంది. ఇంకా ఈ సమయంలో మీ ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ద తీసుకోవడం మంచిది. అలాగే ఉద్యోగం మారకపోవడం ఎంతో ఉత్తమం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..