Telugu News Sports News Cricket news WTC final 2023: Full list of global and regional commentators for the IND vs AUS Match, Saurav Ganguly to make comeback as commentator
WTC Final 2023: టెస్ట్ ఫైనల్ మ్యాచ్‌కి అనుకోని అతిథులు.. ఎందుకొస్తున్నారో తెలిస్తే ఫ్యాన్స్‌కి పునకాలే..
WTC Final 2023: క్రికెట్ అభిమానులకు రెండు నెలలపాటు వినోదం పంచి పెట్టిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగిసిపోవడంతో.. ఇప్పుడు అందరి దృష్టి ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మీద పడింది. లండన్ ఒవల్ మైదానంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్‌కి..
Ganguly And Harbhajan To Be Commentators For WTC Final
WTC Final 2023: క్రికెట్ అభిమానులకు రెండు నెలలపాటు వినోదం పంచి పెట్టిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగిసిపోవడంతో.. ఇప్పుడు అందరి దృష్టి ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మీద పడింది. లండన్ ఒవల్ మైదానంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్‌కి ఇంకా 4 రోజులే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీసీ ఫైనల్స్‌ను ప్రత్యక్ష ప్రసారం చేసే హక్కులను పొందిన స్టార్ స్పోర్ట్స్ తమ కామెంటరీ ప్యానెల్‌ను తాజాగా ప్రకటించింది. ఈ కామెంటరీ ప్యానెల్‌లో టీమిండియాకు చెందిన పలువురు మాజీ దిగ్గజాలు కూడా ఉండడం విశేషం. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ సారథి, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా చాలాకాలం తర్వాత మైక్ పట్టుకోబోతున్నాడు. అలాగే హర్భజన్ సింగ్ కూడా ఈ సారి కామెంటరీ ఇవ్వనున్నాడు. అయితే గంగూలీ ఇంగ్లీష్ కామెంటరీ ప్యానెల్‌లో కాకుండా హిందీలో కామెంటరీ చెప్పనున్నాడు. ఎంతో కాలం తర్వాత కామెంటేటర్ అవతారం ఎత్తబోతున్న గంగూలీ వార్త తెలిసి ఇప్పటికే పలువురు క్రికెట్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏయే భాషలలో ఎవరెవరు కామెంటరీ ఇవ్వనున్నారో ఇప్పుడు చూద్దాం..