AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైతన్న ట్రాక్టర్ నడిపిన సీఎం జగన్.. వ్యవసాయ పనిముట్లు, హర్వెస్టర్ల పంపిణీ.. అక్టోబర్‌లో మరో 7 లక్షల మందికి..

YSR Yantra Seva Scheme: గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ ‘వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం’ మెగా మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు రైతులకు ట్రాక్టర్లు, హార్వెస్టర్లను పంపిణీ చేశారు. మొత్తం రూ. 361.29కోట్ల విలువైన 2,562 ట్రాక్టర్లు, 100 కంబైన్ హార్వెస్టర్లను రైతు గ్రూపులకు..

రైతన్న ట్రాక్టర్ నడిపిన సీఎం జగన్.. వ్యవసాయ పనిముట్లు, హర్వెస్టర్ల పంపిణీ.. అక్టోబర్‌లో మరో 7 లక్షల మందికి..
CM Jagan Driving Tractor
శివలీల గోపి తుల్వా
|

Updated on: Jun 02, 2023 | 1:45 PM

Share

YSR Yantra Seva Scheme: గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ ‘వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం’ మెగా మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు రైతులకు ట్రాక్టర్లు, హార్వెస్టర్లను పంపిణీ చేశారు. మొత్తం రూ. 361.29కోట్ల విలువైన 2,562 ట్రాక్టర్లు, 100 కంబైన్ హార్వెస్టర్లను రైతు గ్రూపులకు సీఎం రైతన్నలకు ఇచ్చారు. 13,573 ఇతర వ్యవసాయ పనిముట్లను కూడా ఈ సందర్భంగా పంపిణీ చేశారు. ఈ సమయంలోనే రైతన్నల గ్రూప్‌ల ఖాతాల్లో రూ.125.48 కోట్ల సబ్సిడీ జమ చేశారు. ఈ సందర్భంగా ఆయన ట్రాక్టర్ కూడా నడపడం విశేషం. అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘ప్రతి ఆర్బీకే పరిధిలో ఒక కస్టమ్ హైరింగ్ సెంటర్ కింద రైతులకు కావాల్సిన ట్రాక్టర్లయితేనేమి, వ్యవసాయ పరికాలైతేనేమి.. అన్నీ అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ఆ రైతన్నలతో ఒక గ్రూపు కింద ఫామ్ అయ్యి, ఆర్బీకే పరిధిలో ఉన్న మిగిలిన రైతులకు కూడా యంత్రాలన్నీ అందుబాటులోకి తీసుకొచ్చే ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 10,444 ఆర్బీకేల పరిధిలో కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ పరిధిలో, ఆర్బీకేలతో అనుసంధానమై, ఆర్బీకే పరిధిలోని రైతన్నలే ఈ వ్యవసాయ పనిముట్లన్నీ అతి తక్కువ ధరకు మిగిలిన రైతులకు అందుబాటులోకి తీసుకొస్తారు’ అని పేర్కొన్నారు.

ఇంకా ‘ గ్రామ స్వరాజ్యం అనే పదానికి నిజమైన అర్థం చెప్పే కార్యక్రమం జరుగుతోంది. ఇంతకు ముందు మనం 6,525 ఆర్బీకే స్థాయిలో, 391 క్లస్టర్ స్థాయిలోనూ కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు రైతుల పేరుతో ఓపెన్ చేశాం. అక్కడ 3,800 ట్రాక్టర్లను, 391 కంబైన్ హార్వెస్టర్లను, 22,580 ఇతర యంత్రాలను సప్లయ్ చేశాం. ఈరోజు గుంటూరులో 3,919 ఆర్బీకే స్థాయిలో, మిగిలిన వంద క్లస్టర్ స్థాయి కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు అన్నింట్లోనూ 2,562 ట్రాక్టర్లు, 100 కంబైన్ హార్వెస్టర్లతో పాటు 13,573 ఇతర యంత్రాలను అందుబాటులో ఉండేటట్లు ఈరోజు కార్యక్రమంతో జెండా ఊపి స్టార్ట్ చేస్తున్నా. ప్రతి ఆర్బీకే స్థాయిలో కూడా రూ. 15 లక్షలు కేటాయింపు చేసి ఎటువంటి యంత్రాలు కావాలన్నా ఆ రైతుల అవసరాల మేరకు తీసుకొచ్చాం. 491 క్లస్టర్ స్థాయిలో వరి బాగా పండుతున్న ప్రాంతాల్లో అక్కడ కంబైన్ హార్వెస్టర్ తీసుకురావాల్సిన అవసరం ఉందని అనిపించిన స్థాయిలో 491 క్లస్టర్లను ఐడెంటిఫై చేశామ’న్నారు.

అంతేకాక ‘‘ఒక్కో క్లస్టర్ స్థాయిలో ఒక్కో హార్వెస్టర్‌ను రూ.25 లక్షలతో రైతులకు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. రూ.1,052 కోట్లు ఖర్చు చేసి ఆర్బీకేల పరిధిలో ఇవన్నీ తీసుకొస్తున్నాం. గ్రూపులుగా ఫామ్ అయిన రైతులు కేవలం 10 శాతం కడితే చాలు.. 40 శాతం ప్రభుత్వమే సబ్సిడీ కింద ఇచ్చి, మిగిలిన 50 శాతం లోన్ల కింద ఆ ఆర్బీకే పరిధిలో ఉన్న ఆ రైతాంగానికి అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ఆర్బీకే స్థాయిలోనే ఏ రైతు అయినా వాడుకొనేందుకు అతి తక్కువ అద్దెతో ఇవన్నీ అందుబాటులో ఉండేందుకు వైఎస్సార్ యంత్ర సేవా యాప్‌ను కూడా తీసుకొస్తున్నాం. వీటి కోసం 15 రోజులు ముందుగానే ఆ రైతన్నలు బుక్ చేసుకోవచ్చు. ఆర్బీకే పరిధిలో ఉన్న ప్రతి రైతన్న కూడా దీన్ని ఉపయోగించుకొనే పరిస్థితి రావాలని కోరుకుంటున్నా. ఇదే మాదిరిగానే మళ్లీ ఈ సంవత్సరమే అక్టోబర్ మాసంలో 7 లక్షల మంది రైతన్నలకు మంచి జరిగిస్తూ వ్యవసాయ పనిముట్లను, వ్యక్తిగత వ్యవసాయ పనిముట్లను అందజేస్తాం’’ అని హామీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

‘‘స్ప్రేయర్లు, టార్పాలిన్లు.. ఇలాంటివి కూడా అక్టోబర్ మాసంలో ఆ 7 లక్షల మంది రైతన్నలకు పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఆర్బీకే అన్న ఒక వ్యవస్థను పటిష్ట పరుస్తూ రైతన్నలకు ఇంకా మంచి జరిగించాలి అనే తపన, తాపత్రయంతో అడుగులు పడుతున్నాయి. రైతులకందరికీ మంచి జరగాలని, దేవుడి దయ, ప్రజలందరి చల్లని ఆశీస్సులతో ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా” అని ఏపీ సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..