First Day First Show: ఇంట్లో కూర్చుని కొత్త సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేయండి.. ఆంధ్రప్రదేశ్‌ లోగిళ్లలోకి ఏపీ ఫైబర్‌ నెట్

రిలీజ్ రోజే కొత్త సినిమా చూడాలనుకుంటున్నారా..? టికెట్లు దొరకవనే బెంగ ఇక అవసరం లేదంటుంది ఏపీ ఫైబర్ నెట్. సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుడుతూ.. ఫస్ట్ డే సినిమాను అందించే ప్రయత్నం చేస్తుంది. ప్రేక్షకులు ఇక తమ తమ ఇళ్లలోనే ఎంచక్కా కొత్త సినిమాను ఫస్ట్‌డే వీక్షించే కొత్త ఒరవడికి నాంది పలికింది ఏపీ ప్రభుత్వం. 

First Day First Show: ఇంట్లో కూర్చుని కొత్త సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేయండి.. ఆంధ్రప్రదేశ్‌ లోగిళ్లలోకి ఏపీ ఫైబర్‌ నెట్
First Day First Show
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 02, 2023 | 3:21 PM

ఏపీ ఫైబర్‌నెట్.. ఆంధ్రప్రదేశ్‌ లోగిళ్లలో ఇప్పటికే బహుముఖ సర్వీసులందిస్తూ దూసుకెళ్తున్న వ్యవస్థ. లేటెస్ట్‌గా మరో ఎక్స్‌ట్రా ఫ్లేవర్‌తో మన ముందుకొచ్చింది. అదే ఫస్ట్‌ డే ఫస్ట్ షో. థియేటర్లలో షో పడుతున్నప్పుడు మనింట్లో టీవీల్లో కూడా అదే షో.. అదే టైమ్‌లో పడేలా సాంకేతిక ఏర్పాట్లు చేసింది. మరే ఓటీటీ సంస్థలోనూ దొరకని సౌకర్యమిది. విశాఖలోని ఒక  హోటల్‌నుంచి మంత్రి అమర్‌నాథ్ చేతుల మీదుగా ఈ సౌకర్యం లాంచనంగా ప్రారంభమైంది. ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా ఫైబర్ నెట్ కు 8 లక్షల వినియోగదారులు ఉన్నారని అన్నారు. నిరీక్షణ పేరుతో నిర్మించిన నూతన మూవీని తొలిసారిగా ఫైబర్ నెట్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖా మంత్రి అమర్, ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి, నిర్మాత సీ కళ్యాణ్ పాల్గొన్నారు.

ఏపీలో ఫైబర్‌నెట్‌ ఫస్ట్‌ డే-ఫస్ట్‌ షో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది జగన్‌ ప్రభుత్వం. 79 రూపాయల రీచార్జీతో మారుమూల ప్రాంతాల నుంచి కూడా రిలీజ్‌ అయిన రోజే సినిమా చూసే అవకాశం కల్పిస్తోంది ఏపీ ఫైబర్‌నెట్‌. ఈ మేరకు.. రెవెన్యూ షేరింగ్‌ విధానంలో ఫైబర్‌నెట్‌, మూవీ మేకర్స్‌ మధ్య ఒప్పందం కుదిరింది. విశాఖ వేదికగా తొలిసారి ఫైబర్‌నెట్‌లో నిరీక్షణ అనే కొత్త చిత్రం రిలీజ్‌ అయింది. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా ఫస్ట్ డే ఫస్ట్ షో కార్యక్రమం ప్రారంభించామని ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఛైర్మన్ గౌతం రెడ్డి తెలిపారు. సంక్షేమ కార్యక్రమాలతో పాటు వినోదాన్ని సైతం ప్రజల ముంగిటకు తీసుకు వెళ్లాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారని తెలిపారు. ఈ నిర్ణయం గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. విశాఖపట్నంలోని పార్క్ హోటల్‌లో ఫస్ట్ డే ఫస్ట్ షో కార్యక్రమం ప్రారంభించిన సందర్భంగా గౌతం రెడ్డి ఆ వివరాలను వెల్లడించారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా ఫస్ట్ డే ఫస్ట్ షో కార్యక్రమం ప్రారంభించనట్లుగా తెలిపారు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఎంతో ఉపయోగ పడుతుందన్నారు. ఈ కార్యక్రమం వలన ఎవరికి ఎటువంటి ఇబ్బందీ ఉండదన్నారు.సకుటుంబ సపరివారంగా ఫస్ట్ డే ఫస్ట్ షో.. అది కూడా సినిమా మొత్తం చూడవచ్చన్నారు. ఈ 99 రూపాయ ప్లాన్ 24 గంటలు పని చేస్తుందన్నారు ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఛైర్మన్ గౌతం రెడ్డి.

దేశంలో ఎక్కడ లేనివిధంగా ఫస్ట్ డే పస్ట్ షో కొత్త కాన్సెప్ట్ రాష్ట్రంలో తీసుకువచ్చామని ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. సినిమా రిలీజ్ అయిన రోజే సినిమా ఫ్యామీలీ మెంబర్స్ అంతా ఇంట్లోనే చూసే అవకాశం ఉంటుందని అన్నారు.

ఫస్ట్ డే పస్ట్ షో కొత్త కాన్సప్ట్‌తో గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలకు సరికొత్త వినోదాన్ని ఆస్వాదించేందుకు అవకాశం ఉందన్నారు గుడివాడ అమర్‌నాథ్. ఈ నిర్ణయం వల్ల ఫిల్మ్ ఇండ్ట్రీకి ఎటువంటి ఇబ్బంది ఉండదన్నారు. 80 శాతం సినిమాలు రిలీజ్ కాకుండానే మిగిలిపోతున్నాయన్నారు. ఒక్కొసారి సినిమాలు విడుదలకు థియేటర్లు దొరికే పరిస్థితి కొన్నిసార్లు కనిపించదన్నారు. అటువంటి సినిమాలకు పస్ట్ డే పస్ట్ షో ప్లాట్ ఫామ్ ఎంతో ఉపయోగడుతుందన్నారు.

148 దేశాల్లో ఫస్ట్ డే ఫస్ట్ షో వంటి ప్రయోగమే లేదన్నారు నిర్మాత సి కళ్యాణ్. మారుమూల గ్రామాల ప్రేక్షలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఫస్ట్ డే ఫస్ట్ షో నిర్ణయం తీసుకున్న సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. తెలుగు ఇండస్ట్రీకి ఎటువంటి ఇబ్బంది ఉండదన్నారు.

అసలు ఫస్ట్ డే ఫస్ట్ షో అంటే ఇదే..

టిక్కెట్ ఖరీదు 79 రూపాయలు. కాకపోతే ఒక్కరు కాదు.. ఫ్యామిలీ మొత్తం కలిసి కూర్చొని సినిమా చూడొచ్చు. ఏపీలో ఫైబర్‌నెట్‌ ఫస్ట్‌ డే-ఫస్ట్‌ షో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది జగన్‌ ప్రభుత్వం. 79 రూపాయల రీచార్జీతో మారుమూల ప్రాంతాల నుంచి కూడా రిలీజ్‌ అయిన రోజే సినిమా చూసే అవకాశం కల్పిస్తోంది ఏపీ ఫైబర్‌నెట్‌. ప్రస్తుతం ఏపీ ఫైబర్‌నెట్‌లో ఏడు లక్షల కనెక్షన్లున్నాయి. అందులో ఐదు లక్షలమంది చూసినా కోట్లల్లో ఆదాయం వస్తుందని అంచనా వేసింది ఏపీ సర్కార్. థియేటర్లకు వెళ్లి కొత్త సినిమా చూసే అవకాశం ఉండని గ్రామీణ ప్రాంత జనాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ సౌకర్యం కల్పించామంటోంది ప్రభుత్వం.ఈ ప్లాన్‌కు 24 గంటల వ్యాలిడిటీ ఉంటుంది. థియేటర్లకు వెళ్లకుండానే కుటుంబమంతా కలిసి సినిమా చూసే సదవకాశాన్ని ఏపీ ప్రభుత్వం కల్పిస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం