Telugu News Sports News Cricket news IPL 2023 finalists Ravindra Jadeja, Shubman Gill, Ajinkya Rahane begin training after joining India squad for WTC final
WTC Final 2023: అప్పుడే ప్రాక్టీస్‌లో మునిగిపోయిన ‘ఐపీఎల్ ఫైనల్’ ప్లేయర్స్.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియో..
WTC Final 2023: ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌కి ఇంకా 5 రోజులే మిగిలి ఉంది. లండన్‌లోని ఒవల్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, భారత్ తలపడనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందుగానే రెండు దశలుగా భారత ఆటగాళ్లు చేరుకోగా.. అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, మొహ్మద్ షమి..
WTC Final 2023: ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌కి ఇంకా 5 రోజులే మిగిలి ఉంది. లండన్‌లోని ఒవల్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, భారత్ తలపడనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందుగానే రెండు దశలుగా భారత ఆటగాళ్లు చేరుకోగా.. అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, మొహ్మద్ షమి, శుభమాన్ గిల్ కూడా ఐపీఎల్ ఫైనల్ ముగించుకుని చివరి బ్యాచ్‌గా లండన్ చేరుకున్నారు. ఐపీఎల్ ఫైనల్ అయిపోగానే లండన్ బయలుదేరిన ఈ ముగ్గురు ఇప్పుడు లండన్‌లో చెమటోడుస్తూ ప్రాక్టీస్ సెషన్‌లో మునిగిపోయారు. వీరికి సంబంధించిన ఫోటోలు, వీడియోను బీసీసీఐ షేర్ చేయగా.. అవి కాస్త ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇంకా విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, పుజారా తదితర ఆటగాళ్లు లండన్‌లోని అరండేల్ క్యాజిల్ క్రికెట్ క్లబ్‌లో ప్రాక్టీస్ చేస్తూ కొత్త వాతావరణానికి తగ్గట్టుగా ఉన్నారు.
మరోవైపు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ స్టార్ స్పోర్ట్స్ టెలివిజన్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మొబైల్ అప్లికేషన్‌లో లైవ్ స్ట్రీమింగ్ ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఉంటుంది.ICCI అధికారిక వెబ్‌సైట్‌లో కూడా ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. భారత కాలమానం ప్రకారం, ఫైనల్ మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది.
కాగా, ఈ డబ్ల్యూటీసీ 2021-23 టోర్నీ మొత్తం ప్రైజ్ మనీ రూ. 29.75 కోట్లుగా ఉంది. అలాగే టోర్నీ విజేతకు రూ. 13.22 కోట్ల రూపాయలను, రన్నరప్‌గా నిలిచిన జట్టుకు రూ. 6.61 కోట్లు ప్రైజ్ మనీగా అందుతుంది. అలాగే మూడో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా జట్టుకు రూ.3.71 కోట్లు అందుతుంది.