AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వార్నీ.. భారీకాయంతో భలే క్యాచ్ పట్టాడే.. బౌండరీ లైన్‌లో కళ్లు చెదిరే ఫీల్డింగ్.. నెటిజన్స్ ఫిదా

Josh Cobb Catch Video: ఐపీఎల్ ముగిసిన తర్వాత మరో టీ20 టోర్నీ మొదలైంది. తుఫాన్ బ్యాటింగ్, అద్భుతమైన బౌలింగ్‌తో పాటు ఆశ్చర్యకరమైన ఫీల్డింగ్ కూడా ఇంగ్లండ్‌లో టీ20 బ్లాస్ట్‌లో కనిపిస్తోంది. గురువారం జరిగిన నార్త్ గ్రూప్ మ్యాచ్‌లో నార్తాంప్టన్‌షైర్ ఆటగాడు జోష్ కాబ్ ఓ అద్భుతమైన క్యాచ్‌తో ఆశ్చర్యపరిచాడు.

Viral Video: వార్నీ.. భారీకాయంతో భలే క్యాచ్ పట్టాడే.. బౌండరీ లైన్‌లో కళ్లు చెదిరే ఫీల్డింగ్.. నెటిజన్స్ ఫిదా
Josh Cobb Video
Venkata Chari
|

Updated on: Jun 02, 2023 | 1:07 PM

Share

Vitality T20 Blast Video: ఐపీఎల్ ముగిసిన తర్వాత మరో టీ20 టోర్నీ మొదలైంది. తుఫాన్ బ్యాటింగ్, అద్భుతమైన బౌలింగ్‌తో పాటు ఆశ్చర్యకరమైన ఫీల్డింగ్ కూడా ఇంగ్లండ్‌లో టీ20 బ్లాస్ట్‌లో కనిపిస్తోంది. గురువారం జరిగిన నార్త్ గ్రూప్ మ్యాచ్‌లో నార్తాంప్టన్‌షైర్ ఆటగాడు జోష్ కాబ్ ఓ అద్భుతమైన క్యాచ్‌తో ఆశ్చర్యపరిచాడు. బౌండరీ లైన్‌లో కాబ్ అత్యుత్తమ క్యాచ్ పట్టి అందరికి షాక్ ఇచ్చాడు.

జోష్ కాబ్ బరువు 90 కేజీల కంటే ఎక్కువే. కానీ, బౌండరీ లైన్‌లో ఫుల్ లెంగ్త్ డైవ్ చేసి క్యాచ్ పట్టిన తీరు నిజంగా అద్భుతం అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కాబ్ అద్భుతమైన క్యాచ్ ఎలా తీసుకున్నాడంటే?

ఇన్నింగ్స్ 16వ ఓవర్‌లో కాబ్ ఈ అద్భుతమైన క్యాచ్ పట్టగా.. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ రాబ్ యేట్స్ అద్భుతమైన షాట్ ఆడాడు. బంతి లెగ్ సైడ్‌లో బౌండరీ లైన్ దాటినట్లు అనిపించింది. అది సిక్స్ అవుతుందేమో అనిపించింది. అయితే అక్కడే ఉన్న జోష్ కాబ్ డైవ్ చేసి క్యాచ్ పట్టాడు. బంతిని పట్టుకున్న కాబ్ స్లిప్ అవుతూ బౌండరీ లైన్‌కు చేరుకున్నాడు. అతని శరీరం సరిహద్దుకు కొన్ని అంగుళాల దూరంలో ఆగిపోయింది. కాబ్ క్యాచ్ పట్టడంతో యేట్స్ ఇన్నింగ్స్ 71 పరుగుల వద్ద ముగిసింది.

నార్తాంప్టన్‌షైర్‌ను ఓడించిన బర్మింగ్‌హామ్..

మ్యాచ్ గురించి మాట్లాడితే, బర్మింగ్‌హామ్ బేర్స్ 21 పరుగుల తేడాతో నార్తాంప్టన్‌షైర్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బర్మింగ్‌హామ్ 20 ఓవర్లలో 202 పరుగులు చేసింది. తొలి బంతికే గ్లెన్‌ మాక్స్‌వెల్‌ అవుటయ్యాడు. అయినప్పటికీ, బర్మింగ్‌హామ్ అద్భుతమైన స్కోరు సాధించింది.

ఆ తర్వాత, నార్తాంప్టన్‌షైర్ తరపున ఓపెనర్ రికార్డో 39 బంతుల్లో 65 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కానీ, మరే ఇతర బ్యాట్స్‌మన్ అతనికి మద్దతు ఇవ్వలేకపోయాడు. నార్తాంప్టన్‌షైర్ జట్టు 181 పరుగులు మాత్రమే చేయగలిగింది. అద్భుత హాఫ్ సెంచరీ చేసిన రాబ్ యేట్స్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. నార్త్ గ్రూప్‌లో బర్మింగ్‌హామ్ జట్టు అగ్రస్థానంలో నిలిచింది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. మరోవైపు, నార్తాంప్టన్‌షైర్ 4 మ్యాచ్‌ల్లో 2 గెలిచి 2 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..