CM KCR: జెండాను ఆవిష్కరించి, దశాబ్ది వేడుకలను ప్రారంభించిన సీఎం కేసీఆర్.. దేశానికి తెలంగాణ దిక్సూచిగా నిలిచిందంటూ..
Telangana Formation Day 2023: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది వేడుకలు సచివాలయంలో ఘనంగా జరుగుతున్నాయి. ఆ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయంలో జెండా ఆవిష్కరించి, దశాబ్ది ఉత్సవాలను లాఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ..
Telangana Formation Day 2023: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది వేడుకలు సచివాలయంలో ఘనంగా జరుగుతున్నాయి. ఆ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయంలో జెండా ఆవిష్కరించి, దశాబ్ది ఉత్సవాలను లాఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటు కోసం ప్రాణాలర్పించిన అమరుల ఆశయాలు, ఆకాంక్షల సాధనకు కృషి చేస్తున్నామన్నారు. గ్రామస్థాయి నుంచి నగరం వరకు 21 రోజుల పాటు వేడుకలు నిర్వహిస్తాద్దాని, దేశానికి దిక్సూచిగా నిలిచిన తెలంగాణ ప్రగతి దశదిశలా చాటుదామని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నో అవరోధాలను అధిగమిస్తూ బలీయ శక్తిగా తెలంగాణ ఎదిగిందని, తెలంగాణ దృక్పథంతో ప్రభుత్వం విధానాలను రూపొందించుకుందని తెలిపారు.
ఇంకా సీఎంగా తాను ప్రమాణం చేసిన రోజు ఇచ్చిన మాటను మరువలేదంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తు చేశారు. మ్యానిఫెస్టోను చిత్తశుద్ధితో అమలు చేశామని, అభివృద్ధి ఫలాలు ప్రజలందించడంలో కొత్త కోణాన్ని ఆవిష్కరించామని ఉద్ఘాటించారు. రాష్ట్రంలో కరెంట్ కోతలు లేవని, ఎటుచూసినా వరి కోతలే ఉన్నాయంటూ ప్రతిపక్షలకు కౌంటర్ ఇచ్చారు. పల్లెలు, పట్టణాలు ప్రపంచస్థాయి గుర్తింపు పొందుతున్నాయని, జూన్ 24 నుంచి పోడు భూముల పట్టాల పంపిణీ చేస్తామని, అలాగే పోడు భూములకు రైతుబంధు వర్తించేలా చర్యలు తీసుకుంటామని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.
ఇంకా రాష్ట్రం ఏర్పడిన నాటి పరిస్థితులను నేటి పరిస్థితులతో ఒకసారి బేరీజు వేసుకొని చూస్తే, మనం సాధించిన ఆశ్చర్యకరమైన విజయాలు కళ్ళ ముందు కదలాడుతాయని కేసీఆర్ పేర్కొన్నారు. గడిచిన ఈ తొమ్మిదేళ్ళ వ్యవధిలో వాయువేగంతో రాష్ట్రం ప్రగతి శిఖరాలను అధిరోహించిందని, అభివృద్ధిని సాధించడమేకాదు, అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందించడంలో కూడా రాష్ట్రం నూతన ఒరవడిని దిద్దిందని అన్నారు. మానవీయకోణంలో రూపొందించిన పథకాల పట్ల నేడు దేశమంతటా ఆదరణ వ్యక్తమవుతోందని, మన ప్రభుత్వ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా ఆచరణీయంగా నిలవడమే కాక ఆయా రాష్ట్రాల ప్రజలు తమకు కూడా తెలంగాణ తరహా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. ఇప్పుడే దేశంలో తెలంగాణ మోడల్ ట్రెండ్ నడుస్తోందని, తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులు మన పథకాలపట్ల ఆకర్షితులై తాము అమలు చేస్తామని ప్రకటించినప్పుడు ఎంతో గర్వంగానూ, ఆనందంగానూ అనిపిస్తోందని సీఎం కేసీఆర్ వెల్లడించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..