Watch Video: తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు.. సోనియా గాంధీ చిత్రపటానికి వీహెచ్ పాలాభిషేకం..
తెలంగాణ అవతరణ దశాబ్ధి ఉత్సవాలను కాంగ్రెస్ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ వేడుకల్లో భాగంగా హైదరాబాద్ గాంధీ భవన్‌లో సోనియా గాంధీ చిత్రపటానికి సీనియర్ నేత వీ హనుమంతరావు పాలాభిషేకం నిర్వహించారు.
తెలంగాణ అవతరణ దశాబ్ధి ఉత్సవాలను కాంగ్రెస్ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. జిల్లాల్లో ప్రత్యేక ర్యాలీలు, సభలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో భాగంగా హైదరాబాద్ గాంధీ భవన్‌లో సోనియా గాంధీ చిత్రపటానికి సీనియర్ నేత వీ హనుమంతరావు పాలాభిషేకం నిర్వహించారు. పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. సోనియా గాంధీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష నెరవేరిందని ఆ పార్టీ నేతలు గుర్తుచేసుకున్నారు. సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ ఆకాంక్ష నెరవేరేది కాదని స్వయంగా సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా చెప్పారని గుర్తుచేశారు.
Published on: Jun 02, 2023 11:35 AM
వైరల్ వీడియోలు
Latest Videos