Watch Video: స్వయంగా సకినాలు కాల్చిన వైఎస్ షర్మిల.. YSRTP కార్యాలయంలో సందడి
హైదరాబాద్‌లోని YSRTP కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. జాతీయ జెండాను ఆవిష్కరించారు.
హైదరాబాద్‌లోని YSRTP కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలకు డబల్ కా మీటాను షర్మిల పంచిపెట్టారు. స్వయంగా సకినాలు కాల్చుతూ సందడి చేశారు వైఎస్ షర్మిల.
నీళ్లు, నిధులు, నియామకాల కోసం మూడు కోట్ల మంది ఏకమై కొట్లాడితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిందంటూ షర్మిల ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. అమరవీరుల త్యాగ ఫలితం, సబ్బండ వర్గాల పోరాట ఫలితంగా ప్రత్యేక రాష్ట్రం సాకారమయ్యిందన్నారు. ప్రత్యేక రాష్ట్రంలోనూ ఉద్యమ ఆకాంక్షలు, ఆశయాలు కనుమరుగవుతున్న వేళ.. దొరల పాలన మళ్లీ వచ్చిన వేళ, ప్రతిపక్షాలు అమ్ముడుపోయిన సమయంలో పుట్టిందే వైఎస్సార్ తెలంగాణ పార్టీ అని పేర్కొన్నారు.
Published on: Jun 02, 2023 03:02 PM
వైరల్ వీడియోలు
Latest Videos