Success Story: రైలు ప్రమాదంలో కాళ్లు, చేయి పోగొట్టుకున్న సూరజ్.. తండ్రి కష్టం చూసి పట్టుదలతో యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత..
రైలు ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయిన సూరజ్ యూపీఎస్సీ పరీక్షలో 917వ ర్యాంకు సాధించాడు. అది కూడా మొదటి ప్రయత్నంలో ఈ విజయం సాధించిన సూరజ్‌పై భారీగా ప్రశంసల వర్షం కురుస్తోంది. అంతేకాదు ప్రస్తుతం సోషల్ మీడియాలో సూరజ్ చిన్న సైజు సెలబ్రెటీ అయ్యాడు కూడా..
కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి అన్న మాటలను ఓ యువకుడు ఆచరణలో పెట్టి చూపించాడు. విధి వక్రీకరించి తన కాళ్ళను బలి తీసుకున్నా మొక్కవోని దీక్ష, పట్టుదలతో నేటి యువతకు స్ఫూర్తిగా నిలచారు ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి నివాసి సూరజ్ తివారీ. ఒక ప్రమాదంలో రెండు కాళ్ళు, చేయి కోల్పోయినా UPSC సివిల్ సర్వీసెస్ (UPSC) పరీక్షలో జెండా ఎగురవేసి ప్రతిభ దేనికీ అడ్డం కాదని నిరూపించాడు. తండ్రి టైలరింగ్ చేస్తూ తన వైద్యం కోసం పడుతున్న కష్టాన్ని చూసి మరింత పట్టుదలతో చదివి నేడు చరిత్ర పుటల్లో తనకంటూ ఓ స్తానాన్ని సంపాదించుకున్నాడు. రైలు ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయిన సూరజ్ యూపీఎస్సీ పరీక్షలో 917వ ర్యాంకు సాధించాడు. అది కూడా మొదటి ప్రయత్నంలో ఈ విజయం సాధించిన సూరజ్‌పై భారీగా ప్రశంసల వర్షం కురుస్తోంది. అంతేకాదు ప్రస్తుతం సోషల్ మీడియాలో సూరజ్ చిన్న సైజు సెలబ్రెటీ అయ్యాడు కూడా..
24 జనవరి 2017న ఘజియాబాద్‌లోని దాద్రీలో జరిగిన రైలు ప్రమాదంలో సూరజ్ తన అవయవాలను కోల్పోయాడు. సూరజ్ ఈ ప్రమాదంలో రెండు కాళ్లతో పాటు కుడి చేతిని, ఎడమ చేతిలోని రెండు వేళ్లను కోల్పోయాడు. నాలుగు నెలలు ఆసుపత్రిలో ఉన్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత సుమారు మూడు నెలలు బెడ్ రెస్ట్ తీసుకున్నాడు. ఈ సమయంలో తన తండ్రి తన కోసం పడుతున్న కష్టాన్ని చూశాడు. దీంతో సూరజ్ కు తాను భవిష్యత్ లో ఏదైనా సాధించాలనే పట్టుదల వచ్చింది.
2018 సంవత్సరంలో JNU ఢిల్లీలో BA లో అడ్మిషన్ తీసుకున్నాడు. 2021లో బీఏ ఉత్తీర్ణతైన సూరజ్ ఎంఏలో ప్రవేశం పొందాడు. అయితే సూరజ్ కు చిన్న తనం నుంచి సివిల్ సర్వీసెస్ పరీక్ష రాయాలనే కల కనేవాడు. ఆ కల నెరవేర్చుకోవడానికి సూరజ్ తివారీ ఓ వైపు ఎంఏ చదువుతూనే మరోవైపు UPSCకి సిద్ధమవుతూనే ఉన్నాడు. ఇప్పుడు తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు.
సూరజ్ విజయంతో తల్లిదండ్రుల సంతోషానికి హద్దేలేదు. అంతేకాదు తన కుమారుడి విజయం గురించి సూరజ్ తండ్రి రాజేష్ తివారీ మాట్లాడుతూ.. “ప్రమాదం జరిగిన తర్వాత కూడా తన కుమారుడు నిరాశ పడలేదని.. భవిష్యత్ గురించి భయపడ లేదని మరింత పట్టుదలతో చదువుకున్నాడని చెప్పాడు. అంతేకాదు సూరజ్ లాంటి కొడుకు ప్రతి ఇంట్లోనూ పుట్టాలంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు రాజేష్ తివారి.
UP | Suraj Tiwari from Mainpuri, who lost both his legs as well as his right arm and two fingers of his left hand in a train accident at Ghaziabad’s Dadri in 2017, clears the UPSC Civil Services Exam
(Image source: Provided by Suraj Tiwari) pic.twitter.com/0eOgqRK2eh
— ANI (@ANI) May 25, 2023
మరోవైపు, కుమారుడి విజయం గురించి సూరజ్ తల్లి మాట్లాడుతూ, “తన కొడుకు ప్రమాదం జరిగిన తర్వాత కూడా ధైర్యం కోల్పోలేదు.. అంతేకాదు తమకు చింతించకండి, నేను చాలా డబ్బు సంపాదిస్తాను అని మమ్మల్ని ప్రోత్సహించాడు.” యూపీఎస్సీ పరీక్షలో తొలి ప్రయత్నంలోనే విజయం సాధించాడు అంటూ కొడుకు సాధించిన విజయానికి గర్వంగా చెప్పింది.
మెయిన్‌పురిలోని మొహల్లా ఘర్నాజ్‌పూర్‌కు చెందిన సూరజ్ తివారీ యూపీఎస్సీ పరీక్షలో తొలి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించాడు. అతని తండ్రి రాజేష్ తివారీ వృత్తిరీత్యా టైలర్. బట్టలు కుట్టిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రాజేష్ తివారీకి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు రాహుల్ తివారీ మరణించగా, చిన్న కుమారుడు రాఘవ్ తివారీ BSC, కుమార్తె ప్రియ BTC చేస్తున్నారు. సూరజ్ ధైర్యానికి అఖిలేష్ సెల్యూట్ చేశాడు
मैनपुरी के दिव्यांग सूरज तिवारी ने आईएएस की परीक्षा पहली बार में ही निकाल कर साबित कर दिया कि संकल्प की शक्ति अन्य सब शक्तियों से बड़ी होती है।
सूरज की इस ‘सूरज’ जैसी उपलब्धि के लिए हार्दिक बधाई और उज्ज्वल भविष्य के लिए अनंत शुभकामनाएँ! pic.twitter.com/RqslbzgEq8
— Akhilesh Yadav (@yadavakhilesh) May 24, 2023
రిజల్ట్ వెలువడిన తర్వాత సూరజ్ సక్సెస్ స్టోరీ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సూరజ్‌ని అభినందిస్తూ ప్రసంశలు వెల్లువెత్తుతున్నాయి. యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కూడా సూరజ్ ధైర్యానికి సలాం చేస్తూ అభినందించారు.
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ స్టోరీస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..