Success Story: విదేశాల్లో ఉద్యోగం వదులుకుని స్వదేశంలో వ్యవసాయం.. వందల మందికి ఉపాధి లక్షల్లో సంపాదన.. సక్సెస్ స్టోరీ మీకోసం

సత్య వ్యవసాయం చేసే విధానం అద్వితీయంగా, వినూత్నంగా ఉండడంతో స్థానికుల అభిమానాన్ని, అధికారుల దృష్టిని చూరగొన్నాడు. తన గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలోని సుమారు 60 మంది  వ్యక్తులను వ్యవసాయం చేయడానికి సాయంగా నియమించుకున్నాడు.

Success Story: విదేశాల్లో ఉద్యోగం వదులుకుని స్వదేశంలో వ్యవసాయం.. వందల మందికి ఉపాధి లక్షల్లో సంపాదన.. సక్సెస్ స్టోరీ మీకోసం
Satya Prabin
Follow us

|

Updated on: Apr 24, 2023 | 8:35 AM

Success story: ఆధునికతకు సాంప్రదాయాన్ని కలిపి వ్యవసాయం చేస్తే వ్యవసాయం దండగ కాదు పండగ అనిపిస్తుందని నిరూపిస్తున్నారు కొందరు అన్నదాతలు. ముఖ్యంగా ఉన్నత ఉద్యోగాలు చేస్తూ.. భారీ స్థాయిలో జీతాలు అందుకుంటున్న యువకులు తమ ఉద్యోగాలకు గుడ్ బై చెప్పేసి.. అన్నదాతగా మారి లక్షల్లో ఆర్జిస్తూ పరువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. తాజాగా ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ ఉద్యోగం వదిలి వ్యవసాయ రంగంలో అడుగు పెట్టాడు. ఇప్పుడు లక్షల్లో లాభాలు ఆర్జిస్తున్నాడు ఈ సక్సెస్ సాఫ్ట్ వేర్ అన్నదాత గురించి ఈ రోజు తెలుసుకుందాం..

ఒడిశాలోని రాయగడ జిల్లాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న సత్య ప్రబిన్ మంచి జీతాన్ని తీసుకునేవాడు. మలేషియాలో ఐటీ ఉద్యోగం చేస్తూ అధిక జీతం తీసుకునే సత్య వ్యవసాయం చేయడంపై మక్కువ పెంచుకున్నాడు. దీంతో జాబ్ కు గుడ్ బై చెప్పేసి.. స్వగ్రామానికి తిరిగి వచ్చి వ్యవసాయంపై తనకున్న అభిరుచిని నెరవేర్చుకున్నాడు.

సత్య తండ్రి జీవనోపాధి కోసం కూరగాయలు పండించేవాడు. తండ్రిని చేస్తున్న వ్యవసాయాన్ని చూసి  ప్రేరణ పొందాడు. తన 34 ఎకరాల భూమిలో డ్రిప్ సిస్టమ్, సేంద్రీయ ఎరువులు వంటి ఆధునిక పద్ధతులను ఉపయోగించి వ్యవసాయం ప్రారంభించాడు. వ్యవసాయంలో సత్య సాధించిన విజయాలు సమాజంలోని ఇతర రైతులకు ఆదర్శంగా నిలిచాయి.

ఇవి కూడా చదవండి

సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పూర్తి చేసిన సత్య, 11 ఏళ్లు మలేషియా ఐటీ కంపెనీలో పని చేస్తూ నెలకు రూ.2 లక్షలు సంపాదించేవాడు. అయినప్పటికీ సత్య ఎప్పుడూ వ్యవసాయం చేయాలి అంటూ ఆలోచించేవాడు.  పొలాల్లో పని చేస్తున్న తన తండ్రిని చిన్న తనం నుంచి గమనించేవాడు. అప్పటి నుంచి సత్యకు వ్యవసాయం పై మక్కువ పెరిగింది. 2020లో సత్య తన గ్రామానికి తిరిగి వచ్చి వ్యవసాయ రంగంలో అడుగు పెట్టాడు. ఆధునిక పద్ధతులు, సేంద్రీయ ఎరువులు ఉపయోగించి వివిధ రకాల కూరగాయలను పండించాడు.

సత్య వ్యవసాయం చేసే విధానం అద్వితీయంగా, వినూత్నంగా ఉండడంతో స్థానికుల అభిమానాన్ని, అధికారుల దృష్టిని చూరగొన్నాడు. తన గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలోని సుమారు 60 మంది  వ్యక్తులను వ్యవసాయం చేయడానికి సాయంగా నియమించుకున్నాడు. స్థానిక ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన సహకారాన్ని అందించాడు. కలెక్టర్ స్వధా దేవ్ సింగ్ సత్య వ్యవసాయ భూమిని సందర్శించి సత్య కృషిని ప్రశంసించారు.

రైతుగా సత్య సాధించిన విజయాలు సమాజంలోని ఇతరులకు ఆదర్శంగా నిలిచాయి. రాయగడ బ్లాక్ డెవలప్‌మెంట్ అధికారి లక్ష్మీ నారాయణ్ సబాత్ మాట్లాడుతూ.. సన్నకారు రైతులు సత్యను ఆదర్శంగా తీసుకుని సేంద్రియ ఎరువులతో తమ భూమిలో కూరగాయలు పండించి స్వయం సమృద్ధి సాధించి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాలని సూచించారు. అంతేకాదు సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయలు ఆరోగ్యానికి మంచివని చెప్పారు.

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నుండి విజయవంతమైన రైతుగా సత్య ప్రయాణం పదువురిని ఆకర్షించింది. సత్య  సంకల్పం, పట్టుదల, వ్యవసాయంపై మక్కువతో సాధించిన విజయం పదువురి హృదయాన్ని ఆకట్టుకుంది. అంతేకాదు ఎవరైనా తమ లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడి పనిచేస్తే విజయం సాధించవచ్చని  సత్య నిరూపించారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles