Viral Video: పెళ్లి వేదికపై కొట్టుకున్న వధూవరులు.. ఈ పూర్తి మ్యాచ్‌ను ఎక్కడ చూడగలం అంటున్న నెటిజన్లు..

సోషల్ మీడియాలో ఒక వీడియోలో పెళ్లి జరుగుతున్న సమయంలో వేదికపై వధువు , వరుడు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.   క్లిప్ ప్రారంభంలో.. వరుడు వధువుకు స్వీట్లు తినిపించడానికి ప్రయత్నిస్తున్నాడు. వరుడు ఆప్యాయంగా తినిపిస్తున్నట్లు కనిపిస్తున్నా.. పెళ్లికూతురు మాత్రం స్వీట్ ని తినడానికి ఆసక్తిని చూపించలేదు

Viral Video: పెళ్లి వేదికపై కొట్టుకున్న వధూవరులు.. ఈ పూర్తి మ్యాచ్‌ను ఎక్కడ చూడగలం అంటున్న నెటిజన్లు..
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Apr 20, 2023 | 10:11 AM

సోషల్ మీడియాలో పెళ్లి వీడియోలు బాగా పాపులర్ అవుతున్నాయి. వధూవరులు, బంధువులు, స్నేహితులు చేసే సందడి వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రేమ, శృంగారం, వర్ణన కోసం కొందరు దృష్టిని ఆకర్షించగా, వేడుకలో జరిగిన విచిత్రమైన సంఘటనలు మరికొందరిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా  పెళ్ళికి సంబంధించిన వీడియో ఒకటి  నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. పెళ్లి వేడుక జరుగుతుండగా.. వధువు , వరుడు ఒకరినొకరు కొట్టుకుంటున్నారు ఈ వీడియో.. సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

సోషల్ మీడియాలో ఒక వీడియోలో పెళ్లి జరుగుతున్న సమయంలో వేదికపై వధువు , వరుడు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.   క్లిప్ ప్రారంభంలో.. వరుడు వధువుకు స్వీట్లు తినిపించడానికి ప్రయత్నిస్తున్నాడు. వరుడు ఆప్యాయంగా తినిపిస్తున్నట్లు కనిపిస్తున్నా.. పెళ్లికూతురు మాత్రం స్వీట్ ని తినడానికి ఆసక్తిని చూపించలేదు.. అంతేకాదు.. పెళ్లి కూతురు బలవంతంగా వరుడి చేతిని  తీసేయడానికి ప్రయత్నించింది. వెంటనే  ఆమె పెళ్లికొడుకుపై చేయి చేసుకుంది. దీని తర్వాత అక్కడ పెళ్లి వేదిక కుస్తీ పోటీకి వేదికగా మారింది. వధువు , వరుడు ఒకరినొకరు కొట్టుకోవడం మొదలు పెట్టారు. దీంతో చుట్టుపక్కల ఉన్న అతిధులు, స్నేహితులు ఆ జంటను విడదీయానికి ప్రయత్నించారు. పరిస్థితిని చక్కదిద్దడానికి తమ శాయశక్తులా ప్రయత్నించారని వీడియో చూస్తే తెలుస్తోంది.

దురదృష్టవశాత్తు, వధూవరులు తమ కోట్లకును ఆపలేదు. ఒకరి జుట్టుని ఒకరు పట్టుకుని బట్టలను లాగుతూ చిన్నపిల్లల్లా పోట్లాడటం కొనసాగించారు. రెజ్లింగ్ మ్యాచ్‌లో పోటీపడిన క్రీడాకారుల్లా వధూవరులు ఇద్దరూ కలిసి పోటీపడ్డారు చివరికి పడిపోవడంతో ఈ వైరల్ వీడియో ముగిసింది. మరికొంత మంది వ్యక్తులు కూడా వేదికపై కనిపించారు.

ఇవి కూడా చదవండి

@gharkekalesh అనే వినియోగదారు ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. వేలాది వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఈ వీడియోపై పలువురు కామెంట్లు చేశారు. వారు పెళ్లి చేసుకుంటున్నారా లేదా విడాకులు తీసుకుంటున్నారా అని ఒకరు అడిగారు. గృహ హింస కేసు నమోదు చేశారా అని మరొకరు.. “నేను ఈ పూర్తి మ్యాచ్‌ని ఎక్కడ చూడగలను??” అంటూ ఇంకొకరు, “వెడ్డింగ్ కార్డ్‌లోని పెళ్ళికి ఆహ్వానం అని తప్పుగా రాసారని..కామెంట్ చేశారు. అయితే మరికొందరు ఈ వీడియో మొత్తం స్క్రిప్ట్ అని అంటున్నారు. మొత్తానికి ఈ వెడ్డింగ్ క్లిక్ పలువురిని ఆకర్షిస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..