AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sarus Crane: తనను రక్షించిన వ్యక్తిని చూసిన ఆనందంలో కొంగ.. సరస్ ఆత్రం ఆనందం చూస్తే భావోద్వేగం ఆగదు ఎవరికైనా.. ..

ఆ పక్షి త్వరలో ఆరిఫ్,  అతని కుటుంబంతో సన్నిహిత బంధాన్ని పెంచుకుంది. అంతేకాదు గత నెలలో అటవీ అధికారులు సరస్ ను తీసుకెళ్లే వరకు ఆరిఫ్ ఇంట్లోనే నివసించింది. ఇప్పుడు.. ఆరిఫ్ , సరస్ క్రేన్ మధ్య కలయిక సమయంలో చోటు చేసుకున్న ఘటనను చూపించే వీడియో చూపరులను భావోద్వేగానికి గురి చేసింది.

Sarus Crane: తనను రక్షించిన వ్యక్తిని చూసిన ఆనందంలో కొంగ.. సరస్ ఆత్రం ఆనందం చూస్తే భావోద్వేగం ఆగదు ఎవరికైనా.. ..
Sarus Crane
Surya Kala
| Edited By: seoteam.veegam|

Updated on: Apr 12, 2023 | 3:13 PM

Share

తమకు చేసిన సాయాన్ని చూపించిన జాలి దయను మనిషి అయినా మరచిపోతాడు కానీ.. పక్షులు, జంవుతులు మరచిపోవని మరోసారి రుజువు చేసింది సరస్ అనే కొంగ. తనను రక్షించి ఏడాది పాటు జాగ్రత్తలు తీసుకున్న ఆరిఫ్ గురించి ఇటీవల వైరల్ అయిన సంగతి తెలిసిందే. సరస్ క్రేన్‌తో ఆరిఫ్ స్నేహం  కథ కొన్ని నెలల క్రితం ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. గతేడాది ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో గాయపడిన క్రేన్‌ను గుర్తించిన ఆరిఫ్ దానిని ఇంటికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. ఆ పక్షి త్వరలో ఆరిఫ్,  అతని కుటుంబంతో సన్నిహిత బంధాన్ని పెంచుకుంది. అంతేకాదు గత నెలలో అటవీ అధికారులు సరస్ ను తీసుకెళ్లే వరకు ఆరిఫ్ ఇంట్లోనే నివసించింది. ఇప్పుడు.. ఆరిఫ్ , సరస్ క్రేన్ మధ్య కలయిక సమయంలో చోటు చేసుకున్న ఘటనను చూపించే వీడియో చూపరులను భావోద్వేగానికి గురి చేసింది.

క్రేన్‌ను ఆరిఫ్ ఇంటి నుంచి కాన్పూర్ జంతుప్రదర్శనశాలకు తరలించారు. ఆరిఫ్ సరస్ ను చూడడానికి వెళ్లిన సందర్భంలో పక్షి ఆరిఫ్‌ను గుర్తించింది. అతనికి దగ్గరకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నట్లు.. సంతోషంగా రెక్కలు ఊపుతోంది. ఆత్రంగా పంజరం చుట్టూ.. తిరుగుతోంది. ఇదే వీడియోలో కనిపిస్తుంది. అయితే ఎన్‌క్లోజర్ కారణంగా ఇద్దరికీ దూరం ఉంది.

ఎమోషనల్ రీయూనియన్ వీడియోను ట్విట్టర్‌లో పంచుకున్నారు. “ఈ రోజు మరోసారి మాటలు రాని కొంగ తన ప్రాణమిచ్చే స్నేహితుడు ఆరిఫ్‌ను చూసి బాధతో కిచకిచలాడింది. అయితే ఇద్దరూ నిస్సహాయంగా ఉన్నారు. ఒకరినొకరు ప్రేమగా తాకలేరు.”

ఆరిఫ్ ను,  అతని పక్షిని వేరుచేయడం చాలా మంది “క్రూరత్వం” అని కామెంట్ చేస్తున్నారు. ట్విట్టర్ వినియోగదారులు ఈ వీడియోను చూసి భావోద్వేగానికి గురయ్యారు.

“అరిఫ్ మరియు సరస్ యొక్క బాధను ఎవరైనా సున్నితమైన వ్యక్తి అనుభవించవచ్చు, కానీ అయ్యో, రాష్ట్ర ప్రభుత్వం మరియు వారి ఉదాసీనత, మేము ఈ బాధను చూడలేకపోతున్నాము” అని ఒక వ్యాఖ్య చదవబడింది.

ఈ సంవత్సరం ప్రారంభంలో, ఆరిఫ్ బైక్ మీద వెళ్తున్న సమయంలో అతడిని అనుసరిస్తూ వెళ్ళిన పక్షి వీడియో ట్విట్టర్‌లో వైరల్ అయ్యాయి.

సరస్ క్రేన్‌ను జూకి తరలించిన తర్వాత పక్షి సరిగ్గా తినడానికి నిరాకరిస్తున్నట్లు నివేదికలు వెలువడ్డాయి. ఈ వార్తలపై ఆరిఫ్    స్పందిస్తూ, “సరస్ క్రేన్ నా ఫోటోను చూస్తే వెంటనే తినడం ప్రారంభిస్తుంది” అని పేర్కొన్నాడు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..