AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: ఈశాన్య రాష్ట్రాలపై ప్రధాని మోడీ ఫుల్ ఫోకస్.. అస్సాంలో రూ.14,300 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. ఎప్పుడంటే..

ఢిల్లీకి ఈశాన్య రాష్ట్రాలు భౌగౌళికంగా దూరం కావొచ్చు.. కానీ, నా మనస్సుకు మాత్రం దగ్గరే.. అంటూ గతంలో వ్యాఖ్యానించిన ప్రధాని మోడీ.. వారి ఆశలను సాకారం చేసేందుకు నడుంబిగించారు. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏప్రిల్ 14న (శుక్రవారం) అస్సాంలో పర్యటించనుండటం.. వేలాది కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనుండటం విశేషం..

PM Modi: ఈశాన్య రాష్ట్రాలపై ప్రధాని మోడీ ఫుల్ ఫోకస్.. అస్సాంలో రూ.14,300 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. ఎప్పుడంటే..
Pm Modi
Shaik Madar Saheb
|

Updated on: Apr 12, 2023 | 1:59 PM

Share

ఢిల్లీకి ఈశాన్య రాష్ట్రాలు భౌగౌళికంగా దూరం కావొచ్చు.. కానీ, నా మనస్సుకు మాత్రం దగ్గరే.. అంటూ గతంలో వ్యాఖ్యానించిన ప్రధాని మోడీ.. వారి ఆశలను సాకారం చేసేందుకు నడుంబిగించారు. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏప్రిల్ 14న (శుక్రవారం) అస్సాంలో పర్యటించనుండటం.. వేలాది కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనుండటం విశేషం.. ఈ పర్యటనలో ప్రధాని మోడీ దాదాపు రూ.14,300 కోట్లతో నిర్మించిన ఎయిమ్స్, మూడు మెడికల్ కాలేజీలతో సహా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ పర్యటనలో ఇతర ప్రాజెక్టులతో పాటు, పలాష్‌బరి – సువల్‌కుచిని కలుపుతూ బ్రహ్మపుత్ర నదిపై వంతెనకు శంకుస్థాపన చేయనున్నారు. దీంతోపాటు రంగ్ ఘర్, శివసాగ సుందరీకరణ కార్యక్రమాన్ని కూడా మోదీ ప్రారంభిస్తారని పీఎంఓ ప్రకటనలో తెలిపింది. 10,000 మందికి పైగా ప్రదర్శకులు పాల్గొనే మెగా బిహు నృత్య కార్యక్రమంలో కూడా ప్రధాని మోడీ పాల్గొననున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాన మంత్రి మోడీ.. గౌహతిలోని ఎయిమ్స్ కు చేరుకుని, కొత్తగా నిర్మించిన క్యాంపస్‌ని పరిశీలిస్తారు. తదనంతరం జరిగే బహిరంగ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈసందర్బంగా ఎయిమ్స్ గౌహతి, మరో మూడు మెడికల్ కాలేజీలను జాతికి అంకితం చేస్తారు. అస్సాం అడ్వాన్స్‌డ్ హెల్త్ కేర్ ఇన్నోవేషన్ ఇన్‌స్టిట్యూట్ (AAHII)కి శంకుస్థాపన చేస్తారు. అర్హులైన లబ్ధిదారులకు ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB-PMJAY) కార్డులను పంపిణీ చేయనున్నారు. అంతేకాకుండా ‘ఆప్కే ద్వార్ ఆయుష్మాన్’ ప్రచారాన్ని ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2:15 గంటలకు, గౌహతిలోని శ్రీమంత శంకర్‌దేవ్ కళాక్షేత్రలో జరిగే గౌహతి హైకోర్టు ప్లాటినం జూబ్లీ ఉత్సవాలకు ప్రధాన మంత్రి హాజరుకానున్నారు.

గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ కోసం.. మెగా బిహు ఈవెంట్..

సాయంత్రం, మోడీ గువాహటిలోని సరుసజై స్టేడియంకు చేరుకుంటారు. సరుసజై స్టేడియంలో జరిగే బిహూ కార్యక్రమాన్ని తిలకిస్తారు. ఈ సందర్బంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి ప్రసంగించనున్నారు. అస్సామీ ప్రజల సాంస్కృతిక గుర్తింపు, జీవితానికి చిహ్నంగా బిహు నృత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పేందుకు మెగా ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్‌లో ఒకే వేదికలో 10,000 కంటే ఎక్కువ మంది ప్రదర్శకులు/బిహు కళాకారులు పాల్గొంటారు. ఒకే వేదికపై ప్రపంచంలోనే అతిపెద్ద బిహు నృత్య ప్రదర్శన విభాగంలో కొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సాధించడానికి ప్రయత్నం జరగనుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని 31 జిల్లాల నుంచి కళాకారులు పాల్గొంటారు.

మోడీ నిబద్దతకు నిదర్శనం..

AIIMS, గౌహతి కార్యాచరణ అస్సాం రాష్ట్రానికి, మొత్తం ఈశాన్య ప్రాంతానికి ఒక ముఖ్యమైన సందర్భాన్ని సూచిస్తుంది. ఇది దేశవ్యాప్తంగా ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో మోడీ నిబద్ధతకు నిదర్శనమని సూచిస్తుంది. ఈ ఆసుపత్రికి శంకుస్థాపన కూడా మే 2017లో మోడీ చేశారు. రూ. 1,120 కోట్ల వ్యయంతో నిర్మించిన AIIMS గౌహతి 30 ఆయుష్ పడకలతో సహా 750 పడకల సామర్థ్యం కలిగిన అత్యాధునిక ఆసుపత్రి. ఈ ఆసుపత్రిలో వార్షికంగా 100 MBBS విద్యార్థులను తీసుకునే సామర్థ్యం ఉంటుంది. ఈశాన్య ప్రజలకు ప్రపంచ స్థాయి ఆరోగ్య సౌకర్యాలను అందిస్తుంది.

ఇవి కూడా చదవండి

నల్బారి, నాగావ్, కోక్రాఝర్‌లలో మూడు మెడికల్ కాలేజీలను వరుసగా దాదాపు రూ.615 కోట్లు, రూ.600 కోట్లు, రూ.535 కోట్లతో నిర్మించారు. ఒక్కో మెడికల్ కాలేజీలో వార్షికంగా 100 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు చేర్చుకునే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.

‘ఆప్కే ద్వార్ ఆయుష్మాన్’ ప్రచారాన్ని లాంఛనప్రాయంగా ప్రారంభించడం, సంక్షేమ పథకాలను 100 శాతం సంతృప్తికరంగా ఉండేలా ప్రతి లబ్దిదారునికి చేరువ కావాలనే మోదీ దార్శనికతను సాకారం చేసే దిశగా ముందడుగు అని ప్రభుత్వం ప్రకటనలో పేర్కొంది.

ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB-PMJAY) కార్డులను ముగ్గురు ప్రాతినిధ్య లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. ఆ తర్వాత రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో దాదాపు 1.1 కోట్ల AB-PMJAY కార్డుల పంపిణీ జరుగుతుంది.

అస్సాం అడ్వాన్స్‌డ్ హెల్త్ కేర్ ఇన్నోవేషన్ ఇన్‌స్టిట్యూట్ (AAHII)కి శంకుస్థాపన చేయడం ఆరోగ్యానికి సంబంధించిన రంగాలలో ‘ఆత్మనిర్భర్ భారత్’, ‘మేక్ ఇన్ ఇండియా’ అనేది ప్రధానమంత్రి దార్శనికతను సాకారం చేసే దిశగా ముందడుగు కానుంది.

గౌహతి హైకోర్టు ప్లాటినం జూబ్లీ ఉత్సవాల సందర్భంగా జరిగే కార్యక్రమానికి ప్రధాన మంత్రి హాజరవుతారు. ఈ సందర్బంగా అస్సాం పోలీసులు రూపొందించిన ‘అస్సాం కాప్’ అనే మొబైల్ అప్లికేషన్‌ను మోడీ ప్రారంభించనున్నారు. ఈ యాప్ క్రైమ్ అండ్ క్రిమినల్ నెట్‌వర్క్ ట్రాకింగ్ సిస్టమ్ (CCTNS) డేటాబేస్, VAHAN నేషనల్ రిజిస్టర్ నుంచి నిందితులు, వాహన శోధనను సులభతరం చేస్తుందని పేర్కొంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..