AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vande Bharat Train: మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రధాని మోడీ శ్రీకారం.. దేశంలో 14వ సూపర్ స్పీడ్ ట్రైన్..

PM Narendra Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజస్థాన్‌లో తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను బుధవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ అజ్మీర్ (రాజస్థాన్) నుంచి ఢిల్లీ మధ్య పరుగులు తీయనుంది.

Vande Bharat Train: మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రధాని మోడీ శ్రీకారం.. దేశంలో 14వ సూపర్ స్పీడ్ ట్రైన్..
Pm Modi
Shaik Madar Saheb
|

Updated on: Apr 12, 2023 | 1:28 PM

Share

Vande Bharat Express: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజస్థాన్‌లో తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను బుధవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ అజ్మీర్ (రాజస్థాన్) నుంచి ఢిల్లీ మధ్య పరుగులు తీయనుంది. అజ్మీర్-ఢిల్లీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రపంచంలోనే మొదటి సెమీ-హై-స్పీడ్ ప్యాసింజర్ రైలుగా అధికారులు తెలిపారు. రాజస్థాన్‌లో తొలి, దేశంలోని 14వ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఇది అభివృద్ధి, ఆధునికత, స్వావలంబన, స్థిరత్వానికి పర్యాయపదంగా మారిందని పేర్కొంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రాజస్థాన్ పర్యాటక పరిశ్రమకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపారు. గత రెండు నెలల్లో ఆరవ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించడం అదృష్టం అంటూ మోడీ పేర్కొన్నారు. స్వార్థ, నీచ రాజకీయాలు.. గతంలో రైల్వేల ఆధునీకరణను అడ్డుకున్నాయంటూ ప్రధాని మోడీ.. విచారం వ్యక్తంచేశారు.

“దురదృష్టవశాత్తూ, స్వార్థపూరిత, నీచ రాజకీయాలు రైల్వేల ఆధునీకరణను ఎప్పుడూ కప్పివేస్తున్నాయి. రైల్వేలో పెద్ద ఎత్తున అవినీతి జరగలేదు లేదా రైల్వేలలో అభివృద్ధి జరగనివ్వలేదు, రైల్వే ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా ఉండనివ్వలేదు” అంటూ ప్రధాని మోడీ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ఈ కొత్త వందే భారత్ రైలు రెగ్యులర్ సర్వీస్ ఏప్రిల్ 13 నుంచి ప్రారంభంకానుంది. ఈ ట్రైన్ జైపూర్, అల్వార్, గుర్గుగ్రామ్‌లలో స్టాప్‌లతో అజ్మీర్, ఢిల్లీ కంటోన్మెంట్ మధ్య నడుస్తుంది. ఇది ఢిల్లీ కంటోన్మెంట్ – అజ్మీర్ మధ్య దూరాన్ని ఐదు గంటల 15 నిమిషాల్లోనే కవర్ చేస్తుంది. అజ్మీర్-ఢిల్లీ కంటోన్మెంట్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ హై రైజ్ ఓవర్ హెడ్ ఎలక్ట్రిక్ (OHE).. ప్రపంచంలోనే మొదటి సెమీ హైస్పీడ్ ప్యాసింజర్ రైలు కానుంది.

దేశంలో ఇప్పటి వరకు 14 వందే భారత్ రైళ్లను ప్రారంభించగా.. మరో రెండింటిని త్వరలోనే ప్రారంభించేందుకు సన్నాహాలు పూర్తి చేశారు.

పూర్తి వివరాల కోసం ఈ లింకు ను క్లిక్ చేయండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం..