Viral Video: విదేశీ వీధుల్లో భారతీయ సంప్రాదయాన్ని రెపరెపలాడించిన మహిళ.. చీరతో మారథాన్‌.. వీడియో వైరల్

శ్రీమతి జెనా UKలోని ఒడియా కమ్యూనిటీ గురించి సగర్వంగా చాటి చెప్పారు. ఒడిషా గొప్ప వారసత్వాన్ని ప్రదర్శించినందుకు పలువురు ఆమెను అభినందించారు.  చీరను ధరించి ఆమె మారథాన్‌ను 4 గంటల 50 నిమిషాల్లో పూర్తి చేసింది.

Viral Video: విదేశీ వీధుల్లో భారతీయ సంప్రాదయాన్ని రెపరెపలాడించిన మహిళ.. చీరతో మారథాన్‌.. వీడియో వైరల్
Manchester Marathon
Follow us
Surya Kala

|

Updated on: Apr 19, 2023 | 11:14 AM

భారతీయ సంప్రాదయానికి చిహ్నం మహిళలు ధరించే చీర.. అయితే చీరను రెగ్యులర్ గా ధరించడానికి నేటి మహిళలు అంతగా ఆసక్తిని చూపించడం లేదు. ఇందుకు వారు చెప్పే కారణం.. ప్రయాణాల్లో, నడిచే సమయంలో చీర అడ్డుపడుతుంది.. ఇబ్బంది పెడుతుంది అని.. అయితే అవన్నీ ఒట్టు ఊహలే.. చీరను ధరించి చాకచకగా నడవచ్చు, పరుగు పెట్టవచ్చు అని ఎందరో మహిళలు నిరూపిస్తూనే ఉన్నారు. తాజాగా ఒడిశా కు చెందిన ఓ మహిళ.. యూకేలో జరిగిన మారథాన్‌లో పాల్గొంది.

UKలో నివసిస్తున్న ఒడిషాకు చెందిన మహిళ సంబల్‌పురి చేనేత చీరను ధరించి మారథాన్ లో పాల్గొంది. ఆదివారం మాంచెస్టర్‌లో జరిగిన 42.5 కి.మీ మారథాన్‌లో పరుగెత్తి వార్తల్లో నిలిచింది. ఎరుపు,  నారింజ రంగుల కలయికతో అందమైన చీరను, ఆరెంజ్ కలర్  స్నీకర్లు ధరించి..  41 ఏళ్ల మధుస్మిత జెనా దాస్ ఈ మారథాన్‌ను 4 గంటల 50 నిమిషాల్లో పూర్తి చేసింది.

ఇవి కూడా చదవండి

ఒక ట్విట్టర్ వినియోగదారుడు జెనా దాస్ మారథాన్‌లో ఇతర పార్టిసిపెంట్‌లతో కలిసి పాల్గొన్నట్లు చూపిస్తున్న ఈవెంట్ ఫోటోలను షేర్ చేశారు.

UKలోని మాంచెస్టర్‌లో నివసిస్తున్న ఒడిశాకు చెందిన మహిళ సంబల్‌పురి చీరను ధరించి.. యూకేలోని రెండవ అతిపెద్ద మాంచెస్టర్ మారథాన్ 2023లో పగులొంది. ఇది నిజంగా ఎంత గొప్ప సమయం.. ఆమె ఆత్మను ప్రేమించాను.. శతాబ్దాలుగా సహజీవనం చేస్తున్న గిరిజన, జానపద కమ్యూనిటీల అనుబంధాన్ని తెలిపే సంబల్పూర్ ప్రత్యేకమైన సమ్మిళిత సాంస్కృతిక గుర్తింపుకి చిహ్నం ఈ చీర అని పేర్కొన్నారు. ఇది కష్టతరమైన దశ, శాంతి, సామరస్యాన్ని కొనసాగిద్దామని కామెంట్ చేశారు. భారతీయ వారసత్వాన్ని సగర్వంగా ప్రదర్శిస్తూనే.. భారతీయ వస్త్రధారణను విదేశాల్లో సగర్వంగా ప్రదర్శించిందన్నారు.

‘ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా Soc Intl UK’ అధికారిక ట్విట్టర్ ఖాతాలో మారథాన్ వీడియోను షేర్ చేసింది. ఆమె చీరలో హాయిగా నడుస్తున్నట్లు చూపిస్తుంది. ఆమె స్నేహితులు , కుటుంబ సభ్యులు ఆమెను ఉత్సాహ పరుస్తున్నారు ఆ వీడియోలో..

తాజా ఫీట్‌తో.. జెనా UKలోని ఒడియా కమ్యూనిటీ తాము గర్వపడుతున్నట్లు పేర్కొంది. ఒడిషా గొప్ప వారసత్వాన్ని ప్రదర్శించినందుకు చాలా మంది ఆమెను అభినందించారు. చీరలో పరుగెత్తడం కష్టమైన పని అని  చాలామంది భావించారు. గర్వించదగిన క్షణం.. కీప్ ఇట్ అప్ డియర్..” అని ఒకరు కామెంట్ చేయగా.. వావ్ చూడడానికి చాలా మనోహరమైన ఫోటో. మన సంస్కృతిని ప్రపంచానికి ఈ విధంగా చూపించాలి, విదేశీ దుస్తులు ధరించడానికి సిద్ధంగా ఉన్నవారందరూ దయచేసి ఆమె నుండి నేర్చుకోండని మరొకరు కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..