Covid-19 Wuhan: కరోనా వైరస్ పుట్టుకపై తెరమీదకు కొత్త కోణం.. చైనా శాస్త్రవేత్త వింత వాదన ఏంటంటే..?

కోవిడ్‌-19 వైరస్‌ మనుషుల నుంచి జంతువులకు వ్యాపిస్తుందన్న సిద్ధాంతాన్ని అందించిన శాస్త్రవేత్త పేరు టోంగ్‌ యిగాంగ్‌. బీజింగ్‌ యూనివర్సిటీ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ ప్రొఫెసర్‌. వుహాన్‌లోని హువానాన్ సీఫుడ్ మార్కెట్ నుండి తీసిన వైరల్ శాంపిల్స్ , వైరస్ బాధితుల నమూనాలు ఒకేలా ఉన్నాయని టోంగ్‌ యిగాంగ్‌ తన పరిశోధనలో వెల్లడైందని తెలిపారు. 

Covid-19 Wuhan: కరోనా వైరస్ పుట్టుకపై తెరమీదకు కొత్త కోణం.. చైనా శాస్త్రవేత్త వింత వాదన ఏంటంటే..?
Corona Virus
Follow us
Surya Kala

| Edited By: Janardhan Veluru

Updated on: Apr 11, 2023 | 1:46 PM

మళ్ళీ కరోనా వైరస్ విజృంభిస్తూ భయాందోళనలు సృష్టించడం ప్రారంభించింది. ప్రజలు మరోసారి మాస్క్ లు ధరించి..  శానిటైజేషన్ చేసుకుంటూ అప్రమత్తమయ్యారు. ఇంతలో ఒక చైనా శాస్త్రవేత్త కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి కొత్త, సంచలనాత్మక సమాచారాన్ని పంచుకున్నారు. కోవిడ్-19 వైరస్ మొదట మనుషుల్లోనే పుట్టిందని ఈ చైనా శాస్త్రవేత్త పేర్కొన్నారు

క‌రోనా వైర‌స్ పుట్టుక‌కు సంబంధించి చైనా క‌నిపెట్టిన ఈ సైంటిఫిక్ క్లెయిమ్ సైంటిస్టుల్లో కొత్త ఆలోచనని క‌లిగించింది. ఈ కొత్త సిద్ధాంతం ఇప్పటివరకు చేసిన అన్ని ప్రయోగాలు, పరిశోధనలు.. దాని ఫలితాలను పూర్తిగా విరుద్ధంగా ఉండడం విశేషం. ఎందుకంటే ఇప్పటి వరకు కోవిడ్‌-19 వైరస్‌ జంతువుల నుంచి మనుషులకు సోకిందని విశ్వసిస్తున్నారు.

ఆ శాస్త్రవేత్త ఎవరంటే?  కోవిడ్‌-19 వైరస్‌ మనుషుల నుంచి జంతువులకు వ్యాపిస్తుందన్న సిద్ధాంతాన్ని అందించిన శాస్త్రవేత్త పేరు టోంగ్‌ యిగాంగ్‌. బీజింగ్‌ యూనివర్సిటీ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ ప్రొఫెసర్‌. వుహాన్‌లోని హువానాన్ సీఫుడ్ మార్కెట్ నుండి తీసిన వైరల్ శాంపిల్స్ , వైరస్ బాధితుల నమూనాలు ఒకేలా ఉన్నాయని టోంగ్‌ యిగాంగ్‌ తన పరిశోధనలో వెల్లడైందని తెలిపారు.

ఇవి కూడా చదవండి

శాస్త్రవేత్త చెప్పిన ప్రకారం కోవిడ్ -19 మానవుల నుంచి వ్యాపించిందని.. ఈ రకమైన అవకాశాలే ఎక్కువ ఉన్నాయని తెలిపారు. అనంతరం ఈ వైరస్ వుహాన్ మార్కెట్‌లో వ్యాపించింది.. ఒక అంటువ్యాధి రూపాన్ని తీసుకుందని వెల్లడించారు.

తన పరిశోధనలో భాగంగా జనవరి 2020 నుంచి మార్చి 2020 మధ్య మార్కెట్ నుండి శాస్త్రవేత్తలు 1,300 కంటే ఎక్కువ జంతువుల నమూనాలను తీసుకున్నారని టోంగ్ చెప్పారు. అనంతరం ఆ నమూనాలను పరీక్షించారు. కోవిడ్ -19 వైరస్ రకూన్ కుక్కల నుంచి పుట్టిందనే విషయం పూర్తిగా రుజువు కాలేదని టోంగ్ చెప్పారు.

వుహాన్ మార్కెట్‌లోకి వైరస్ ఎక్కడ నుండి వచ్చిందంటే:  ప్రారంభ రోజుల్లో డజన్ల కొద్దీ సోకిన వ్యక్తులు వుహాన్ మార్కెట్‌కు వెళ్లారని చైనా శాస్త్రవేత్త టోంగ్ పేర్కొన్నారు. ఈ మార్కెట్ గబ్బిలాలు, రక్కూన్ కుక్కలు, పాంగోలిన్ల తో పాటు ఇతర అన్యదేశ జంతువులను విక్రయిస్తారని.. అందుకనే ఇప్పుడు అపఖ్యాతి పాలైందని తెలిపారు. స్టాల్‌కు వెళ్లిన వ్యక్తుల నుంచి వైరస్‌ ఇక్కడి విక్రయదారులకు.. అనంతరం ఇతర వినియోగదారులకు వ్యాపించిందని తెలిపారు టోంగ్.

విశేషమేమిటంటే.. టోంగ్ తాజా వాదనను కొత్త సిద్ధాంతాన్ని ఇతర పరిశోధకులు వ్యతిరేకించడం లేదు. వ్యాధి సోకిన వ్యక్తులు వెట్ మార్కెట్ కు వెళ్లిఉండవచ్చు అని.. అక్కడ ఉన్న గుంపుకి ఈ వైరస్ వ్యాపించవచ్చని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు.

చైనా దాచిపెట్టిన విషయం ఏమిటంటే?  కోవిడ్-19 వైరస్ వ్యాప్తికి కారణమేమిటో అర్థం చేసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు, ప్రభుత్వాలు చాలా కాలంగా డేటా ఇవ్వమంటూ చైనా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి?  కొన్ని రోజుల క్రితం ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఈ సమస్యపై తగినంత డేటాను ఇవ్వడం లేదంటూ.. చైనాను మరోసారి మందలించింది. కరోనా వైరస్ కు సంబంధించిన డేటా ఉంటే దానిని పంచుకోవాలని WHO తెలిపింది.

వివాదాస్పదమైన వైరస్ వ్యాప్తి  కరోనా వైరస్ ఎక్కడ నుండి వచ్చిందనేది ఇప్పటికీ వివాదాస్పద అంశం. చైనా ప్రభుత్వం చెబుతున్న విషయంపై US ప్రభుత్వ సంస్థల మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ఈ వైరస్ జంతువుల నుంచి మనుషులకు వచ్చిందని కొందరు చెబుతుండగా, వుహాన్ ల్యాబొరేటరీ నుంచి ఈ వైరస్ లీక్ అయి ఉంటుందని మరికొందరు చెబుతున్నారు. అయితే ఇప్పుడు సరికొత్తగా ప్రొ.టోంగ్ తన పరిశోధనలో ఈ మనిషి నుంచి జంతువులకు సోకింది అని చెబుతున్నారు..

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..