నేమింగ్ యువర్ లిటిల్ గ్రీక్ అనే పుస్తక రచయిత స్కాట్ రూబిన్ మాట్లాడుతూ.. కూతురు, కొడుకు అనే తేడా లేదంటూ ఓ సంస్కృతి ప్రపంచ వ్యాప్తంగా ఓ ప్రచారంలా సాగుతోంది. ఈ సంస్కృతిలో పిల్లల మధ్య తేడా లేదు.. ధరించే దుస్తులపై ఎటువంటి పరిమితి విధించబడదు. ఈ సంస్కృతిని అనుసరించే తల్లిదండ్రులు తమ పిల్లలు ఏమి చేయాలో వారు బలవంతం చేయరు. అబ్బాయిలు, అమ్మాయిలు ఆడుకునే బొమ్మల నుంచి , ధరించే దుస్తులనుంచి ఏ విధమైన రెస్టిక్షన్స్‌ను పెట్టరు.