Sri Lanka: చైనా ఏర్పాటు చేసిన విద్యుత్ ప్లాంట్ నుంచి విషపూరిత ఆమ్లాలు.. మహా బోధి వృక్షంపై తీవ్ర ప్రభావం

ఈ వృక్షానికి నష్టం కలగడం మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.. ఇప్పటికే చెట్టుపై వాతావరణ కాలుష్య లక్షణాలు కనిపిస్తున్నాయని.. ఇందుకు సంబంధించిన ఆధారాలున్నాయని వెల్లడించింది. భారతదేశంలోని గయలోని పవిత్రమైన బోధి వృక్షం కొమ్మ నుంచి పెరిగిన శ్రీ మహాబోధి చెట్టును  భౌద్ధులు సందర్శించి పూజిస్తారు. ముఖ్యంగా ఈ చెట్టు బౌద్ధు మతంలో అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉంది.

Sri Lanka: చైనా ఏర్పాటు చేసిన విద్యుత్ ప్లాంట్ నుంచి విషపూరిత ఆమ్లాలు.. మహా బోధి వృక్షంపై తీవ్ర ప్రభావం
Holy Maha Bodhi Tree
Follow us

|

Updated on: Apr 09, 2023 | 3:45 PM

శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేతో జరిగిన సమావేశంలో శ్రీలంకలోని హంబన్‌టోటాలో పెట్టుబడులు పెట్టేందుకు చైనాకు చెందిన సినోపెక్ కట్టుబడి ఉందని శ్రీలంక అధ్యక్షుడి మీడియా విభాగం తెలిపింది. శ్రీలంకలోని ఓడరేవులు, ఇంధన రంగంలో తన పెట్టుబడులను ఏకీకృతం చేయడానికి చైనా ప్రయత్నిస్తూ ఈ నిర్ణయం తీసుకునంట్లు వెల్లడించింది. గత ప్రభుత్వం చైనా నిర్మించిన USD 1.5 బిలియన్ల హంబన్‌ తోట నౌకాశ్రయాన్ని 99 సంవత్సరాల లీజుకు ఇచ్చింది. ఓడరేవు చుట్టూ 15,000 ఎకరాల విస్తీర్ణంలో పారిశ్రామిక జోన్‌ను ఏర్పాటు చేస్తామని చైనా వాగ్దానం చేసింది. అది ఇంకా కార్యరూపం దాల్చలేదని వార్తా నివేదికలో పేర్కొంది. మార్చి 13న సినోపెక్ గ్రూప్ ప్రతినిధులు, విక్రమసింఘే మధ్య సమావేశం జరిగినట్లు శ్రీలంక అధ్యక్షుడి మీడియా విభాగం తెలిపింది.

అయితే శ్రీలంకకు చైనా ప్రభుత్వం బిలియన్ల డాలర్ల విలువైన పెట్టుబడులు పెట్టడంపై ఆందోళన వ్యక్తం అయ్యాయి. హంబన్‌టోటాలో సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసే అవకాశం గురించి మన దేశం ఆందోళన లేవనెత్తిన సంగతి తెలిసిందే.

PMD ఒక ప్రకటనలో, “ఇంధన పంపిణీని విస్తరించడానికి ప్రభుత్వం సూత్రప్రాయ నిర్ణయం తీసుకుందని అధ్యక్షుడు రానిల్ విక్రమసింఘే చెప్పారు. హంబన్‌తోట ప్రాథమిక ఇంధన కేంద్రంగా గుర్తించబడింది” అని కొలంబో గెజిట్ నివేదించింది. అంతేకాదు  హంబన్‌తోటలో రిఫైనరీలో పెట్టుబడులు పెట్టేందుకు సినోపెక్ కూడా కట్టుబడి ఉందని పేర్కొంది.

ఇవి కూడా చదవండి

లక్విజయ(నోర్చోలై) పవర్ ప్లాంట్ నుండి వెలువడే ఉద్గారాలు ఇప్పటికే పర్యావరణంపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయని వెల్లడించింది. శ్రీలంకలో పవిత్రమైన శ్రీ మహాబోధి వృక్షం ఉన్న అనురాధపురలో ప్రమాదకరమైన యాసిడ్ నిక్షేపాలను వెదజల్లే మేఘాల కదలికలు ఏర్పడుతున్నాయని పర్యావరణ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. వార్తా నివేదిక ప్రకారం.. ఇప్పటికే ఈ వృక్షానికి నష్టం కలగడం మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.. ఇప్పటికే చెట్టుపై వాతావరణ కాలుష్య లక్షణాలు కనిపిస్తున్నాయని.. ఇందుకు సంబంధించిన ఆధారాలున్నాయని వెల్లడించింది. భారతదేశంలోని గయలోని పవిత్రమైన బోధి వృక్షం కొమ్మ నుంచి పెరిగిన శ్రీ మహాబోధి చెట్టును  భౌద్ధులు సందర్శించి పూజిస్తారు. ముఖ్యంగా ఈ చెట్టు బౌద్ధు మతంలో అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉంది.

పవర్ ప్లాంట్ నుంచి వెలువడే వాయువుల కారణంగా పొడవైన చెట్ల ఆకులు పసుపు రంగులోకి మారడం ప్రారంభించాయి. విషపూరిత ఉద్గారాల ప్రభావం శ్రీ మహాబోధి వృక్షంపై కూడా పడుతుందని అంచనా వేశారు. అంతేకాకుండా ఈ కాలుష్య వాయువులు సముద్ర ప్రాంతాల వైపు కూడా విస్తరిస్తున్నాయని తెలిపారు. భవిష్యత్తులో ఇటువంటి హానికరమైన బొగ్గు విద్యుత్ కేంద్రాలను పునర్నిర్మించడం పర్యావరణ వ్యవస్థకు ముప్పుగా పరిణమిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే నొరొచ్చోలై పవర్‌ ప్లాంట్‌ పరిసర ప్రాంతాల్లోని పలువురు చిన్నారులు చర్మవ్యాధుల బారిన పడ్డారని సమాచారం

నోర్చోలై శ్రీలంకలో అతిపెద్ద థర్మల్ పవర్ ప్లాంట్. ఈ  బొగ్గు పవర్ ప్లాంట్ నుండి విడుదలయ్యే ఉద్గారాలు అత్యంత ప్రమాదకరంగా మారనున్నాయని హెచ్చరించారు. పవర్ ప్లాంట్ నుంచి వేడి నీటిని విడుదల చేయడం వల్ల భారీగా వ్యర్థాలు, వేడి వ్యర్థాలు, నీటి కాలుష్యం ఏర్పడుతుంది. ఈ వ్యర్ధాలు దీర్ఘకాలిక పర్యావరణంపై ప్రభావం చూపిస్తాయని పేర్కొన్నారు.

శ్రీలంక యొక్క మొట్టమొదటి బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్లాంట్. అతిపెద్ద పవర్ స్టేషన్..  EXIM బ్యాంక్ ఆఫ్ చైనా సహాయంతో సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ జాయింట్ వెంచర్‌గా ఏర్పాటు చేశారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..