- Telugu News Photo Gallery World photos deadly storms and tornadoes sweep through central us arkansas
Storms In US: అమెరికాలో హరికేన్ ,సుడిగాలి విధ్వంసం.. 25మంది మృతి, 2వేలకు పైగా ఇళ్లు ధ్వంసం
గత నెలలో అమెరికా నేషనల్ వెదర్ సర్వీస్ అనేక ఇతర రాష్ట్రాలకు సుడిగాలి హెచ్చరికలు జారీ చేసింది. కొద్ది రోజుల క్రితం మిస్సిస్సిప్పిలో టోర్నడో, హరికేన్ కారణంగా 25 మంది చనిపోయారు.
Updated on: Apr 02, 2023 | 12:45 PM

తుఫానులు, టోర్నడోలు అమెరికాలో భయంకరమైన విధ్వంసం సృష్టించాయి. ఈ తుఫాను, టోర్నడో కారణంగా ఇప్పటివరకు వివిధ ప్రాంతాల్లో 25 మంది మరణించారు. అనేక మంది గాయపడినట్లు సమాచారం.

తుఫాను , టోర్నడో కారణంగా 2000 కంటే ఎక్కువ ఇళ్లు ధ్వంసమయ్యాయి. అర్కాన్సాస్, టెన్నెస్సీ, ఇండియానా, ఇల్లినాయిస్, టెక్సాస్‌లలో ఎక్కువ నష్టం నమోదైంది. ఈ విధ్వంసకర టోర్నడో కారణంగా 2 లక్షల ఇళ్లలో విద్యుత్ నిలిచిపోయిందని పేర్కొంది.

చాలా ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితి నెలకొంది. రాజధాని లిటిల్ రాక్‌తో సహా అర్కాన్సాస్‌లో అనేక సుడిగాలులు సంభవించడంతో ఐదుగురు మరణించారు. డజన్ల కొద్దీ గాయపడ్డారని అర్కాన్సాస్ గవర్నర్ చెప్పారు.

అర్కాన్సాస్‌లో దాదాపు 90,000 ఇళ్లల్లో విద్యుత్ నిలిచిపోయింది. గవర్నర్ సారా హక్బీ శాండర్స్ రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అదే సమయంలో.. బాధిత ప్రాంతాల్లో బాధితుల సహాయం కోసం నేషనల్ గార్డ్ రంగంలోకి దిగింది.

ఈ తుఫాను, సుడిగాలి సృష్టించిన విధ్వసం కారణంగా మరణించిన వారిలో ఆర్కాన్సాస్‌లోని విన్ అనే చిన్న పట్టణానికి చెందిన 4 మంది ఉన్నారు. అంతేకాదు లిటిల్ రాక్, ఇల్లినాయిస్, ఇండియానా , అలబామాలో ఇతర ప్రాంతాల్లో మరణాలు నమోదయ్యాయి.
