- Telugu News Photo Gallery World photos Mummy Returns: why mummy roadshow could pose health risks to public mexican scientists alerts
Mummy Returns: మెక్సికోలో ఫెయిర్ టూర్.. 200 ఏళ్ల మమ్మీ ప్రదర్శన.. ప్రజలకు శాపం అంటూ శాస్త్రజ్ఞుల ఆందోళన
మెక్సికోలో జరిగిన ఫెయిర్ టూర్ 1800లలో నిల్వ చేయబడిన మమ్మీ గురించి చర్చిస్తుంది. దీని గురించి నిపుణులు వ్యక్తం చేసిన ప్రమాదం ఏమిటో తెలుసుకోండి.
Updated on: Apr 02, 2023 | 11:47 AM

మెక్సికో సిటీ ఫెయిర్‌లో ఉంచిన మమ్మీపై శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. నగరంలో నిర్వహిస్తున్న టూరిజం ఫెయిర్‌లో అనేక మమ్మీలను ఉంచారు. అయితే శాస్త్రవేత్తల ఆందోళనకు కారణం ఆ మమ్మీ 1800కి చెందిన మమ్మీ. ఆ మమ్మీని భద్రపరిచిన గ్లాస్ కేస్ పూర్తిగా ఎయిర్ టైట్ గా ఉందా లేదా అనేది ఇప్పటి వరకు స్పష్టంగా తెలియలేదు. దీంతో శాస్త్రవేత్తల్లో ఆందోళన మొదలైంది. అసలు శాస్త్రవేత్తల్లో ఎందుకు భయపడుతున్నారో తెలుసుకోండి.

మెక్సికో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆంత్రోపాలజీ అండ్ హిస్టరీ ప్రకారం.. ఇక్కడ భద్రపరచబడిన మమ్మీలన్నింటికీ వెంట్రుకలు ఉంటాయి. వందేళ్ల కిందట ధరించిన దుస్తులతోనే మమ్మీలను భద్రపరిచారు. వీటిలో శిలీంధ్రాలు పెరిగిన అటువంటి ఒక మమ్మీ ఉంది. అయితే ఈ మమ్మీలలో కొన్ని కలరా మహమ్మారిని వ్యాపించే గుణాలను కలిగి ఉన్నాయని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

అటువంటి ఈ మమ్మీలను సామాన్యులు చూసేలా ప్రదర్శనకు ఉంచడం అనే నిర్ణయం మెక్సికో ప్రభుత్వంది. అయినప్పటికీ ఈ ప్రదర్శన ఆందోళన కలిగిస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రదర్శనలో ఉంచిన మమ్మీలో ఫంగస్ కనిపిస్తుందని తెలిపారు.

ఈ ప్రదర్శన కోసం వచ్చే ప్రజలకు అంటువ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. అయితే మమ్మీలో ఎలాంటి ఫంగస్ కనిపిస్తుందో నిపుణులు ఇంకా చెప్పలేదు.

మమ్మీ సహజంగా భద్రపరచబడిందని నిపుణులు అంటున్నారు. మమ్మీని భద్రపరిచిన నేల సహజమైనది. చాలా రకాల మినరల్స్ కనిపించాయని.. మమ్మీలను సురక్షితంగా సీల్ చేశారని.. అవి సురక్షితమని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మమ్మీలు ఎలా భద్రపరచబడ్డాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Daiy Mail నివేదిక ప్రకారం.. ఇప్పటివరకు 4000 మందికి పైగా మమ్మీని చూడటానికి వచ్చారు. ఈ ఫెయిర్ లో 100కు పైగా మమ్మీలను ఉంచారు. మెక్సికోలో మమ్మీని చూడటం శుభప్రదంగా భావిస్తారు. వీటిని చూస్తే స్వర్గానికి చేరుకుంటామని నమ్మకం. అయితే మమ్మీలో ఫంగస్ పెరిగిన తర్వాత.. ఈ మమ్మీ వలన ఎటువంటి అనారోగ్యం లేదా వ్యాధికి కారణం కాకూడదని అంటున్నారు.
