Chat GPT: చాట్ జీపీటీ సమాధానాల్లో హేతుబద్ధ తక్కువేనంటున్న పరిశోధకులు
కృత్రిమ మేధతో పనిచేసే చాట్ జీపీటీకి ఇటీవల అత్యంత జనాధారణ పొందిందన్న విషయం తెలిసిందే. అయితే ఏఐ తో పనిచేసే చాట్ జీపీటీ, బీఈఆర్టీ లాంచి తదితర అప్లికేష్లన్లు ఇచ్చే సమాధానాలు హేతుబద్ధమైనవి కావని, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యంలో పరిమితులున్నాయని ఓ పరిశోధన వెల్లడించింది.
కృత్రిమ మేధతో పనిచేసే చాట్ జీపీటీకి ఇటీవల అత్యంత జనాధారణ పొందిందన్న విషయం తెలిసిందే. అయితే ఏఐ తో పనిచేసే చాట్ జీపీటీ, బీఈఆర్టీ లాంచి తదితర అప్లికేష్లన్లు ఇచ్చే సమాధానాలు హేతుబద్ధమైనవి కావని, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యంలో పరిమితులున్నాయని ఓ పరిశోధన వెల్లడించింది. అయితే వీటిని సరైన సమాధానాలు ఇచ్చేలా రూపొందించినప్పటికీ ఎక్కువ ప్రత్యామ్నాయాలు ఉంచి ఏ నిర్ణయం తీసుకోవాలని అడిగితే అవి ఇచ్చే సమాధానాలు హేతుబద్ధంగా లేవని యూనివర్శిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాలో ప్రొఫెసర్ మయాంక్ అగర్వాల్ చేసిన అధ్యయనం తెలిపింది.
నాణెం ఎగరేసినప్పుడు బొమ్మ పడితే డైమండ్ గెలుస్తావు, బొరుసు పడితే కారు కోల్పోతావు.. ఈ రెండిట్లో నువ్వు దేన్ని కోరుకుంటావు అనే ప్రశ్నను అడగగా తప్పుడు ఎంపిక అయిన బొరుసునే ఏఐ అప్లికేషన్లు సగం కంటే ఎక్కవ సార్లు కోరుకున్నాయని పరిశోధకులు తెలిపారు. దీన్ని బట్టి చూస్తే ఇలాంటి అప్లికేషన్లు హేతుబద్ధతను మరింత సంతరించుకునే వరకు వీటిని వినియోగించకపోవడమే మంచిదని పేర్కొన్నారు. ఇవి ఇచ్చే సమాచారాన్ని సమీక్షించి, సరిచేసుకుని వినియోగించాలని సూచించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..