Health: ఉన్నట్టుండి గొంతు నొప్పిగా ఉందా? కళ్లల్లో పుసులు కనిపిస్తున్నాయా?.. అయితే అదే
భారత్‌లో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. ఇండియాను శరవేగంగా కమ్మేస్తున్న XXB వేరియంట్ దొరికినోడిని దొరికినట్టు కాటేస్తోంది. కొత్త వేరియంట్ దెబ్బకు డైలీ ఆరేడు వేలమంది ఆస్పత్రి బెడ్ ఎక్కుతున్నారు. ఈ రేంజ్‌లో కేసులు నమోదవడం 2హండ్రెడ్ డేస్ తర్వాత ఇదే ఫస్ట్ టైమ్ అంటున్నారు ఎక్స్‌పర్ట్స్.
ఉన్నట్టుండి గొంతు నొప్పిగా ఉందా?.. జర్వం-ఒళ్లు నొప్పులతో వీకయ్యారా? దగ్గు-జలుబుతో ఇబ్బంది పడుతున్నారా? అయితే, బీకేర్‌ఫుల్. కాస్త తేడాగా అనిపించినా ఆలోచించాల్సిందే. ఎందుకంటే, కరోనా మళ్లీ చాపకింద నీరులా విజృంభిస్తోంది. కొన్నాళ్లుగా కరోనా కేసులు అమాంతం పెరిగిపోతున్నాయ్. ప్రతిరోజూ కనీసం ఐదారు వేలమంది మహమ్మారి బారినపడుతున్నారు. అదే టైమ్‌లో మరణాలు కూడా నమోదవుతుండటం కలవరపెడుతోది. ప్రస్తుతం దేశంలో కరోనా పాజిటివిటీ రేటు ఐదుశాతం దాటింది. ఇది కచ్చితంగా ఆందోళన కలిగించే నెంబరే. అందుకే, స్టేట్స్‌ను అలర్ట్ చేసింది కేంద్రం. సైలైంట్‌గా విజృంభిస్తోన్న కరోనా వైరస్‌పై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కేసులు ఎక్కువగా నమోదవుతోన్న ఎమర్జెన్సీ హాట్ స్పాట్స్‌ను గుర్తించి వైరస్ కట్టడికి చర్యలు తీసుకోవాలని గైడ్‌లైన్స్ ఇష్యూ చేసింది. కేంద్రారోగ్యశాఖ లెక్కల ప్రకారం గత 24గంటల్లో 6వేల 155మంది వైరస్ బారినపడగా, 11మంది ప్రాణాలు కోల్పోయారు.
దేశంలో కరోనా విజృంభణకు ఎక్స్‌బీబీ 1.16 వేరియంటే కారణమంటున్నారు ఎక్స్‌పర్ట్స్. కంట్రీవైడ్‌గా ఈ వేరియంట్ కేసులే ఎక్కువగా నమోదవుతున్నట్టు లెక్కలు చెబుతున్నాయ్. ఓల్డ్ వేరియంట్స్‌తో పోలిస్తే ఇది యమ స్పీడ్‌గా స్ప్రెడ్ అవుతోందని చెబుతున్నారు నిపుణులు. రెండ్రోజులుగా డైలీ 6వేలకు పైగా కేసులు నమోదు కావడం, యాక్టివ్ కేసుల సంఖ్య 31వేలు దాటడమే అందుకు రుజువంటున్నారు. వైరస్‌ను లైట్ తీస్కోవద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. పిల్లల్ని ఎక్కువగా టార్గెట్ చేస్తోంది XXB వేరియంట్. పిల్లలు ఎవరికైనా కళ్లు దురద పెడుతున్నాయ్ అన్నారంటే అది కచ్చితంగా కరోనా లక్షణమే కావొచ్చు. అంతేకాదు, కళ్లల్లో పుసులు కనిపించినా అనుమానించాల్సిందే అంటున్నారు నిపుణులు. ఇంతకుముందు కరోనా లక్షణాల్లో ఇది లేవని, కానీ న్యూ వేరియంట్స్‌లో ఇవే ఎక్కువగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. వీటితోపాటు హైఫీవర్, దగ్గు జలుబూ ఉన్నాయంటే నిర్లక్ష్యం చేయొద్దంటున్నారు వైద్యులు.
XBB.1.16 #Arcturus
For the last 2 days, have started getting pediatric Covid cases once again after a gap of 6 mo! An infantile phenotype seems emerging—treated infants w/ high fever, cold & cough, & non-purulent, itchy conjunctivitis w/ sticky eyes, not seen in earlier waves pic.twitter.com/UTVgrCCLWU
— Vipin M. Vashishtha (@vipintukur) April 6, 2023
ఎక్స్‌పర్ట్స్ హెచ్చరికలు ఎలాగున్నా, కొత్త వేరియంట్స్ కేసులు పెరుగుతున్నాయనేది నిజం. కరోనా మహమ్మారి నుంచి తప్పించుకోవాలంటే జాగ్రత్తలు ఒక్కటే శరణ్యం. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడమే మార్గం. లేదంటే, నిర్లక్ష్యానికి భారీ మూల్యం తప్పదు. అందుకే, బీ కేర్ ఫుల్ ఆల్.