Liver Health: లివర్ జర భద్రం గురూ.. కాలేయం బాగుండాలంటే ఈ 6 పదార్థాలు తినడం మానుకోండి..
భారతదేశంలో కాలేయ వ్యాధి నిరంతరం పెరుగుతోంది. భారతదేశంలో ప్రతి సంవత్సరం దాదాపు పది లక్షల మంది లివర్ సమస్యల బారిన పడుతున్నారు. శరీరంలో ముఖ్యమైన అవయవాలలో కాలేయం ఒకటి..

భారతదేశంలో కాలేయ వ్యాధి నిరంతరం పెరుగుతోంది. భారతదేశంలో ప్రతి సంవత్సరం దాదాపు పది లక్షల మంది లివర్ సమస్యల బారిన పడుతున్నారు. శరీరంలో ముఖ్యమైన అవయవాలలో కాలేయం ఒకటి.. దీనిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవడం ముఖ్యం. మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో, మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో కాలేయం సహాయపడుతుంది. అందుకే కాలేయ ఆరోగ్యంపై దృష్టిపెట్టాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. లివర్ పని నెమ్మదిస్తే.. అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. ముఖ్యంగా తినే ఆహారం,
జీవనశైలి లివర్ పై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా కొన్ని పదార్థాలు లివర్ పనిని నెమ్మదించేలా చేస్తాయి. కావున కొన్ని ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది. కాలేయాన్ని అకాల వృద్ధాప్యం బారిన పడేసే ఆహారాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.. లివర్ పని నెమ్మదిస్తే.. మొదటఈ 6 ఆహారాలను వెంటనే ఆపాలంటున్నారు.
కొన్ని ఆహారాలు మానవ కాలేయానికి హాని కలిగిస్తాయి. అందుకే వాటికి దూరంగా ఉండాలని ఎప్పుడూ సలహా ఇస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఆ 6 ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి..




ఈ ఆహారాలు కాలేయానికి మంచిది కాదు..
- ఆల్కహాల్: ఆల్కహాల్ వల్ల ఫ్యాటీ లివర్ అలాగే లివర్ సంబంధిత వ్యాధులకు కారణం కావచ్చు. అందుకే మద్యానికి దూరంగా ఉండండి.
- రెడ్ మీట్: బీఫ్‌లో సంతృప్త కొవ్వు అధికంగా ఉంటుంది. ఇది మీ కాలేయాన్ని దెబ్బతీస్తుంది. అందుకే దీనికి దూరంగా ఉండాలి.
- ఉప్పు: ఉప్పు ఎక్కువగా తినడం వల్ల కాలేయం దెబ్బతింటుంది. ఉప్పులో సోడియం ఉంటుంది. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో అదనపు నీరు పేరుకుపోతుంది. దీని వల్ల కాలేయంలో మంట వచ్చే ప్రమాదం ఉంది. ఫ్యాటీ లివర్, లివర్ సిర్రోసిస్ విషయంలో ఉప్పుకు దూరంగా ఉండటానికి ఇదే కారణం.
- ప్రాసెస్ చేసిన ఆహారం: ప్రాసెస్ చేసిన ఆహారం లేదా ప్యాక్ చేసిన వస్తువులు, ముఖ్యంగా బ్రెడ్, పిజ్జా, పాస్తా వంటి ఆహారపదార్థాలు కాలేయానికి చాలా హానికరం. ఈ ఆహార పదార్థాలు కాలేయంలో కొవ్వును పెంచడానికి, కొవ్వు కాలేయ ప్రమాదాన్ని పెంచడానికి పని చేస్తాయి.
- పిండి: కాలేయం పరంగా పిండి మంచిది కాదు. అందుకే పిండితో చేసినవి ఎక్కువగా తినకూడదు. గోధుమ నుంచి మైదా పిండిని తయారు చేస్తున్నప్పుడు, దాని నుండి ప్రోటీన్ సంగ్రహించబడుతుంది. దాని కారణంగా అది ఆమ్లంగా మారుతుంది. అటువంటి పరిస్థితిలో తెల్ల పిండితో చేసిన వాటిని ఎక్కువగా తినడం.. కాలేయంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. అదే సమయంలో, వేయించిన వాటిని తినడం కూడా మానుకోవాలి.
- షుగర్: స్వీట్ తినేవాళ్లు కాలేయం ఆరోగ్యం కోసం క్యాండీ, కేక్, కుకీస్, ప్రాసెస్డ్ ఫ్రూట్ జ్యూస్ వంటి వాటిని తినకూడదు. చక్కెరలోని ఫ్రక్టోజ్ కారణంగా కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. అంటే, అధిక చక్కెర ఆహారాల వల్ల, కాలేయం కొవ్వుగా మారడం ప్రారంభమవుతుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం..