Can Diabetics Eat Mangoes: మధుమేహ వ్యాధిగ్రస్తులు మామిడి పండ్లు తినొచ్చా..? తినకూడదా..?

మధుమేహ వ్యాధిగ్రస్తుల డైట్‌ విషయంలో ఎప్పుడూ సందిగ్ధతకు లోనవుతుంటారు. ఏది తినాలి? ఏది తినకూడదు అనే క్లారిటీ ఉండదు. సీజనల్ పండ్ల విషయంలో ఈ సందిగ్ధం మరింత ఎక్కువగా ఉంటుంది. ఇక వేసవిలో నోరూరించే మామిడి పండ్లు ఎవరైనా తినకుండా ఉండగలరా..? షుగర్ పేషెంట్లు మామిడిపండు..

Can Diabetics Eat Mangoes: మధుమేహ వ్యాధిగ్రస్తులు మామిడి పండ్లు తినొచ్చా..? తినకూడదా..?
Can Diabetics Eat Mangoes
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 09, 2023 | 9:31 AM

మధుమేహ వ్యాధిగ్రస్తుల డైట్‌ విషయంలో ఎప్పుడూ సందిగ్ధతకు లోనవుతుంటారు. ఏది తినాలి? ఏది తినకూడదు అనే క్లారిటీ ఉండదు. సీజనల్ పండ్ల విషయంలో ఈ సందిగ్ధం మరింత ఎక్కువగా ఉంటుంది. ఇక వేసవిలో నోరూరించే మామిడి పండ్లు ఎవరైనా తినకుండా ఉండగలరా..? షుగర్ పేషెంట్లు మామిడిపండు తినొచ్చా.. లేదా అనే సందేహం వెంటాడుతూనే ఉంటుంది. కారణం మామిడి పండ్లు రుచికి తియ్యగా ఉండటమే.

న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ ప్రకారం.. 100 గ్రాముల మామిడి పండులో 15 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. అంటే ఈ పండ్లు తింటే రక్తంలో చక్కెర పెరిగే అవకాశం ఉంది. అలాగని మరీ మడికట్టుకుని కోర్చోనవరసరం లేదని, మితంగా తినొచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మామిడి పండ్లను మితంగా తినవచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులు మామిడికాయ ముక్కలు ఒకటి లేదా రెండు తినడం మంచిదేనని అంటున్నారు.ఐతే మామిడి పండ్లను తినే విధానంలో కొన్ని మార్పులు చేర్పులు అవసరం. ఆ విధంగా తింటేనే మామిడిలో ఉండే ఫైబర్ చక్కెరను స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. అంటే మామిడి పండ్లను తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులోనే ఉంటాయన్నమాట. మామిడిలో అధికంగా పోషక విలువలు, తక్కువ గ్లైసెమిక్ స్థాయిలు ఉంటాయి.

ఇవి కూడా చదవండి

మధుమేహ వ్యాధిగ్రస్తులు మామిడి పండ్లను ఎలా తినాలంటే..

  • డయాబెటిక్ వ్యాధిగ్రస్తులు పూర్తిగా పండిన మామిడితో పోలిస్తే పండని మామిడి కాయలు తినడం మంచిది. ఎందుకంటే పండని మామిడిలో చక్కెర తక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచదు.
  • మామిడితో పాటు పెరుగు, పనీర్ లేదా చేప వంటి ప్రోటీన్ ఆహారాలను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
  • మామిడిపండు జ్యూస్‌లో చక్కెర కలిపి తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అందువల్ల మామిడి కాయ జ్యూస్‌ తాగితే, అందులో చక్కెర కలపకూడదు.
  • మామిడికాయను తొక్కతోపాటు తినాలి.
  • ఉదయం పూట వాకింగ్‌ చేసిన తర్వాత మధుమేహ వ్యాధిగ్రస్తులు మామిడి పండ్లను తినడానికి ఉత్తమ సమయంగా ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంటే ఉదయం కాల వ్యాయామం తర్వాత మధ్యాహ్న భోజనం మధ్య తినాలన్నమాట. ఆ సమయంలో రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఐతే డయాబెటిక్ వ్యాధిగ్రస్తులు మాత్రం మామిడి పండ్లను తినేముందు తప్పనిసరిగా వైద్యులను సంప్రదించి, వారి సూచనల మేరకు తినడం ఉత్తమం.

మరిన్ని ఆరోగ్య సమాచారం కోసం క్లిక్‌ చేయండి.