Thief Returns Stolen Money: దొంగల్లో ఆణిముత్యం.. చోరీ చేసిన సొమ్మును తిరిగి తెచ్చి పెట్టేశాడు

నిత్యం దొంగలు వివిధ వేశాల్లో భద్రంగా దాచుకొన్న సొమ్ము కొల్లగొడుతుంటారు. ఆనక వెనక్కి తిరిగి చూడకుండా ఉడాయిస్తారు. పొరబాటున ఎవరైనా అడ్డుకుంటే వారిని గాయపరచడమో.. అవసరమైతే ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడరు. అలాంటిది ఓ దొంగ మూడో కంటికి తెలియకుండా ఓ ఇంటికి కన్నం వేసి..

Thief Returns Stolen Money: దొంగల్లో ఆణిముత్యం.. చోరీ చేసిన సొమ్మును తిరిగి తెచ్చి పెట్టేశాడు
Thief Returns Stolen Money
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 07, 2023 | 10:50 AM

నిత్యం దొంగలు వివిధ వేశాల్లో భద్రంగా దాచుకొన్న సొమ్ము కొల్లగొడుతుంటారు. ఆనక వెనక్కి తిరిగి చూడకుండా ఉడాయిస్తారు. పొరబాటున ఎవరైనా అడ్డుకుంటే వారిని గాయపరచడమో.. అవసరమైతే ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడరు. అలాంటిది ఓ దొంగ మూడో కంటికి తెలియకుండా ఓ ఇంటికి కన్నం వేసి డబ్బు ఎత్తుకెళ్లాడు. ఏం జరిగిందో తెలీదు గానీ ఆ మరుసరి రోజు కిమ్మనకుండా ఎత్తుకెళ్లిన సొత్తును తిరిగి అదే ఇంట్లో వదిలేశాడు. చత్తీస్‌ఘడ్‌లో చోటుచేసుకున్న ఈ వింత ఘటన ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది టైన్‌గా మారింది. వివరాల్లోకెళ్తే..

ఛత్తీస్ గఢ్ రాష్ట్రం బిల్హా ప్రాంతంలోని శోభరామ్ కోష్లే అనే వ్యక్తి గ్రామంలోని తన భూమిని రోహిత్ యాదవ్ అనే వ్యక్తికి విక్రయించాడు. ఈ భూమిని మార్చి 27న రిజిస్ట్రేషన్ చేశారు. భూమిని విక్రయించగా వచ్చిన రూ. 95 వేల నగదును శోభారామ్ తన ఇంట్లో దాచాడు. ఐతే ఆ మరుసటి రోజే శోభారం దాచిన డబ్బు బాక్స్‌తో సహా చోరీకి గురైంది. దీంతో శోభరామ్ ఏప్రిల్ 1న బిల్హా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఇది జరిగిన తర్వాత రోజే పోలీసులకు, శోభరామ్‌కు షాక్ కలిగించే సంఘటన జరిగింది. దొంగిలించిన డబ్బు బాక్సు ఇంటి ఆవరణలో శోభరామ్‌ గుర్తించాడు. బాక్సులో దాచిన రూ.95 వేలలో ఒక్క రూపాయికూడా తక్కువకాకుండా అలాగే ఉన్నాయి. అయితే దొంగ ఇలా ఎందుకు చేశాడనే విషయం మాత్రం ఎవ్వరికీ తెలియరాలేదు. పోలీసులు పట్టుకుంటారనే భయంతోనే దొంగ ఇలా చేసి ఉంటాడని

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.