Jibin Madhu: రూ.5 వేలతో బైక్‌పైనే రెండు దేశాలు చుట్టేసిన కేరళ యువకుడు. త్వరలో థాయ్‌ల్యాండ్‌కు పయనం

కొట్టాయంలోని పాలా ప్రాంతానికి చెందిన జిబిన్‌కు ఎప్పటి నుంచో దేశవ్యాప్తంగా పర్యటించాలనే కోరిక ఉండేది. కానీ అతని వద్ద అందుకు అవసరమైన డబ్బు లేదు. అయినా అతను పట్టు వదల్లేదు. 2021 ఏప్రిల్‌ 1న తన దేశసంచారానికి నాంది పలికాడు. ఒంటరిగానే ఇంట్లో నుంచి బయల్దేరారు.

Jibin Madhu: రూ.5 వేలతో బైక్‌పైనే రెండు దేశాలు చుట్టేసిన కేరళ యువకుడు. త్వరలో థాయ్‌ల్యాండ్‌కు పయనం
Jibin Madhu
Follow us

|

Updated on: Apr 07, 2023 | 10:42 AM

ప్రపంచమంతా చుట్టేయాలని ఎవరికుండదు చెప్పండి. ప్రతి ఒక్కరూ వివిధ రాష్ట్రాలు, దేశాలు పర్యటించాలనుకుంటారు. కానీ అందరికీ వీలు కాదు. ఆర్ధిక పరిస్థితులు, ఆరోగ్యం ఇలా ఎన్నో కారణాలు ఉంటాయి. కేరళకు చెందిన ఓ యువకుడు తన కళను చాలా తెలివిగా సాకారం చేసుకున్నాడు. జిబిన్‌ మధు అనే యువకుడు బైక్‌పైన ఒంటరిగా ప్రయాణిస్తూ ఏకంగా రెండు దేశాలను పర్యటించాడు. కేవలం 5 వేల రూపాలయతో ప్రారంభమైన తన ప్రయాణం ఎలా సాగిందంటే..

కొట్టాయంలోని పాలా ప్రాంతానికి చెందిన జిబిన్‌కు ఎప్పటి నుంచో దేశవ్యాప్తంగా పర్యటించాలనే కోరిక ఉండేది. కానీ అతని వద్ద అందుకు అవసరమైన డబ్బు లేదు. అయినా అతను పట్టు వదల్లేదు. 2021 ఏప్రిల్‌ 1న తన దేశసంచారానికి నాంది పలికాడు. ఒంటరిగానే ఇంట్లో నుంచి బయల్దేరారు. ఆ సమయంలో జిబిన్‌వద్ద రూ.5 వేలే ఉన్నాయి. జిబిన్‌ 10 రాష్ట్రాలు మీదుగా రెండు దేశాలు పర్యటించారు. తన పర్యటనలో తనకు అవసరమైన ధనం సమకూర్చుకోడానికి ఒక్కో ప్రాంతంలో ఒక్కో పని చేసేవారు. ఒక్కోసారి పని దొరకడం కష్టమయ్యేది. దాంతో అతని మదిలో ఓ చక్కని ఆలోచన వచ్చింది. వెంటనే అమలు చేశాడు. తన వద్ద ఉన్న కొద్దిపాటి డబ్బుతోనే తన బైక్‌నే ఓ మొబైల్‌ టిఫిన్‌ సెంటర్‌లా మార్చేశాడు.

నూడుల్స్‌, బ్రెడ్‌ ఆమ్లెట్‌ లాంటి తేలికపాటి స్నాక్స్‌, టీ తయారుచేసి పర్యాటకులకు విక్రయిస్తూ తన ప్రయాణం కొనసాగించారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, జమ్మూ కశ్మీర్‌, ఉత్తరాఖండ్‌, మేఘాలయ, మహారాష్ట్ర, సిక్కిం, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల మీదుగా జిబిన్‌ ప్రయాణించారు. సరిహద్దులను దాటి నేపాల్‌, మయన్మార్‌లోనూ పర్యటించారు. అలా 16 నెలల 17 రోజులపాటు ఈ జిబిన్‌ పర్యటన సాగింది. త్వరలో థాయ్‌లాండ్‌లో పర్యటించనున్నారు.

ఇవి కూడా చదవండి

జిబిన్ ‘కుంబు ట్రావెల్’ పేరుతో యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించాడు. జిబిన్ షేర్ చేసిన వీడియోలను గమనించిన తర్వాత పాలాలోని అతని స్నేహితులు, పరిచయస్తులకు అప్పుడు తెలిసింది.. తమ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు దేశవ్యాప్తంగా ప్రయాణిస్తున్నట్లు గ్రహించారు. యాత్ర గురించి తెలుసుకున్న తర్వాత పులియన్నూరు గ్రామ నివాసితులు తన సాహస యాత్రకు సహాయాన్ని అందించారు, ”అని జిబిన్ చెప్పారు.ఇప్పుడు జిబిన్ ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఓ చిన్న సైజ్ సెలబ్రెటీ. ‘కుంబు’ అనే పదం అతని ఇంటి పేరు కుంబుక్కల్ నుండి వచ్చింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..