Viral News: దివ్యాంగుడైన వృద్ధుడు వినతిని వినడానికి కదలి వెళ్లిన ఐఏఎస్ ఆఫీసర్.. మీరు సూపర్ అంటూ నెటిజన్ల ప్రశంసల వర్షం

జిల్లాలో అమ్రౌధ నగర్ పంచాయితీ నివాసి ధనిరామ్ అనే పెద్దాయన రాష్ట్ర ప్రభుత్వ పథకం కింద ఎలక్ట్రిక్ సైకిల్ కొనుగోలు చేయాలనీ భావించాడు. తన సమస్యను కలెక్టర్ కు చెప్పేందుకు ఆఫీసు దగ్గరకు వెళ్ళాడు. ఎండలో ఉన్న దివ్యాంగుడైన ధనీరామ్‌ దగ్గరకు స్వయంగా కలెక్టర్ సౌమ్య వెళ్లారు.

Viral News: దివ్యాంగుడైన వృద్ధుడు వినతిని వినడానికి కదలి వెళ్లిన ఐఏఎస్ ఆఫీసర్.. మీరు సూపర్ అంటూ నెటిజన్ల ప్రశంసల వర్షం
Ias Officer Saumya Pandey
Follow us
Surya Kala

|

Updated on: Apr 04, 2023 | 12:47 PM

ప్రభుత్వ అధికారులకు తమ సమస్యల గురించి చెప్పాలన్నా.. తమ గోడుని వినిపించుకోవాలన్నా సామాన్యులు గవర్నమెంట్ ఆఫీసు చుట్టూ తిరుగుతారు.  ఉన్నతాధికారులను కలిసి తమ బాధలను విన్నవించుకోవాలను ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు. అయితే ఒకొక్కసారి బాధితులను పట్టించుకునే అధికారులు ఉండరు. అయితే తాను అందరి ఆఫీసర్స్ కంటే భిన్నం అని నిరూపించారో ఒక ఐఏఎస్ అధికారిణి. ప్రభుత్వం ఇస్తున్న ఎలక్ట్రిక్ బైక్ ను తనకు మంజూరు చేయమని తన ఆఫీసు వద్దకు వచ్చిన వృద్ధుడిని చూసిన కలెక్టర్.. ఎండలో ఉన్న ఆ పెద్దాయన దగ్గరకు వెళ్లి మరీ సమస్యను తెలుసుకున్నారు. తాను ఖచ్చితంగా సాయం అందిస్తానని భరోసానిచ్చారు. ప్రస్తుతం నెట్టింట్లో ఇందుకు సంబంధించిన ఫోటో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళ్తే..

ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్ దెహత్ జిల్లాలో ఐఏఎస్ అధికారిణి సౌమ్య పాండే చీఫ్ డెవలెప్‌మెంట్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.  జిల్లాలో అమ్రౌధ నగర్ పంచాయితీ నివాసి ధనిరామ్ అనే పెద్దాయన రాష్ట్ర ప్రభుత్వ పథకం కింద ఎలక్ట్రిక్ సైకిల్ కొనుగోలు చేయాలనీ భావించాడు. తన సమస్యను కలెక్టర్ కు చెప్పేందుకు ఆఫీసు దగ్గరకు వెళ్ళాడు. ఎండలో ఉన్న దివ్యాంగుడైన ధనీరామ్‌ దగ్గరకు స్వయంగా కలెక్టర్ సౌమ్య వెళ్లారు. ధనీరామ్‌ సమస్యను అడిగి తెలుసుకున్నారు. కచ్చితంగా సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం వృద్ధులకు ప్రభుత్వం ఇస్తున్న అన్ని ప్రయోజనాలను పొందేలా అన్ని రకాల సహాయం అందించాలని సంబంధిత  అధికారిని ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

ఈ విషయాన్ని అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఐఏఎస్ ఆఫీసర్  హోదాలో ఉండి సామాన్యుడితో సౌమ్య పాండే ప్రవర్తించిన తీరుని ప్రశంసిస్తున్నారు. నవ భారత్‌లో సరికొత్త ఉత్తర్‌ప్రదేశ్ ఇది. ఇక్కడ వీఐపీ సంస్కృతి లేదు..  చూడండి ఐఏఎస్ అధికారి సామాన్యుడి దగ్గరకు వెళ్లి ఫిర్యాదు ఎలా తీసుకుంటున్నారో.. అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. మీ విధిని ‘నిజాయితీగా’ నిర్వర్తించారు మీరు నిజంగా గ్రేట్ మేడం అని అంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..