IAS Officer Dog: తప్పిపోయిన ఐఏఎస్ ఆఫీసర్ పెంపుడు కుక్క.. 3 రోజులుగా వెదుకుతున్న పోలీసులు.. పట్టిస్తే భారీ నజరానా..
ఢిల్లీలో నివసించే ఐఏఎస్ రాహుల్ ద్వివేదికి చెందిన రెండు పెంపుడు కుక్కలను కారులో భోపాల్‌కు తీసుకెళ్తున్నారు. కుక్కను చూసుకోవడానికి డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు కూడా కారులో ఉన్నారు. అయితే దారి మధ్యలో కారు డ్రైవర్ భోజనం చేసేందుకు బిలువా ప్రాంతంలో ఓ దాబా వద్ద కారు ఆపాడు.
రాజుగారి కుక్క కాబట్టి కొట్టడానికి వీల్లేదు’ అనే సామెతను గుర్తు చేస్తోంది.. ఓ ప్రభుత్వాధికారి వ్యవహారం. ఎందుకంటే ప్రస్తుతం మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ పోలీసులు కుక్కను వెతుకుతూ చెమటలుకక్కుతున్నారు. మరి పోలీసులు తీవ్రంగా వెతుకుతున్న కుక్క సాధారణ కుక్క కాదు.. ఐఏఎస్ అధికారి రాహుల్ ద్వివేది పెంపుడు కుక్క. ఢిల్లీలో నివసించే ఐఏఎస్ రాహుల్ ద్వివేదికి చెందిన రెండు పెంపుడు కుక్కలను కారులో భోపాల్‌కు తీసుకెళ్తున్నారు. కుక్కను చూసుకోవడానికి డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు కూడా కారులో ఉన్నారు. అయితే దారి మధ్యలో కారు డ్రైవర్ భోజనం చేసేందుకు బిలువా ప్రాంతంలో ఓ దాబా వద్ద కారు ఆపాడు. దీంతో కారులో కుక్కలతో పాటు ఉన్న అందరూ భోజనం చేసేందుకు కారు నుంచి కిందకు దిగారు.
అప్పుడు హఠాత్తుగా రెండు కుక్కలు గొలుసు తొలగించుకుని కారు నుండి కిందకు దూకి పారిపోయాయి. వెంటనే సిబ్బంది ఆ కుక్కలు పరిగెత్తిన వైపు.. తాము కూడా పరుగెత్తుతూ కుక్కలను వెంబడించారు. సుమారు ఒక కిలోమీటరు పరిగెత్తిన తర్వాత.. ఒక కుక్కను సిబ్బంది పట్టుకున్నారు. అయితే రెండో కుక్క సిబ్బందికి కనిపించలేదు. సిబ్బందితో పాటు.. ఆ కుక్క కోసం చాలామంది వెతికారు. అయితే ఎక్కడా కుక్క కనిపించలేదు.
మూడు రోజులుగా పోలీసుల నిరంతరం సోదా.. గత మూడు రోజులుగా గ్వాలియర్ పోలీసులు కుక్క ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఏమీ దొరకలేదు. తప్పిపోయిన కుక్కను కారులో ఢిల్లీ నుంచి భోపాల్‌కు తీసుకువెళుతున్నారని ఎవరికైనా కనిపిస్తే ఆచూకీ చెప్పమంటూ పోస్టర్స్ ను వీధి వీధి పోస్ట్ చేశారు.
IAS అధికారి రాహుల్ ద్వివేది ప్రస్తుతం ఢిల్లీలో విధులను నిర్వహిస్తున్నారు. రాహుల్ ద్వివేది మధ్యప్రదేశ్ కేడర్ IAS అధికారి అనయ్ ద్వివేదికి తమ్ముడు.
मध्य प्रदेश: ग्वालियर के बिलुआ इलाके से IAS अधिकारी का कुत्ता लापता हुआ। लापता कुत्ते की तलाश में पुलिस और प्रशासन जुटी हुई है।
डबरा SDOP विवेक शर्मा ने कहा, “बिलुआ इलाके में एक ढाबे पर कुछ लोग आए, तभी उनका कुत्ता उनकी कार से कूदकर निकल गया। वे दिल्ली से भोपाल जा रहे थे। शिकायत… pic.twitter.com/KSby6nURFy
— ANI_HindiNews (@AHindinews) April 3, 2023
కుక్క కోసం అన్వేషణలో నిమగ్నమైన పోలీసులు గ్వాలియర్ నగరంలో తప్పిపోయిన కుక్క ఫోటో ఉన్న పోస్టర్లను అతికించారు. అంతేకాదు కుక్క ఆచూకీ చెప్పిన వారికీ కుక్కను పట్టించిన వారికి తగిన రివార్డు ఇస్తామని ప్రకటించారు.
ఇదే విషయంపై దబ్రా ఎస్‌డీఓపీ వివేక్ శర్మ మాట్లాడుతూ.. ‘కొంతమంది బిలువా ప్రాంతంలోని ఓ దాబా వద్దకు వచ్చారు, అప్పుడు వారి కుక్క కారులోంచి దూకింది. ఢిల్లీ నుంచి భోపాల్ వెళ్తున్నది ఆ కారు. కుక్క తప్పిపోయింది అన్న ఫిర్యాదు అందుకున్న పోలీసులు సమీపంలోని రెస్టారెంట్లు, దుకాణాలకు సమాచారం అందించారు. కుక్కను కనిపెట్టిన వ్యక్తికి తగిన రివార్డును కూడా ప్రకటించి, పలు చోట్ల పోస్టర్లను కూడా అతికించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..