Viral Video: క్షణాల్లో వందల ఇడ్లీలు రెడీ.. బాస్‌ నీ ఐడియా అదిరిందంటున్న ఆనంద్ మహీంద్రా..

ఒక మాప్‌లాంటిది తీసుకొని ఎక్‌స్ట్రా పిండిని ఎంతో చాకచక్యంగా తొలగించాడు. వాటిని తీసుకెళ్లి స్టవ్‌పైన ఇడ్లీ స్టాండ్‌లో పెట్టాడు. ఇదంతా అతను క్షణాల్లో పూర్తి చేసేసాడు. అతను తయారు చేసిన ఇడ్లీలు కస్టమర్స్‌కే కాదు అక్కడికి వచ్చిన ఓ గోమాతకు కూడా ఎంతో ప్రేమగా పెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతూ పలువురి మనసు దోచుకుంటోంది.

Viral Video: క్షణాల్లో వందల ఇడ్లీలు రెడీ.. బాస్‌ నీ ఐడియా అదిరిందంటున్న ఆనంద్ మహీంద్రా..
Viral Video
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Apr 03, 2023 | 11:35 AM

తెల్లవారితే బ్యాచిలర్స్‌, ఫ్యామిలీస్‌ అనే తేడా లేకుండా టిఫిన్‌ సెంటర్‌ ముందు వాలిపోతుంటారు. ఉదయాన్నే టిఫిన్‌ చేసుకొని ఆరింటికే బస్సెక్కాలంటే ఎవరికైనా కష్టమే.. ఇలాంటి వారికోసమే టిఫిన్‌ సెంటర్స్‌ రారమ్మంటూ ఆహ్వానం పలుకుతుంటాయి. తాజాగా ఓవ్యక్తి కస్టమర్స్‌కోసం ఇడ్లీలు వేస్తున్న తీరు ఆకట్టుకుంటోంది. ఎంత వేగంగా వేస్తున్నాడంటే అతను కొన్ని నిమిషాల్లోనే వందల ఇడ్లీలు తయారు చేస్తున్నాడు. అతను పెద్ద ఇడ్లీ ప్లేట్లన్నీ ఓ బల్లమీద వరుసగా పేర్చి, దానిపైన ఆయిల్‌ స్ప్రే చేశాడు. తర్వాత ఓ పెద్ద పాత్రలో ఇడ్లీ పిండి తీసుకొని ఓ మగ్గుతో పిండిని ఇడ్లీప్లేట్లలో కుమ్మరించాడు.

అనంతరం ఒక మాప్‌లాంటిది తీసుకొని ఎక్‌స్ట్రా పిండిని ఎంతో చాకచక్యంగా తొలగించాడు. వాటిని తీసుకెళ్లి స్టవ్‌పైన ఇడ్లీ స్టాండ్‌లో పెట్టాడు. ఇదంతా అతను క్షణాల్లో పూర్తి చేసేసాడు. అతను తయారు చేసిన ఇడ్లీలు కస్టమర్స్‌కే కాదు అక్కడికి వచ్చిన ఓ గోమాతకు కూడా ఎంతో ప్రేమగా పెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతూ పలువురి మనసు దోచుకుంటోంది.

ఇవి కూడా చదవండి

ఈ ఆ వ్యక్తి వేగానికి చాకచక్యానికి, మూగజీవిపట్ల అతని ప్రేమకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. మన టెక్‌ దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా ఈ వీడియోను తన ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ‘‘ఇళ్లల్లో ఆడవాళ్లు నెమ్మదిగా, శ్రద్ధగా ఇడ్లీలు వేయడం మనం చూశాం. వ్యాపారులు ఇలా భారీ స్థాయిలో ఇడ్లీలు సిద్ధం చేస్తుంటారు. పద్ధతి ఏదైనప్పటికీ.. అందులో ఓ మానవీయకోణం, భారతీయత కొట్టొచ్చినట్టు కనబడుతుంది’’ అంటూ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. ఇప్పటికే ఈ వీడియోను 9 లక్షలమందికి పైగా వీక్షించారు. తమదైనశైలిలో కామెంట్లు చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..