AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cattle Holiday: అక్కడ పశువులకు ఆదివారం సెలవు .. 100 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం.. రీజన్ ఏమిటంటే..

జార్ఖండ్‌ రాష్ట్రంలో మనుషులకే కాదు జంతువులకు కూడా వారంలో ఒక రోజు సెలవు ఇవ్వబడుతుంది.  అంటే ఆదివారం పశువులకు సెలవు ఇస్తారు. ఈ రోజు పశువులకు మేత మాత్రమే ఇస్తారు. ఎటువంటి పని చేయించరు. మనుషుల మాదిరిగానే జంతువులకు కూడా విశ్రాంతి అవసరమని స్థానికులు నమ్మకం

Cattle Holiday: అక్కడ పశువులకు ఆదివారం సెలవు .. 100 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం.. రీజన్ ఏమిటంటే..
Weekly Holiday For Cattle
Surya Kala
|

Updated on: Apr 02, 2023 | 9:47 AM

Share

భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు, ఇతర ప్రైవేట్ సంస్థలు ఆదివారాలు సెలవులు.  వారానికో సెలవుతో ప్రజలు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటారని.. భావించి సదరు సంస్థలు.. వ్యక్తిగత పనిని పూర్తి చేయడానికి వారానికి ఒక రోజు విశ్రాంతిని ఇస్తారు. ఒక రోజు సెలవుని గడిపిన వ్యక్తులు.. తిరిగి తాము పని చేసే ప్రదేశానికి తిరిగి వచ్చినప్పుడు  మునుపటి కంటే ఎక్కువ శక్తితో పని చేయవచ్చని భావిస్తారు. అయితే ఇప్పటి వరకూ ఇలాంటి సెలవులు మనుషులకు మాత్రమే ఇస్తారన్న సంగతి తెలిసిందే.. అయితే భారతదేశంలో పశువులకు కూడా వారానికోసారి సెలవు దొరికే ప్రదేశం ఉంది.

ఆజ్ తక్ నివేదిక ప్రకారం.. జార్ఖండ్‌ రాష్ట్రంలో మనుషులకే కాదు జంతువులకు కూడా వారంలో ఒక రోజు సెలవు ఇవ్వబడుతుంది.  అంటే ఆదివారం పశువులకు సెలవు ఇస్తారు. ఈ రోజు పశువులకు మేత మాత్రమే ఇస్తారు. ఎటువంటి పని చేయించరు. మనుషుల మాదిరిగానే జంతువులకు కూడా విశ్రాంతి అవసరమని స్థానికులు నమ్మకం. అందుకే తమ పశువులకు ఒకరోజు సెలవు కూడా ఇస్తున్నారు.

ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్న 12 గ్రామాల ప్రజలు 

ఇవి కూడా చదవండి

సమాచారం ప్రకారం.. జార్ఖండ్‌లోని లతేహర్ జిల్లాలో పశువులకు ఒక రోజు సెలవు ఇచ్చే సంప్రదాయం ఉంది. జిల్లాలోని దాదాపు 20 గ్రామాల ప్రజలు గత 100 ఏళ్లుగా ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఈ గ్రామాల్లో ఆదివారాల్లో ఎద్దులు, ఇతర పశువులతో ఎలాంటి పని చేయించరు. పశువులకు ఆదివారం పూర్తి విశ్రాంతి ఇస్తారు. జిల్లాలోని హర్ఖా, మోంగర్, పరార్, లాల్‌గాడి సహా 20 గ్రామాల ప్రజలు తమ పశువులతో ఆదివారం పని చేయరు. ఆ రోజు పూర్తిగా పశువులకు కావాల్సిన మేత, పచ్చ గడ్డిని ఆహారంగా ఇస్తారు.

100 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం 

ఇలా పశువులకు విశ్రాంతి ఇచ్చే సాంప్రదాయం 100 ఏళ్లకు పైగా సాగుతోందని గ్రామస్తులు వీరేంద్ర కుమార్ చంద్రవంశీ, లాలన్ కుమార్ యాదవ్ చెబుతున్నారు. ఆదివారం పశువులను సెలవు ఇచ్చే నియమాలను తమ పూర్వీకులు రూపొందించారని.. అప్పటి నుంచి తాము ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామని చెబుతున్నారు. మనుషుల్లాగే పశువులకు కూడా విశ్రాంతి అవసరమని గ్రామస్తులు అంటున్నారు. రోజూ పనిచేసే పశువులు కూడా మనుషుల్లాగే అలసిపోతాయని తెలిపారు. ఇలా వారంలో ఒక రోజు సెలవు ఇవ్వడంతో.. వాటికీ అలసట నుండి ఉపశమనం లభిస్తుందని చెప్పారు. అనంతరం అవి మళ్ళీ ఉషారుగా పనిచేస్తాయన్నారు.

అందుకే ఆదివారం పశువులకు సెలవు 

వాస్తవానికి, 100 సంవత్సరాల క్రితం పొలంలో దున్నుతున్నప్పుడు ఒక ఎద్దు చనిపోయింది. అప్పుడు ప్రజలు ఎద్దు అధిక పని కారణంగా అలసిపోయిందని, దీని కారణంగా ఎద్దు చనిపోయిందని భావించారు. దీంతో గ్రామస్తులు కలిసి వారంలో ఒక రోజు పశువులకు విశ్రాంతి కల్పించాలని నిర్ణయించారు. అప్పటి నుంచి ఆదివారాల్లో పశువులకు సెలవు ఇచ్చే సంప్రదాయం పాటిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..