Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Man Bird Friendship: గాయపడిన కొంగకు చికిత్స చేసిన యువకుడు.. ఏడాదిగా ఇద్దరి మధ్య స్నేహం.. కేసు నమోదు చేసిన పోలీసులు..

కొంత తన సహజ వాతావరణంలో జీవించేందుకు వీలుగా రాయ్‌బరేలీలోని సమస్పూర్ అభయారణ్యంలో విడుదల చేశారు.  అయితే సరస్ అక్కడ నుంచి తన స్నేహితుడు ఆరిఫ్‌ను వెతుక్కుంటూ గ్రామానికి చేరుకుంది. అటవీశాఖ అధికారులు మళ్లీ పట్టుకున్నారు.  దీని తర్వాత సరస్ ను బహిరంగ ప్రదేశంలో ఉంచకుండా కాన్పూర్ జూలో ఉంచారు. కొంగ తినడం, తాగడం మానేసింది.

Man Bird Friendship: గాయపడిన కొంగకు చికిత్స చేసిన యువకుడు.. ఏడాదిగా ఇద్దరి మధ్య స్నేహం.. కేసు నమోదు చేసిన పోలీసులు..
Up Man Bird Friendship
Follow us
Surya Kala

|

Updated on: Mar 31, 2023 | 1:46 PM

కొంగతో స్నేహం చేసినందుకు ఓ యువకుడిపై ఎఫ్‌ఐఆర్ దాఖలైంది.  అంతేకాదు అతని నేరం నిరూపణ అయితే జైలు శిక్ష, జరిమానా కూడా విధించే అవకాశం ఉంది మరి ఆ యువకికి కొంగకు ఎలా పరిచయం ఏర్పడింది? ఎలా స్నేహం ఏర్పడిందో తెలుసుకుందాం..  ఉత్తర్ ప్రదేశ్ లోని అమేథీ నివాసి ఆరిఫ్ గుర్జార్..  సరయు  అనే కొంగ మధ్య స్నేహం ఏర్పడింది. ప్రస్తుతం  వీరిద్దరి మధ్య స్నేహం చర్చనీయాంశంగా మారింది.

ఆగస్ట్ 2022లో ఆరిఫ్ కొంగను కలిశాడు. ఆ సమయంలో కొంగకు గాయాలయ్యాయి. ఆరిఫ్ కొంగ ప్రాణాలు కాపాడి.. గాయాలకు చికిత్స చేశాడు. దీంతో అప్పటి నుంచి ఈ భారీ కొంగ సరయు ..ఆరిఫ్ కుటుంబంలో జీవించడం ప్రారంభించింది. నెలలు గడుస్తున్నా ఈ కొంగ తాను వచ్చిన ప్రాంతానికి వెళ్లకుండా.. ఆరిఫ్ తోనే ఉండడం ప్రారంభించింది. దీంతో ఆరిఫ్ సరయు ల స్నేహానికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం ప్రారంభించాయి.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోలు అటవీశాఖ అధికారుల దృష్టికి చేరుకున్నాయి. వెంటనే అటవీశాఖ అధికారులు సరయును ఆరీఫ్‌ నుంచి వేరు చేశారు. ఈ కొంత తన సహజ వాతావరణంలో జీవించేందుకు వీలుగా రాయ్‌బరేలీలోని సమస్పూర్ అభయారణ్యంలో విడుదల చేశారు.  అయితే సరయు అక్కడ నుంచి తన స్నేహితుడు ఆరిఫ్‌ను వెతుక్కుంటూ గ్రామానికి చేరుకుంది. అటవీశాఖ అధికారులు మళ్లీ పట్టుకున్నారు.  దీని తర్వాత సరయు ను బహిరంగ ప్రదేశంలో ఉంచకుండా కాన్పూర్ జూలో ఉంచారు. కొంగ తినడం, తాగడం మానేసింది.

మరోవైపు సరస్ క్రేన్‌ను రక్షించి ఏడాది పాటు జాగ్రత్తలు తీసుకున్న ఆరిఫ్ పై అటవీ శాఖ కేసు నమోదు చేసి నోటీసు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.  ఆరిఫ్ ఖాన్ గుర్జార్‌ క్రేన్‌ను  తన “కుటుంబ సభ్యుడిలా” చేసుకున్నట్లు అంగీకరించినట్లు అధికారులు పేర్కొన్నారు. శనివారం అటవీశాఖ డిపార్ట్‌మెంట్ గుర్జర్‌కు నోటీసు జారీ చేసింది. అతని స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయడానికి ఏప్రిల్ 4 న గౌరీగంజ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ కార్యాలయంలో హాజరు కావాలని కోరింది. అసిస్టెంట్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (గౌరీగంజ్) రణవీర్ సింగ్ జారీ చేసిన నోటీసు ప్రకారం.. గుర్జర్‌పై వన్యప్రాణుల రక్షణ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

పక్షిని తీసుకెళ్లిన అనంతరం సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ విలేకరుల సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా అటవీ శాఖ చర్యను ఖండించారు.  ప్రధాని నివాసంలో ఉన్న నెమళ్లను తీసుకెళ్లే ధైర్యం ఎవరికైనా ఉందా అని పరోక్షంగా ప్రశ్నించారు. గుర్జార్ మాజీ ముఖ్యమంత్రితో కలిసి వేదికపై కూర్చున్నారు కానీ మాట్లాడలేదు. పక్షితో “స్నేహం” కారణంగా ఖ్యాతి పొందిన తర్వాత అఖిలేష్ యాదవ్..  గుర్జర్‌ని కలిశారు.

అంతేకాదు  కొంగ, గుర్జర్‌తో కలిసి ఉన్న చిత్రాలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. యాదవ్ ఆరోపణలపై డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ డిఎన్ సింగ్ స్పందిస్తూ, “ఏ చర్య తీసుకున్నా ఆరిఫ్ (గుర్జార్) సమ్మతితోనే” అని అన్నారు. ఈ పక్షులు ఎప్పుడూ జంటలుగా జీవిస్తాయని అధికారి తెలిపారు. కొంగ ఒంటరిగా నివసిస్తున్నందున.. ఆ ప్రభావం కొంగపై పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..